Thursday, October 22, 2015

ఆంధ్రుల ఆత్మగౌరవం ఉందా ..?

ఆత్మగౌరవం ఆత్మాభిమానం పౌరుషం సిగ్గు ఎగ్గు ఏమాత్రం లేని ( మరచిపోయిన ) చేవ చచ్చిన దళారీ మనస్కులైన ( బ్రోకర్లు ) ఆంధ్రులకు స్పెషల్ స్టేటస్ , స్పెషల్ ప్యాకేజ్ లాంటివి ఏమీ ఇవ్వకపోయినా ఆ ఆంధ్రా బానిసలు ఏమీ పీకలేరని, ఆంధ్రులు వాజమ్మలని, దద్దమ్మలని, చవటలని, చేతగాని వెధవలని  దిల్లీకి బాగా తెలుసు.
పోరాటం అంటే ఏమిటో తెలియని ఆంధ్రులకు, అవసరాల కోసం ఎంతకైనా దిగజారే ఆంధ్రులకు ఏమీ ఇవ్వాల్సిన పనిలేదని, వాళ్ళు ఎలాగైనా ఎక్కడైనా బ్రతకగలరని దిల్లీకి బాగా తెలుసు.
వెన్నెముక లేని బానిస ఆంధ్రులు వాళ్ళ స్వార్ధం కోసం  ఎంతకైనా దిగాజారతారని, వాళ్ళు ఏమి చెయ్యమన్నా చేస్తారని, వాళ్ళ బ్రతుకుదెరువుకి  ఎవరినైనా పోగుడుతారని, ఎవరినైనా తిడతారని, వాళ్లకు సిగ్గు ఎగ్గు పౌరుషం ఏమాత్రం మచ్చుకైనా లేవని  ఇంటిలిజెన్స్ ద్వారా దిల్లీకి ఏనాడో సమాచారం చేరింది. దాని యొక్క రుజువే గత దశాబ్దంగా తీవ్రమైన పరుషమైన భాషతో ఆంధ్రులను ఆంధ్రా మహిళలను పిచ్చి తిట్టులు, కారు కూతలు కూసిన కెసీఆర్ ని అధికార పక్షం ఆహ్వానించడం, దాన్ని ప్రతిపక్షం కానీ లేదా  ఏ ఒక్కరు వ్యతిరేకించక పోవడం, అతని పేరు శిలాఫలకం మీద వెయ్యడం, అతనికి స్వాగత బ్యానర్లు పెట్టడం , అతను మాట్లాడుతుంటే చప్పట్లు ఈలలు వెయ్యడం నిదర్శనం. నేడు ఆంధ్రాలో అధికారపక్షం ఒక బానిసల సమూహం, ప్రతిపక్షం ఒక శిఖండి. ఆంధ్రాలో ప్రతిపక్షం  అది ఒక లంపెన్ గ్యాంగు, అది ఒక అరాచకుల, సంఘ వ్యతిరేకుల వేదిక, ఆ నాయకుడు ఒక మాఫియా లేదా ఒక నేరసామ్రాజ్య డాన్ మనస్కుడు.
రాజకీయంగా దేశములో ఎంతో చైతన్యవంతమైనది అని చెప్పుకునే విజయవాడ లో నేడు ఈ పరిస్థితి దాపురించడం బానిస దళారీ ఆంధ్రుల మానసిక పరిస్థితికి నిదర్శనం.
కనీసం విజయవాడలో గానీ ఆంధ్రాలో గానీ ఒక్కడంటే ఒక్కడు ( రాజకీయనాయకుడు లేదా పౌర సమాజం ) కెసీఆర్ రాకను ఖండించడం గానీ , వ్యతిరేక ప్రదర్శనలు చెయ్యడం గానీ మనము చూడలేకపోయాము. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ ఊదరగొట్టే  ఈనాడు రామోజీరావు  కూడా నలుగురు మధ్య ( బీజేపీ తెదేపా వైసీపీ టీఆరెస్ ) ఒక దళారీలాగా ప్రవర్తించి రాజీలు చేసాడు. మరి ఈయనకు ఆత్మగౌరవం అంటే అర్ధం తెలుసా ..? ఈయనకు అసలు
ఆత్మగౌరవం  ఉందా ..?
ప్రతిపక్షం కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రవర్తించింది. జగన్ కి కెసీఆర్ కి మధ్య ఉన్న సత్సంబంధాలు వలన ఒక జాతిద్రోహి ఒక జాతి విద్వేషి వస్తుంటే అడ్డుకోలేకపోగా కనీసం ఖండించను కూడా ఖండించలేదు.
కనీసం .. ఆంధ్రులు తమిళులను ఆదర్శంగానన్నా తీసుకోలేదు. శ్రీ లంక మాజీ అధ్యక్షుడు శ్రీ రాజపక్సే తిరుమలకు వస్తుంటే తమిళులు వారి రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి తిరుమలలో శ్రీ రాజ పక్సేకి వ్యతిరేకముగా నిరసనలు చేసారు. నిన్న కనీసం అలాని వ్యతిరేక ప్రదర్శనలు కాదు కదా అతనికి కొంతమంది విజయవాడలోని తార్పుడుగాళ్ళు, బ్రోకర్లు , బానిసలు స్వాగత తోరణాలు కటౌటులు పెట్టడం సిగ్గు చేటు, శ్రీ కెసీఆర్ మాట్లాడుతుంటే కనీసం పదిమంది లేగిచి నిలబడి నిరసన కూడా వ్యక్తం చెయ్యకపోవడం ఆంధ్రుల దౌర్భాగ్యం.
ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదముతో స్థాపించిన తెదేపా అధికార పక్షములోని వారు ఒకాదంటే ఒక్కడు కూడా తమ నాయకుని చేష్టలని ప్రశ్నించకపోవడం, నిరశించాకపోవడం  వాళ్ళ బానిస భావదారిద్ర్యం.
మరి ఆరోజులలో ఈ వెధవలు అందరు సమైక్యం పేరుతొ ధర్నాలు నిరసనలు నిరాహారా దీక్షలు ఎందుకు చేసారు ? ఎవరిని మోసం చెయ్యడానికి చేసారు ?  మరి ఆరోజులలో కెసీఆర్ కి వ్యతిరేకముగా ఎందుకు ప్రజల్ని రెచ్చగొట్టారు ? హైదరాబాదులోని ప్రజల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి మీరు అందరు చేసిన డ్రామాలు / నిర్వాకాలు ఏమిటి ? ఇలా చేసిన ఈ రాజకీయనాయకుల, నేడు అధికార ప్రతిపక్షాల  వీళ్ళ పుట్టకే ప్రశ్నార్ధకం, వీళ్ళ తల్లులు మాత్రమె సత్యం. ఇలా తెలుగుజాతిని వంచనకు గురిచేసిన వీళ్ళు వీళ్ళ తరతరాలు సర్వనాశనం కాక తప్పదు. ఆత్మగౌరవం పౌరుషం పోరాటం అనేవి మరచిన  ఈ ఆంధ్రుల భవిష్యత్తు కూడా వంచనకు గురికాక తప్పదు .... సువేరా

Sunday, October 18, 2015

చీకటి రోజు...........

అమరావతి పట్టణ శంఖుస్థాపన శుభాకార్యక్రమానికి శ్రీ చంద్రబాబునాయుడు గారు స్వయాన వెళ్లి శ్రీ కెసీఆర్ & అతని కుటుంబాన్ని పౌరుషం లేకుండా ఆహ్వానించడం తెలుగుజాతికి సిగ్గుచేటు, ఆంధ్రులకు తలవంపు. ఇటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు, ఇది ఒక చీకటి రోజు.
దశాబ్దం పాటు ఆంధ్రులను తీవ్రంగా దుర్భాషలాడి తిట్టిన తిట్టు తట్టకుండా తిట్టి, ఆంధ్రులను ఆంధ్రా మహిళల్ని అవమానానికి గురిచేసిన చేస్తున్న వ్యక్తులను, టాంకు బండు మీద విగ్రహాలను కూల్చిన వ్యక్తులను ఇటువంటి శుభాకార్యక్రమాలకు పిలవడం తగదు, ఒకవేళ ఇది చంద్రబాబు గారిదో లేక తెదేపాదో ప్రైవేటు కార్యక్రమము అయితే ఎవరికీ అబ్యంతరము ఉండాల్సిన పనిలేదు, కానీ ఈ కార్యక్రమం మనసు గాయపడిన దగాపడిన అయిదు కోట్ల తెలుగువారి తెలుగుజాతి కార్యక్రమం.
ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా ఇలా వెళ్లి ఆహ్వానించడాన్ని జీర్ణించుకోలేరు, ఆత్మగౌరవం లేనివాళ్ళు ఈ పిలుపుని ఈ ఆహ్వాన చర్యను నిస్సిగ్గుగా సమర్దిస్తారని తెలుసు, కానీ వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఒక వేళ ఇలా పిలవడం వలన శ్రీ కెసీఆర్ & కో గనక సిగ్గు శరము నీతి జాతి లేకుండా తగుదునమ్మా అంటూ ఆ కార్యక్రమానికి హాజరు అయితే పరిపూర్ణమైన అమరావతి నిర్మాణం జరగదు గాక జరగదు.
హైదరాబాదు ఎల్ & టీ మెట్రో రైలు నిర్మాణములో నిర్మాణ పనులకు కావాల్సిన ఇసుక సిమెంటు స్టీలు రెడీ మిక్స్ లాంటివి సరఫరా కాంట్రాక్టు పొందిన ( కాంట్రాక్టులు పొందినట్టు వచ్చిన ఆరోపణలు ) జాగృతి నాయకురాలు రేపు ఆ అమరావతి పట్టణ నిర్మాణములో కూడా అదే కాంట్రాక్టులు పొందినా ఆశ్చర్యము లేదు, విశాల హృదయులు అయిన ఆంధ్రా నేతలు నిస్సిగ్గుగా ఇచ్చినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటె వారు వారు ఒక్కటే కదా, ప్రజలు కార్యకర్తలే సమిధలు.
సిగ్గు ఎగ్గు పౌరుషం ఆత్మగౌరవం లేకుండా అధినాయకులు చేస్తున్న వికృత చేష్టలను చూస్తూ ఇదంతా మన ఖర్మ అనుకుని మౌనంగా బాధతో బరువెక్కిన గుండెలతో శిలల్లాగా మిగిలిపోక ఏమీ చెయ్యలేము...... సువేరా

Friday, October 16, 2015

భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో.............

నిన్నటి రోజు భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో మరో చీకటి రోజు.
ఆ చీకటిలో ఒక చిరు కాంతిరేఖ మన తెలుగు వ్యక్తీ కావడం నాకు అత్యంత  ఆనందదాయకం గర్వకారణం. ఈయన నేటి న్యాయవ్యవస్థలో మరో వివేకానందుడు.
 ఇటువంటి కాంతిపుంజాలు మన న్యాయవ్యవస్తలోను రాజకీయ వ్యవస్థలోను విరజిమ్మాలని మన దేశానికి మన యువతకు వెలుగునివ్వాలని, మన యువత ఇటువంటి వారిని ఆదర్శముగా తీసుకుని దేశాన్ని ప్రపంచానికే గర్వకారణంగా మార్చాలని కోరుకుంటున్నాను.
నేను ఈరోజు మీముందు మాట్లాడగలిగే అర్హత జ్ఞానం ధైర్యం నాకు లభించడం ఆ కాంతిరేఖ యొక్క ప్రసరణ నామీద ఉండడమే, అది నా అదృష్టం.

అసలు విషయానికి వస్తాను .................,
ఇప్పటికే మన న్యాయవ్యస్త చాలావరకు బూజుపట్టి బుగిలిపోయింది, అది ఏనాడైనా కూలిపోయే రోజు కనిపిస్తోంది. నేడు వారసత్వ కబంద హస్తాలలోకి మన న్యాయవ్యవస్థ శాశనవ్యవస్థ అధికారవ్యవస్థ వెళ్ళిపోతున్నాయి, వారికి నేడు దళారీ తారుపుడుగాళ్ళ మీడియా కూడా వాళ్ళ ఆస్తులు అక్రమాలు కాపాడుకోవడానికి  కొమ్ముకాస్తోంది, ఈ వ్యవస్థలన్నీ  చాలావరకు కలిసిపోయి ఒక మాఫియాలాగా తయారయి మన దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని దోచుకుంటూ వ్యవస్థీకృత సామ్రాజ్యాన్ని సృష్టిస్తూ తమ వారసత్వ సంపదలాగా మారుస్తున్నారు.
నిన్న మన భారత సుప్రీం కోర్టు లో  అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం న్యాయమూర్తుల నియామక విషయములో నలుగురు  సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెలువరించిన అన్యాయ తీర్పు భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు, భారత రాజ్యాంగ వ్యవస్తకే మాయని మచ్చ, ఇది ఒక రకముగా అహంకార పూరిత తీర్పు, ఇది ఒక వ్యవస్తీకృత న్యాయవ్యవస్త తన నియంతృత్వాన్ని నిలుపుకోవడానికి అర్రులు చాస్తూ ఇచ్చిన దుర్మార్గపు తీర్పు.
కొన్ని సంవత్సరాలుగా మన దేశములో నడుస్తున్న కోలీజియం న్యాయవ్యవస్త  అసమర్ధులను దళారీలను అవినీతిపరులను రాజకీయ పార్టీల ఏజంట్లను కనీసం న్యాయశాస్త్రములొ అక్షరం ముక్క తెలియని కాపీలు కొట్టి ఉత్తీర్ణులైన వారిని ఉన్నత న్యాయస్థానాలలో చాలామందిని న్యాయముర్తులుగా నియమించడం మనకు తెలిసిందే , ఇది లోక విదితమే, ఇది మన భారత ప్రజల దౌర్భాగ్యం.
ఇలా నియమించబడిన వారి చేతిలో మన న్యాయవ్యవస్థను ప్రజల భవితను మన రాజ్యాంగాన్ని అప్పచెప్పడం మన ఖర్మ. వీరందరూ న్యాయాన్ని రాజ్యాంగాన్ని నడిబజారులో అపహాస్యం చెయ్యడం కూడా విదితమే. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక హైకోర్టులో ఉన్నత న్యాయమురులుగా నియమించడానికి  13 మంది అభ్యర్ధుల దగ్గర ఒక్కో అభ్యర్ధి ( హైకోర్టు న్యాయవాదులు ) దగ్గర అక్షరాల మూడు కోట్ల రూపాయిలు చొప్పున వసూలు చేసిన వ్యక్తీ ఎవరో, ఏజెంట్లు ఎవరో  మూసినది ఒడ్డున ఎవరిని అడిగినా చెబుతారు, ఈ వ్యవహారం బహిర్గతం అయిన తరువాత ఆ పేర్లను వెనక్కి పంపించివేయడం జరిగింది ( ఒకవేళ ఇది బయట పడకపోయి ఉంటె మన ఖర్మ కాలి వాళ్ళు నేడు మనకు న్యాయమూర్తులు అయ్యేవారు ). ఇలా జరిగిన సంఘటనలు భారతదేశ న్యాయవ్యవస్థలో చాలా ఉన్నాయి. ఇలా అక్రమంగా నియమించబదినవారు నేడు వారి ఏజంట్ల ద్వారా, తమ కుటుంబసభ్యుల ద్వారా బహిరంగాముగానే కేసునిబట్టి వెలకట్టి వసూళ్లు చెయ్యడం కోర్టు వ్యవహాలలో అబున్హవం ఉన్నవారు ఎవరైనా చెబుతారు.
కొంతమంది వ్యక్తిత్వం లేని వారు ఇలా న్యాయముర్తులుగా నియమించిన తరువాత వారిని ఎవరు ప్రశ్నించకుండా ఉండటానికి సమాజాన్ని భయపెట్టడానికి కోర్టులోనూ బయట ఎవ్వరు వారిని ఎదిరించకుండా ఉండటానికి వారిచేతిలో ఒక దుర్మార్గపు అస్త్రం " కన్టేమ్ప్ట్ ఆఫ్ కోర్ట్ " . ఇది వెధవల్ని ఆ వెధవలు చేసే పనుల్ని కప్పిపెట్టదానికే ఉపయోగపడుతోంది.  ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఉండే క్రింది స్థాయి కోర్టులలో కూడా నియామకాల్లో అక్రమాలు అవినీతి  జరుగుతూ కోట్లరూపాయిలు చేతులుమారడం అందరికీ తెలిసిందే.
చాలామంచి మార్కులతో ఉత్తీర్ణులు అయినవారు న్యాయశాస్త్రంలో మంచి అవగాహన ఉన్న నీతిమంతులు నేడు క్రింద స్థాయిలోనే ఉండిపోతున్నారు, అటువంటివారు మేజిస్త్రేటులుగాను, జిల్లా న్యాయముర్తులుగానే మిగిలిపోతున్నారు.
నిన్న కోలీజియం వ్యవస్థను సమర్ధించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో చాలా అసందర్భ అహంకార వ్యాఖ్యలు చూస్తుంటే ఇటువంటి వ్యక్తులు మనకు అత్యంత ఉన్నత న్యాయమూర్తులు అవ్వడం చూస్తుంటే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు ఉంది.
నిన్నటి తీర్పులో న్యాయమూర్తి శ్రీ చలమేశ్వర్ గారు నడుస్తున్న న్యాయవ్యస్త నియామకాల్లో చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు ఎత్తి చూపిన లోపాలు ప్రజలకు కూడా చేరువవ్వడం సంతోషదాయకం.
ఆయన ఒక జ్ఞాని, ఒక తాత్వికుడు, ఒక నిండు కుండ. ఇటువంటివారు నేడు మన న్యాయవ్యవస్థలో చాలా తక్కువగా ఉన్నారు, ఇటువంటివారికి మనుగడ ఉండనివ్వని నేటి వ్యవస్థలో మనం ఉండటం ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

Monday, October 5, 2015

ఒక తెలుగు వాడి విన్నపము.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని నమస్కరించి ఒక తెలుగు వాడిగా చేసుకునే విన్నపము.
అయ్యా ,
మన ప్రియతమ నాయకుడు కీశే నందమూరి తారక రామా రావు గారు తెలుగుజాతి గురించి భవిష్యత్తు తరాలవారికి తెలియచెప్పడం కోసం ఆనాడు హైదరాబాదు సచివాలయానికి ఎదురుగా తెలుగుతల్లి విగ్రహము మరియు టాంకు బండ్ మీద మన తెలుగుజాతి మరియు తెలుగుభాష గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపజేసిన లబ్దప్రతిష్టుల కాంశ్య విగ్రహాలను నెలకొల్పడం జరిగింది, ఆ విగ్రహాలు హైదరాబాదు నగరానికే వన్నె తెచ్చాయి.
కానీ కాలగమనములొ తెలుగుజాతి యావత్తు సిగ్గుతో తలదించుకునే విధంగా జరిగిన నికృష్ట రాజకీయ స్వార్ధ పరిణామాలతో హైదరాబాదు కీర్తి మసకబారడం అందరికీ తెలిసిందే. కొంతమంది కుక్కమూతి పిందెలు మన భాషను యాసను మన తెలుగుజాతి దివ్వెలను హేళన చెయ్యడం , ఆ విగ్రహాలను అనాగరిక సంస్కారముతో ఒక కుటుంబం ఆనాటి కుసంస్కార కాంగ్రెస్ ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసు పహారాలో ద్వంసం చెయ్యడం కూడా మన కళ్ళముందే జరిగింది.
జరిగిన దానిని గుడ్లప్పగించి మౌన రోదనతో తెలుగుజాతి యావత్తు భరించింది. ఏది ఏమైనా తెలుగుజాతికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
తెలుగుజాతిని తార్పుడుగాళ్ళు తాగుబోతులు చీలికలు పీలికలుగా చేసేసారు.
గతం గతః
మన పదహారు అణాల స్వచ్చమైన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక, మనకు చారిత్రిక అమరావతిని మీ నాయకత్వములో రాజధానిగా ప్రకటించి నిర్మాణం మొదలు పెడుతున్న సందర్భములో ఇక్కడ హైదరాబాదులో సచివాలయము ఎదురుగా ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని, టాంక్ బండ్ మీద ఉన్న మన తెలుగువెలుగుల విగ్రహాలని అన్నిటికూడా తక్షణమే విజయవాడ కృష్ణమ్మ ఒడ్డుకి గానీ లేక అమరావతి నగర నడిబొడ్డుకు గానీ తరలించి మన తెలుగు జాతి మనోభావాలను కాపాడతారని ఆశిస్తున్నాను. వీలయితే ఈనెల అక్టోబరు 22 తేదీనే మనమే గౌరవంగా మేళతాళాలతో ఆ విగ్రహాలను మన స్వచ్చ తెలుగు రాష్ట్రానికి తరలించే ఏర్పాటు చెయ్యగలిగితే ఆ ఘట్టం కూడా మీ చేతులతో మన తెలుగుజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించ బడుతుంది.
ఇక్కడ మన తెలుగుజాతి వెలుగు దివ్వెల విగ్రహాలు ఉండటం ఏమాత్రం మనకు గౌరవప్రదము కానేకాదు.
ఇక్కడ కొన్ని విగ్రహాలను స్వార్ధ రాజకీయ ఓటు బ్యాంకు ఉద్దేశ్యముతో తెలంగాణా ప్రభుత్వమూ ఏర్పాటు చేస్తోంది అనే విషయము మీకు తెలియనిది కాదు, ఆ విగ్రహాల పక్కన లేదా అదే ప్రదేశములో మన చారిత్రిక పురుచుల గొప్పవాళ్ళ విగ్రహాలను ఉంచడం మన గొప్పవాళ్ళను మనము అవమానపరచడమే అవుతుంది.
ఈ విషయాన్ని శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి మంత్రివర్గం మరియు ఆయన సలహాదారులు కూడా సానుకూలముగా తెలుగు వారిగా వివేకముతో ఆలోచించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి మరియు విశాలాంధ్ర మహాసభ వ్యవస్థాపక సబ్యుడు
భవదీయుడు
సుంకర వెంకటేశ్వర రావు ( ఎస్వీరావు ) @ సువేరా @ కొండయ్య

బెజవాడ బెమ్మీలు

వాళ్లకి వాళ్ళు గొప్ప పెపంచ మేధావులు అని, దేశ భక్తులు అని ఒక గొప్ప ఫీలింగు.
వీళ్ళకు  మేమే గొప్ప వాళ్ళం  అని చాలా నమ్మకం, ఇప్పుడే వచ్చిన నడమంత్రపు సిరితొ. హైదరాబాదు వాళ్ళు అంటే చులకన.
కోతికి కొబ్బరికాయ దొరికితే ఏదో చేసినట్టు, వీళ్ళకి అర్ధంతరంగా గుర్తింపు వచ్చేసింది, దానితో వీళ్ళకు కాళ్ళ కింద ఉన్నది ఆకాశం పైన ఉన్నది భూమి అన్నట్టు అయింది.
వీళ్ళకు ఆంధ్రా ప్రాంతము మీద అంత ఆప్యాయత ప్రేమ ఉంటె పదేళ్ళ క్రితమే జై ఆంధ్రా అంటే పోయేది కదా .. కానీ ఒక్కడు కూడా అన్న పాపాన పోలేదు.
వాళ్ళు ప్రపంచానికి నీతులు చెబుతారు కానీ ఒక్కడు కూడా పుట్టిన ఊళ్ళో ఒక్క పాయఖానా కూడా కట్టించిన పాపాన పోలేదు,  
వాళ్లకి నవ్వుకి ఏడుపుకి తేడా తెలియడంలేదు,
ఆకుకి పువ్వుకి తేడా తెలియడంలేదు,
చెబితే వినరు, గిల్లితే ఏడుస్తారు,
వాళ్ళే బెజవాడ బెమ్మీలు,
బెజవాడ బెమ్మీలు చాలామంది కమ్మనైన చిడతల భజనలో ప్రపంచ దిట్టలు.చిడతల భజనలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టేతట్టున్నారు.

Sunday, October 4, 2015

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు 18 మార్గాలలో దేవుడిని ఎలా చేరుకోవచ్చు అని మాత్రమె చెప్పాడు, 
కానీ, ఆయన కలికాలములో 19 వ మార్గము కూడా ఒకటి వస్తుంది అని , దానితోపాటు కూడా దేవుడిని చేరుకోవచ్చు అని చెప్పలేకపోయాడు లేదా ఊహించలేకపోయాడు.
ఆ 19 వ మార్గమే నేటి ఆధ్యాత్మిక వేలంవెర్రి మార్గం. 
ఇందులో గురువులు ప్రవక్తలు మొదలు అనుసరించే అందరు వెర్రిబాగుల వాళ్ళే.
ఆ మార్గాన్ని నేడు పండితులు పామరులు విద్యావంతులు గుడ్డిగా అనుసరిస్తున్నారు, ఈ మార్గాన్ని నేడు మీడియా మరియు పండితులు పీఠాధిపతులు ప్రవక్తలు బాగా వాడుకుని అన్నివిధాలా ఆరితేరిపోతున్నారు.
కానీ ఈమార్గములొ ప్రయాణం చేసేవారు చేరుకునేది దేవుడిని కాదు ... పిచ్చి ఆసుపత్రినే సుమా ...!

Saturday, October 3, 2015

అడిగేవి , అడగాల్సినవి చాలా ఉన్నాయి...కానీ సమాధానాలే ఉండవు

పార్టీ పుట్టిన నాటినుండి పార్టీనే నమ్ముకుని పార్టీని రాక్షసుల మధ్య బ్రతికిన్చుకుంటూ వస్తున్నా వాళ్ళు 2004, 2009,2014 ఎన్నికలలో పార్టీ పోకడల మీద ప్రజలో ఒక వ్యతిరేక గాలిలో  రాష్ట్ర వ్యాప్తంగా చాలా పటిష్టమైన ప్రదేశాలలో కూడా ఓడిపోయిన సందర్భములో, నేడు పార్టీ అధిష్టానం కొన్ని చోట్ల అలా ఓడిపోయినా ప్రాంతాలలో అక్కడ ప్రతిపక్షములో ( వైఎస్సార్ కాంగ్రెస్ ) గెలిచినా వారిని తెదేపాలోకి తీసుకురావాలను కోవడం రాజకీయ పలాయనవాదమె కదా ...!
ఒకవేళ అలా ఓడిపోయినవారు పార్టీకి పనికిరాకపోతే చాలామంది ఓడిపోయినా వారికి పార్టీలు తరచుగా మారిన వారికి పిలిచి మంత్రిపదవులు ఎలా ఇచ్చారు ?
అలా ఇచ్చిన వారిలో
1. శ్రీ యనమల రామకృష్ణుడు ... ఈయన ఎన్నిసార్లు ఓడిపోలేదు ? ఓడిపోయినా ఈయనకు  ఈయనకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు ?
2. శ్రీ ఘంటా శ్రీనివాసరావు ... ఈయన ఎన్ని పార్టీలు మారాడు ? ఈయన పార్టీకి ఎంత సేవ చేసాడని పిలిచి మంత్రి పదవి ఇచ్చారు ?
3. శ్రీ నారాయణ ( నెల్లూరు ) .... ఈయనకు పార్టీలో సభ్యత్వం ఉందా ? ఈయన బయటపడి పార్టీ కోసం ఎప్పుడన్నా పనిచేశారా ? ఈయన ఆనాడు వైఎస్సార్ కి చాలా అత్యంత సన్నిహితంగా మేలగాలేదా ? ఈయనకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు ?
4. శ్రీ కిషోర్ బాబు .... ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ? ఈయన పార్టీకి చేసిన సేవలు ఏమిటి ? ఈయనకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు ?
5. శ్రీ లోకేష్ ... ఈయన వయసెంత ? ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చి క్రియాశీలకంగా పనిచేసాడు ? ఈయన ఎన్ని ఎన్నికలో పోటీ చేసాడు ? ఎన్ని గెలిచాడు ? ఎన్ని ఓడాడు ?  ఈయన పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసాడని అప్పుడే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు ? ఈయన అధినేత  కొడుకు / వారసుడు తప్పించి  ఈయనకు ఉన్న అర్హతలు ఏమిటి ? పార్టీకోసం 30 ఏళ్ళుగా పనిచేస్తున్నవారు ఈయన కంటే చురుకైన వాళ్ళు మేధావులు లేరా ? దొరకలేదా ?
6. శ్రీ మండలి బుద్ధప్రసాద్ ... ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ? ఈయన అవనిగడ్డ ప్రాంతములో పార్టీకి చేసిన ద్రోహం ఎంత ? ఈయనకు డిప్యూటి స్పీకర్ పదవి ఎలా ఇచ్చారు ?
7. శ్రీ పిన్నమనేని వెంకటేశ్వరరావు ... ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ? ఈయన పార్టీకి చేసిన సేవలు ఏమిటి ? ఈయనకు ఆప్కాబ్ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు ?
8. శ్రీ కూచిభొట్ల ఆనంద్ ... ఈయనకు పార్టీలో సభ్యత్వం ఉందా ? ఈయనకు పార్టీ ఆఫీసు మెట్లు ఎలా ఉంటాయో తెలుసా ? ఈయనకు కూచిపూడి  నాట్యానికి ఏమన్నా సంబంధం ఉందా ? ఈయనకు ఆ పదవి ఎలా ఇచ్చారు ? ఇతను కళని అమ్ముకునే ఒక కమర్షియల్  ఈవెంట్ ఆర్గనైజర్ మాత్రమె కదా ?
9. శ్రీ పోట్లురి హరికృష్ణ .... ఇతనికి అధికార భాష సంఘం అధ్యక్షినిగా పదవి ఇచ్చారు ? ఇతని అర్హతలు ఏమిటి ? ఇతని వయసెంత ? ఇతనికి తెలుగు భాషలో ఉన్న అర్హత గుర్తింపు ఏమిటి ? ఇతని ఎన్ని సంవత్సరాలుగా పార్టీకి పనిచేసాడు ? ఎక్కడ చేసాడు ఏమి చేసాడు ?
10. శ్రీ జూపూడి ప్రభాకర్ , శ్రీ డొక్కా మాణిక్య ప్రసాద్ ... వీళ్ళు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ? వీళ్ళు పార్టీకి చేసిన సేవ ఏమిటి ? వీళ్ళకంటే గొప్పవాళ్ళు పార్టీలో లేరని వీరిద్దరికీ అధికార ప్రతినిధుల పదవులు ఇచ్చారా ?

ఇంకా చాలా ఉన్నాయి అడిగేవి , అడగాల్సినవి.
కానీ సమాధానాలే ఉండవు .
సమాధానాలు చెప్పలేక సమాధానాలకి బదులు పెంపుడు వీధి కుక్కలు మాత్రం మొరగాడానికి కరవడానికి సిద్ధం. 

Friday, October 2, 2015

గోమాత ....రైతు

గోమాతను కాపాడాల్సిందే , నిజమే
కాపాడుకుందాం ..........!
మరి ఆ గోవులను మేపే
రైతు సంగతి ఆలొచించవద్దా ...?
మా గ్రామములో ( కృష్ణాజిల్లా, మొవ్వ మండలం , పెదముత్తేవి గ్రామము ) శ్రీ క్రిష్ణాశ్రమంలో 400 ఆవులతో  నిస్వార్ధంగా ఒక  గోశాల నడుపబడుతోంది, ఆ గోశాల నడపడానికి వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో , ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ  దేవునికే ఎరుక. ప్రతి సంవత్సరం పశుగ్రాసం దొరకక వారు పడే అవస్థలు చూస్తుంటే మనకు మనసు వికలం అవుతుంది. ఎక్కడా పైసా లాభం ఆశించకుండా కేవలం మన ధర్మం మీద నమ్మకముతో మాత్రమె నిర్వహిస్తున్నారు.

పట్టణాలలో ఫ్యాన్ల కిందా ఏసీ గదులలోను పడక కుర్చీలలోను కూర్చుని సేదతీరే వాళ్ళు రోజూ  టీవీల ముందు కూర్చుని గోమాతని కాపాడుకోవాలి అని  ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పెద్దలు పండితులు స్వాములు పీఠాధిపతులు కనీసం ఆ గోవులను పెంచిపోశించే రైతు కూలీ వ్యవస్థ వాళ్ళ సాధకబాధలు గురించి కనీసం మాట్లాడరే ...? ఎంతసేపు గోమాతను పూజిస్తే పుణ్యం , గోమాతను పెంచితే స్వర్గం అని ప్రజలకు చెబుతుంటారు, మరి వాటినే నమ్ముకుని ఇన్నాళ్ళు వ్యవసాయం చేసుకునే రైతులు నిత్యమూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీళ్ళు ఆ రైతన్నలకు బాసటగా నిలిచే విధంగా ప్రజల్ని తమ ఉపన్యాసాలతో కదిలించావచ్చు కదా ...!
ఏ రైతు కూడా తమ పిల్లలతో పాటు పెంచుకునే చూసుకునే పశువుల్ని / గోవుల్ని కబెళాకు , కటిక వాళ్ళకు అమ్ముకోవడానికి కావాలని ప్రయత్నించడు. సరైన వర్షాలు నీళ్ళు పంటలు లేక  ఆ రైతన్న పెంచుకునే పశువులు / ఆవులు పశుగ్రాసం లేక అవస్థ పడుతూ ఉంటె వాటి ఆకలి బాధ చూడలేక తను మానసికముగా చచ్చిపోయి వాటిని కబేళాలకు అమ్ముకుంటాడు , ఆ తరువాత అతను కూడా  మానసికవేదనతో నిత్యమూ చస్తూ బ్రతుకుతుంటాడు.
ఆ పండితులకు స్వాములకు పెద్దలకు పశు జాతి మీద  నిజమైన ప్రేమ మమకారము ఆప్యాయత ఉంటె వీళ్ళు వారి సంపాదనలో కనీసం ఒక పది శాతం గోరక్షణ కోసం రైతు నిధికి ఇవ్వొచ్చు , కానీ వీళ్ళు అలా చెయ్యరు , వీళ్ళకు చితికేయ్యగానే పుణ్యం రావాలి , వీళ్ళు ఎవరి కష్టాలు తీర్చకుండా మాయలతో స్వర్గలోకానికి వెళ్లిపోవాలి , అక్కడ రంభ ఊర్వసి మేనక తిలోత్తమాలతో కులకాలి ... అదీ నేటి కాషాయం కధ.
ఇలా పచ్చి నిజాలు నాలాంటి వాళ్ళు ఎవరన్నా బయటకు అంటే వీళ్ళకు మనుషులకు వచ్చినంత కోపము ఆవేశము వస్తాయి .


దేశ భాషలందు తెలుగు లెస్స .

గతమెంతో ఘనకీర్తి కలవాడ ......దేశ భాషలందు తెలుగు లెస్స .
గౌరవనీయులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రివర్యులు గారికి నమస్కరించి సుంకర వెంకటేశ్వర రావు అను నేను ఒక తెలుగు భాష అభిమానిగా మీకు చేయుచున్న విన్నపము , మీరు పెద్దమనసుతో నా వినతిని స్వీకరించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ వివరాలు సోషల్ మీడియా ద్వారా మీ దృష్టికి తీసుకువద్దామనే ప్రయత్నం.
3000 సంవత్సరాల చరిత్ర కలిగిన మన తెలుగు భాష గొప్పదనం ప్రపంచం గుర్తించి గౌరవిస్తోంది.
అటువంటు భాష మన అధికార భాష, దానికి మనకు ఒక అధికారభాష సంఘం అని ఒకటి ఉంది, ఆ సంఘానికి తెలుగుభాష తెలుగు సంస్కృతీ సంప్రదాయాల మీద మంచి పట్టు అభినివేశము కలిగిన లబ్ధప్రతిష్టులను, సాహితీవేత్తలను , సాహిత్యంలో డాక్టరేట్ చేసిన వారిని కవులను తెలుగు భాషకు సేవ చేసిన వారిని పెద్దలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధ్యక్షులుగా నియమిస్తుంది, ఆ అధ్యక్షునికి కేబినేట్ హోదా ఇస్తారు. ఈ విషయాలు అన్నీ మీకు తెలియనివి కాదు.
ఈ సంఘానికి ఇప్పటివరకు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య , శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు , శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు , శ్రీ సి నారాయణరెడ్డి శ్రీ మండలి బుద్ధప్రసాద్ శ్రీ పరుచూరి గోపాలకృష్ణ లాంటి ఎందరో లబ్ధప్రతిష్టులు ఆ పదవి చేపట్టారు తెలుగు భాషకు సేవ చేసారు.
నేడు మన ఆంధ్రప్రదేశ మరలా ఒక కొత్త శకం మీ నాయకత్వంలో ప్రారంభం అవుచున్న సందర్భములో, ప్రపంచము ఇప్పుడు అంతా మన వైపు చూస్తున్న తరుణములో మన తెలుగుభాషకు కూడా మీ ద్వారా తగు గౌరవము గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి విషయాలను మీ సహచరులు మీ దృష్టికి తీసుకురాకుండా కూడా మన తెలుగుదేశంపార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారు.
కానీ నేడు ఆ అధికార తెలుగు భాష సంఘానికి అధ్యక్షునిగా అనామకులిని, కాపీలు కొట్టి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన కాకారాయుళ్ళను పైరవీకారులను లోకజ్ఞానము ఏమాత్రము లేనివారిని, భాషలోని అక్షరామాలిక తెలియనివారిని, భజన సామ్రాట్టులను, కనీసం వాళ్ళు పుట్టిన ఊళ్ళల్లోనూ జిల్లాలోను కూడా ఎవరికీ తెలియని అనామకులను, ఎవరితోనో కొన్ని పిచ్చ్చి వ్రాతలు వ్రాయించి వాటిని తనే వ్రాసినట్టి అచ్చు వేయించుకునే వాళ్ళను, ఇప్పటికిప్పుడు కులం కార్డు తీసి మిమ్మల్ని మోఖమాటం పెట్టేవారిని, మీ కుమారుడికి నచ్చిన బావిలోని కప్పలను ఏరుకు వచ్చి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార తెలుగు భాష సంఘానికి అధ్యక్షునిగా నియమించాలిని చూడటం మన తెలుగుజాతి దౌర్భాగ్యం. ఇప్పటికి కూడా ఎవ్వరు కనీసం ప్రభుత్వ చర్యని మీ దృష్టికి తీసుకురాకపోవడం ప్రశ్నించలేక పోవడం అమానుషం.
ఇటువంటి చర్యలతో మనము మన భాష మన సంస్కృతీ నవ్వులపాలు కావడం అనివార్యం.
నేడు తెలుగునేల మీద మహామహా గొప్ప భాషావేత్తలు సాహితీవేత్తలు కవులు కళాకారులు అవధానులు సర్వశ్రీ డా . మేడసాని మోహన్, డా . గరికపాటి నరసింహారావు, డా మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ వాసుదేవ దీక్షితులు , డా బేతవోలు రామబ్రహ్మం , కె విశ్వనాథ్ , సిరివెన్నెల సీతారామశాస్త్రి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు లాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు , ఇటువంటి వారికి ఇవ్వడము ద్వారా మనము మన భాషను గౌరవించుకున్నట్టు అవుతుంది, అలా కాకుండా కాకారాయుళ్ళకు, భజన రాయుళ్ళకు, పైరవీకారులకు ఇస్తే మాత్రం మన భాషను, సంస్కృతిని అవహేళన చేసుకున్నట్టు, నడిబజారులో అమ్ముకున్నట్టు అవుతుంది అని చెప్పడములో ఎటువంటి సందేహము అక్కరలేదు.
దయచేసి మీ చేతుల ద్వారా మన గొప్ప భాషకు అన్యాయం చెయ్యవద్దని అవమానం చెయ్యవద్దని అటువంటి పనిలో మీరు భాగస్వాములు కావద్దని చేతులెత్తి నమస్కరిస్తూ నా విన్నపాన్ని మరోసారి సానుకూలముగా స్వీకరిస్తారని ప్రార్ధిస్తున్నాను.
భవదీయుడు
సుంకర వెంకటేశ్వరరావు @ సువేరా @ ఎస్వీరావు

గుర్తింపు పొంది చలామణీ అయిపోవచ్చు.

మంచి చిడతల బ్యాచ్ బానిసల భజన బృందం ఉంటే / కిరాయికి దొరికితే .... వినేవాళ్ళు నమ్మేవాళ్ళు గొర్రెలు అయితే ఎంతటి వెధవైనా మహాత్ముడిగాను, మేహామేతగాను, యువనేతగాను, గోప్పవాడిగాను గుర్తింపు పొంది చలామణీ అయిపోవచ్చు.

విభజనలో సమిధలైనది సామాన్యుల జీవితాలు మాత్రమె

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న కేబినేట్ సమావేశములో ఒక తీర్మానం చేస్తూ 2017 జూన్ లోపు హైదరాబాద్, తెలంగాణా నుండి ఆంధ్రా రాయలసీమ వాళ్ళు వెనకకు తమతమ స్వస్థలాలకు తిరిగివస్తేనే స్థానికత ఇస్తాము అని ఒక హుకుం జారీ చేసారు. అదెంతవరకు సబబు ?
రాజకీయనాయకులైతే ఎన్ని వేషాలు అయినా వేయవచ్చు, చిరుద్యోగులు చిరు వ్యాపారులు అలా కాదుకదా ..!
రాజకీయనాయకుడు అక్కడా ఇక్కడా ఆస్తులు వ్యాపారాలు కూడబెట్టుకుని ఎన్ని నాటకాలైనా ఆడగలరు, చిన్న పరిశ్రమలు పెట్టుకున్నవాళ్ళు ,ఆ పరిశ్రమలలో ఉద్యోగ ఉపాధిపనులు చేసుకునేవారి పరిస్థితి వారి పిల్లల భవిష్యత్తు పరిస్థితి ఏమిటి ?
అంటే మీ మీ రాజకీయ స్వార్ధముతొ అన్ని రాజకీయపార్టీలు కలిసి చేసిన దుర్మార్గపు రాష్ట్ర విభజన పనులకు మేము మా పిల్లల భవిష్యత్తు నాశనం కావాలా ?
రాష్ట్ర విభజనతో లబ్ధి పొందినది రాజకీయపార్టీలే కదా ..?
గత 50 ఏళ్ళుగా హైదరాబాదు మన రాజధాని అని, తెలంగాణా ప్రాంతము కూడా మన రాష్ట్రమే అని నమ్మి ఆంధ్రా నుండి వెళ్ళిన లక్షలాది కుటుంబాలు హైదరాబాదులో స్థిరపడి చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడపెట్టుకుని ఇక్కడ హైదరాబాదులో ఆస్తులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొంతమంది బళ్ళారి రాయచూరు లాంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు . వాళ్లకు నేటికీ తమ గ్రామాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఆస్తులు కూడా కలిగి ఉన్నారు, వీళ్ళ సంతానం కూడా ఆంధ్రాతోనే పెళ్ళిళ్ళు లాంటి సంబంధాలు కలిగిఉన్నారు. స్థానికత కావాలంటే వీరందరూ తిరిగి రావాల్సిందేనా ?
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు అయితే రాజకీయనాయకులు లాగా ఎన్ని వేషాలు నాటకాలైనా ఆడవచ్చు , కానీ అక్కడ ఆంధ్రాలో అన్నే అమ్ముకోచ్చి ఇక్కడ తెలంగాణా ప్రాంతములో చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాల పరిస్థితి ఏమిటి ?
ఆ విభజనలో సమిధలైనది సామాన్యుల జీవితాలు మాత్రమె.
హైదరాబాదులోనూ తెలంగాణాలోనూ మా ఖర్మకొద్దీ స్థిరపడిన మేము ఇక్కడ ఉండలేము .అక్కడకు కదలలేము ............ మాకు ఆత్మహత్యలే శరణ్యమా

Wednesday, September 30, 2015

తరువాత ...మీ ఖర్మ ...!!

అవినీతి కి
అమ్మా మొగుడ్లంటూ...
అరాచకానికి
అబ్బాజాన్ లంటూ...
జఫ్ఫాలని
ఏకిపారేసిన
తమ్ముళ్ళారా....
ఇప్పుడవే
అవినీతి జఫ్ఫాలు
ఒక్కొక్కటిగా
మీ పక్కలోకి చేరుతుంటే
సిగ్గులేకుండా భజన
చేస్తున్న మిమ్మల్నేమనాలి...??
వాళ్ళు జఫ్ఫాలు అయితే...
వాళ్ళకి కండువాలు కప్పి
దుప్పట్లోకి ఆహ్వానిస్తున్న
మిమ్మల్ని లోఫర్ లనాలా...??
అంతేగా...
వాళ్ళు " జ " భజనగాళ్ళు...
మీరు " లో " భజనగాళ్ళు....
ఆట్టే తేడా కనపడటం లేదు మాకు...
కనీసం మీకైనా తెలుస్తోందా...??
అప్పుడు ఆ వర్గంలో ఉన్న
అవినీతి చేపలొక్కొక్కటీ
మీ చెరువుల్లోకి దూకుతుంటే
మండూకాల్లా చెరువులోనే
బ్రతికే మీకు తెలియకపోవచ్చు...
కానీ ...ఆ అవినీతి
చేపల వాసన కి
ఓటర్ల ముక్కుపుటాలు
అదిరిపోతున్నాయ్ ఇక్కడ...!!
తొందరగా తేరుకోకపోతే...
తెలిసీ నిద్ర నటిస్తే...
జఫ్ఫాలనీ మిమ్మల్నీ
ఒకే గుంజకి కట్టేస్తారు జనం...
తరువాత ...మీ ఖర్మ ...!!
అందరికీ నీచు కంపు
అంటుకున్నాక.....
" రామ రామ " అన్నా
లాభం ఉండదు...
ఆ రాముడే దిగొచ్చినా...
ప్రయోజనం ఉండదు..!!

ఏమని బోధించారు ?

పగోజి నల్లజర్ల లో నిర్వహించిన తెదేపా కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఏమి బోధించారు ?
పార్టీ ఆఫీసుకు ఏనాడు రాకుండా దొడ్డి దారులలో ఎలా పదవులు కాంట్రాక్టులు పొందవచ్చు అనా ..?
అవసరానికి మనుషులను వాడుకుని అవసరం తీరినాక వారిని కీశే ఎన్టీఆర్ ని తీసేసినట్టు ఎలా తీసిపారేయ్యోచ్చు అనా ..?
పార్టీ జెండాకి పార్టీ ఎన్నికల గుర్తుకు తేడా తెలియకుండా పార్టీలో సభ్యత్వం లేకుండా భజన చేసే బ్రోకర్లను తీసుకువచ్చి అర్ధరాత్రికి అర్ధరాత్రే పదవులు ఇస్తుంటే నోరుమూసుకుని ఎలా ఉండాలి అనా ..?
పార్టీలో 30 ఏళ్ళుగా ఆస్తులు అమ్ముకుంటూ జెండాలు మోస్తున్న కార్యకర్తలని హిమ్సిసించి అక్రమ కేసులు బనాయించి హత్యలు చేసినవారిని సాదరంగా ఆహ్వానించి పెద్ద పీటలు వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి అనా ..?
చినబాబుకి భజన చేస్తూ , కాళ్ళు పిసుకుతూ, బట్టలు ఉతుకుతూ, పక్కలు వేస్తూ ఉన్దేవాల్లని చేరదీసి పదవులు ఇస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి అనా ...?
ఇసుక అక్రమ మైనింగ్ ఎలా చెయ్యాలి అనా ..?
పార్టీలు ఎలా మారాలి అనా ...?
పార్టీలు మారుస్తూ ప్రస్తుతానికి తెదేపాలోకి వచ్చిన వెధవలకు ఎలా సేవ చెయ్యాలి అనా ..?
సొంత పార్టీకి ఎలా ద్రోహం చెయ్యాలి అనా ...?
ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ వాళ్ళతో ఎలా లాలుచి పడాలి అనా ..?
వారసత్వ రాజకీయాన్ని సమర్ధవంతంగా ఎలా పోషించాలి అనా ..?
డబ్బుతో రాజకీయం ఎలా చెయ్యాలి అనా ...?
భజన ఎలా చెయ్యాలి అనా ...?
జీవితాంతం బానిసలుగా బోయీలుగా ఉంటూ పార్టీలు మార్చే బ్రోకర్లను పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకున్న వారిని ఎలా మోయాలి అనా ...?
తండ్రి పేరుతొ తాత పేరుతొ భర్త పేరుతొ అన్న పేరుతొ రాజకీయ పదవులు అనుభవించెవారిని కిరాయి కూలీలుగా ఎలా మొయ్యాలి అనా ...?
పార్టీ అధికారములో లేనప్పుడు పార్టీ ముఖం చూడకుండా పార్టీని పట్టించుకోకుండా ఇతర పార్టీల నాయకులతో కలిసి అక్రమ వ్యాపారాలు చేసి దోచుకున్న వారు  ఇప్పుడు అధికారములోకి రాగానే మరలా రంగులు మార్చి చినబాబు భజన పోటీపడి చేస్తూ వంగివంగి బానిసలుగా మారి మరలా దోచుకోవడానికి సిద్ధం అయిన వారిని, దోచుకుంటున్న వారిని ఎలా కాపాడాలి అనా ..?
పార్టీలో టిక్కట్లు పదవులు ఎలా కొనుక్కోవాలి అనా ..?
ఏమని బోధించారు ?

తెలుగుదేశం అభిమానులకి బహిరంగ లేఖ:-

తెలుగుదేశం అభిమానులకి బహిరంగ లేఖ:-
రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే 2019 లో కూడా చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవడం అవసరం అని భావించే ఓ చంద్రబాబు అభిమాని, తెలుగుదేశం పార్టీ అభిమానులకి రాస్తున్న బహిరంగ లేఖ..
మిత్రులారా!
అడ్డగోలు విభజన తో నష్టపోయిన మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనీసం ఓ పదేళ్ళు ఒకే ముఖ్యమంత్రి ఒక విజన్ తో, దీక్షతో పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. అలాంటి విజన్, దీక్ష ఉంది అని నమ్మాము కాబట్టే మనం చంద్రబాబు కి మన ఓట్ల ద్వారా అధికారం అప్పగించాము. పదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలవాలి. చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 16 నెలలు పూర్తయ్యాయి. ఆయన ఏమైనా చెయ్యాలి అంటే 2018 డిసెంబర్ లోపు చేసెయ్యాలి, అంటే ఇంకా 39 నెలల టైం ఉంది. ఈ పదహారు నెలల్లో ఆయన ఏమి చేసారు? ఇంకా ఏమి చెయ్యబోతున్నారు? 2019 ఎన్నికల్లో తిరిగి గెలిచే స్థాయిలో ఆయన పాలన ఉందా, లేదా అని ఆయన ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని నమ్మే వ్యక్తులు ఆలోచించాలా, లేదా? పొరపాట్లు జరుగుతుంటే ప్రశ్నించాలా? లేక ఆయన ఏమి చేసినా రైటే అని గుడ్డిగా సమర్థించాలా?
నేను ప్రభుత్వం లో జరుగుతున్న తప్పులని పేస్ బుక్ లో ఎత్తి చూపితే అందరూ నన్ను విమర్శిస్తున్నారు. నన్ను అన్ ఫ్రెండ్ చేస్తున్నారు. అందుకే మూడు నెలలుగా fb కి దూరంగా ఉన్నాను. ఎంతో ఆవేదనతో ఈ ఉత్తరం రాస్తున్నాను. చంద్రబాబు ని ప్రశ్నించడం, విమర్శించడం ద్వారా మళ్ళీ ఆయనే గెలిచేలా చేద్దామా? లేక ఆయనని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతూ తప్పులని కప్పిపుచ్చుతూ ఎన్నికల్లో బొక్కబోర్లా పడదామా? ఆలోచించండి. ప్రస్తుత పరిస్థితుల్లో, చంద్రబాబు తప్ప ఏపి కి వేరే గత్యంతరం లేదు అని నమ్మే వ్యక్తిగా, చంద్రబాబు పాలనానుభవం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా ఈ లేఖ రాస్తున్నాను. తెలుగు దేశం కార్యకర్తలు, అభిమానులు అందరూ దీనిని చదివి, అర్థం చేసుకుని, పది మందికి షేర్ చేసి మంచి చర్చ జరిగేలా చూడవలసిందిగా కోరుతున్నాను.
16 నెలల పాలనలో చంద్రబాబు ఎక్కడ విఫలం అయ్యారో, ఎక్కడ తప్పు చేసారో చూద్దాం.
రైతులకి ఏం చేసారు?
2004 లో చంద్రబాబు అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ఆయన వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారనే ప్రచారం, రెండోది ఆయన రైతుల కోసం చేసిన పనులు అంత ఫలితాలు ఇవ్వకపోవడం. పదేళ్ళు అధికారానికి దూరమై మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ 16 నెలల్లో రైతులకోసం ఏమి చేసారో చెబుతారా? రుణమాఫీ చేసాము అని చెబుతున్నారు. ఆ విషయం లో రైతులు సంతృప్తిగా లేరు అనే మాట నిజం. తాత్కాలికంగా కొంతమంది రైతులు లాభం పొందినా అది ఎక్కువకాలం నిలబడదు. పట్టిసీమ పూర్తి చేసాం అని అనొచ్చు. అంతకు మించి ఏమి చేసారు అనేదే ప్రశ్న. డబ్బులుంటే సాగునీటి పాజెక్టులు కట్టొచ్చు, కాని వర్షాలు పడకపోతే, అప్పుడు ఏమవుతుంది? ఎలాంటి పరిస్థితులు వచ్చినా రైతులు తట్టుకుని నిలబడేలా చేయడం కదా విజన్ అంటే..అలాంటి విజన్ తో చేసిన పనులు ఒక్కటి చూపగలరా?
ఆ ఊపేది? ఉద్యమం లాంటి ఆ స్ఫూర్తి ఏది?
చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అభివృద్ధి ని ఆయన ఒక ఉద్యమం లా మలిచారు. జన్మభూమి, శ్రమదానం, నీరు-మీరు, క్లీన్ అండ్ గ్రీన్ ఇలా ఒక ఉద్యమం లా సాగింది ఆయన పాలన. ఇప్పుడా ఊపు ఎక్కడ? ప్రజల భాగస్వామ్యం ఏది? అప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని ప్రజలకి వివరించడం, కిందిస్థాయి అవినీతిని చాలా వరకు తగ్గించడం వల్ల, ప్రజలపై కొద్దిగా భారం మోపినా కూడా చంద్రబాబు 1999 లో తిరిగి అధికారం లోకి వచ్చారు. ఆ తర్వాత అవినీతి పెరగడం, ప్రజల భాగస్వామ్యం తగ్గడం లాంటి వాటి కారణంగా 2004 లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2014 లో అధికారం లోకి వచ్చాక బాబు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి కాని, అవినీతిని తగ్గించడానికి కాని చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. ఇలా అయితే 2019 లో ఎలా గెలుస్తారు?
ప్రత్యేక ఫ్లైట్లు, దుబారా ఖర్చులు:
ప్రధాని నరేంద్ర మోది ఒక్క సారి 10 లక్షల ఖరీదయిన సూట్ వేసుకుంటే, ఎంత రచ్చ అయిందో, ఆయనకి ఎంత మైనస్ అయిందో, ఢిల్లీ ఎన్నికల్లో ఎలా దెబ్బేసిందో చూసాం. మరి చంద్రబాబు హైదరాబాద్ లో తాత్కాలిక చాంబర్ కోసం 20 కోట్లు, ఉండవల్లి గెస్ట్ హౌస్ కోసం కొన్ని కోట్లు, ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్లు, 5.5 కోట్లతో స్పెషల్ బస్సు ఇవన్నీ చూస్తున్న పేద ప్రజలకి చంద్రబాబు మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆలోచించారా? ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు ముఖ్యమంత్రి 5.5 కోట్ల బస్సు గురించి సూసైడ్ నోట్ లో ప్రస్తావించాడంటే, బాబుకి మీడియా ని మానేజ్ చేయడం చేతకావడం లేదని సర్దిచెప్పుకుందామా? లేక నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుందామా?
సత్తా లేని మంత్రులు:
అయిదేళ్ళ రాజశేఖర్ రెడ్డి పాలన, ఆ తర్వాత అయిదేళ్ళు సాగిన విభజన ఉద్యమం కారణంగా రాష్ట్రం లో ఉన్నఅన్ని రంగాలూ భ్రష్టుపట్టిపోయాయి. వీటన్నిటిని బాగుచేసి దారిలో పెట్టాలంటే ఎంత కష్టం. ఎంత సమర్థత కావాలి. రాష్ట్ర కేబినెట్ లో ఓ నలుగురు తప్ప సమర్థులు ఎవరన్నా ఉన్నారా? తమ శాఖల మీద పట్టున్న మంత్రులు ఎంతమంది? కొత్త ఆలోచనలు చేసే శక్తి ఎంతమంది మంత్రులకి ఉంది? ఇలాంటి కేబినెట్ తో రాష్ట్రం ఎలా ముందుకు వెళుతుంది? చంద్రబాబు తన కేబినెట్ ని ఎందుకు ప్రక్షాళన చేయరు? మంత్రి పదవులు అప్పగించడానికి పదిమంది సమర్థులైన ఎమ్మెల్యేలే లేరా?
ఉద్యోగుల జీతాల పెంపు:
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణ త్యాగాలకి కూడా సిద్దపడ్డ యోధులు కదా మన ఉద్యోగులు. అలాంటి వారు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకుని, ఏ 20-25 శాతం ఫిట్ మెంట్ కో అంగీకరించేవారు కదా? అలాంటిది 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం ఎందుకు? ఇంత ఎక్కువగా జీతాలు పెంచడం వల్ల రాష్ట్రానికి ఆర్ధిక భారం తప్ప ఏం లాభం ఉంది? పోనీ వారు అడిగినంత జీతాలు పెంచేటప్పుడు అయినా, వారి పనితీరు మెరుగుపరచుకోవాడానికి, లంచాలు తగ్గించడానికి ఏమైనా కండీషన్స్ అయినా పెట్టారా? ప్రజలకి పైసా ఉపయోగం లేకుండా ఉద్యోగులకి 8వేల కోట్లు అదనంగా చెల్లించడం ఏమంత గొప్ప విజన్. ఉద్యోగులకి జీతాలు పెంచారని, జనం మళ్ళీ ఓట్లేస్తారా? పోనీ ఉద్యోగులని గట్టిగా పనిచేయమంటే ఉద్యోగులైనా మళ్ళీ మీకు ఓటేస్తారా?
అమరావతి నిర్మాణం:
అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించడం ద్వారా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నం. ఇదే చంద్రబాబు 2004 కి ముందు హైదరాబాద్ ని అద్భుతంగా డెవలప్ చేసారు కదా, ఎందుకు ఓడిపోయారు? అప్పుడు ఎందుకు ఓడిపోయారో, తెలిస్తే ఇప్పుడు ఎందుకు గెలుస్తారో ఆలోచించొచ్చు. హైదరాబాద్ ని డెవలప్ చేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. కాని ప్రజల జీవితాల్లో ఆ మార్పు పెద్దగా కనిపించలేదు. అందుకే 2004 లో ఓడిపోయారు. ఇప్పుడు అమరావతి నిర్మించడానికే పదేళ్ళు పడితే, దాని నుండి ఆదాయం వచ్చేదెప్పుడు? ఆ అబివృద్ధి ఫలాలు ప్రజలకి అందేది ఎప్పుడు? అమరావతి నిర్మించొద్దు అని చెప్పడం లేదు, అది ఒక్కటే సరిపోదు అని చెబుతున్నా.
గాలిలో మేడలు:
చంద్రబాబు గతంలో ప్రజలకి విజన్-2020 అని ఓ భవిష్యత్తును చూపించారు. విజన్ 2020 లో అభూత కల్పనలు లేవు, గాలిలో మేడలు లేవు. మేధావులు కూర్చుని ఆ డాక్యుమెంట్ తాయారు చేసారు. కాని ఇప్పుడు బాబు ఆచరణ సాధ్యంకాని హామీలు అన్నీ ఇస్తున్నారు. జిల్లాకి ఓ ఎయిర్ పోర్ట్, నిరుద్యోగులకి నెలకి 1500 లాంటి అసాధ్యమైన హామీలు ఇస్తున్నారు. అవన్నీ భవిష్యత్తులో ప్రత్యర్థులకి అస్త్రాలు కాబోతున్నాయి. చంద్రబాబు ని మాట నిలబెట్టుకోలేని మనిషిగా చూపబోతున్నాయి. ఇకనైనా ఇలాంటి గాలిలో మేడలు ఆపి, రాష్ట్ర పరిస్థితులని ప్రజలకి వివరించాలి. 10 పనులు చేస్తానని చెప్పి 8 పూర్తిచేస్తే జనం మళ్ళీ ఓటేస్తారు, అదే 50 చేస్తానని చెప్పి 9 పనులు చేస్తే వేటేస్తారు. సో, ఓటు కావాలా? వేటు కావాలా తేల్చుకో బాబూ అని హెచ్చరించడం తప్పు అవుతుందా?
బిజెపి హ్యాండిస్తే..!
రాష్ట్రవిభజన చట్టంలో ఉన్న హామీలని కూడా నెరవేర్చకుండా కేంద్రం మనకి మొండిచెయ్యి చూపుతోంది. బిజెపి ఎపి లో సొంతంగా ఎదగాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఓటుకి నోటు లాంటి చిన్న కేసు తోనే కేంద్రం దగ్గర లోకువయిపోయాం. రాష్ట్రం లో ఇప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ లో పదవులు అనుభవించి, కోట్లు పోగేసుకున్నోళ్ళు, ఇప్పుడు టిడిపి లో చేరి మళ్ళీ సంపాదన కొనసాగిస్తున్నారు. పదేళ్ళు అధికారానికి దూరంగా ఉండడం తో తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా చిల్లర అవినీతి మొదలు పెట్టారు. పొరపాటున ఒక్క స్కాం జరిగినా, కేంద్రంలో ఉన్న బిజెపి అవకాశం తీసుకోవచ్చు, తెదేపా ని దెబ్బతీయడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకే, చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెబితే అది తెలుగు దేశం వ్యతిరేక స్టాండ్ అవుతుందా?
ఏమీ లేని ఎపి ని అయిదేళ్ళలో డెవలప్ చేసి చూపిస్తే, తెలంగాణ లోకూడా ఆటోమాటిక్ గా టిడిపి బలపడుతుంది. అందుకే తెలంగాణ లో తెదేపా గెలవాలన్నా, ఆంధ్రాలో అద్భుతమైన పరిపాలన అందించడం అవసరం.
చివరిగా ఓ మాట. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ చంద్రబాబు ని మళ్ళీ గెలిపించుకుందామా? లేదు చంద్రబాబు భజన చేస్తూ, ఆహా ఓహో అంటూ మనల్ని మనం మోసం చేసుకుని 2019 లో ఓడిపోదామా? నిర్ణయం మీదే. మన రాష్ట్ర భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తెదేపా కార్యకర్తలపైనే ఆధారపడి ఉంది. ఇదీ నా ఆవేదన. నేను లేవనెత్తిన అంశాలు కరెక్ట్ అనిపిస్తే మీ మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయలు తెలుపండి.
ఇట్లు,
చంద్రబాబు అభిమాని,
నల్లూరి వెంకట సుబ్బారావు
ఒంగోలు

అయితే ఓకే అల్లుడు గారు ...! .

అల్లుడు గారు ...!
శ్రీ డొక్కా మాణిక్య ప్రసాదా ...! ( అంటే ఒకప్పటి కాంగ్రెస్ మంత్రి కాదు కదా ...! )
శ్రీ జూపూడి ప్రభాకరా ...! ( అంటే ఒకప్పటి వయ్యెస్సార్ కాంగ్రెస్ కాదు కదా ...! )
శ్రీ అవంతి శ్రీనివాసా ...! ( అంటే ఒకప్పటి ప్రజారాజ్యం కాదు కదా ........! )
శ్రీమతి ముళ్ళపూడి రేణుకా ...! ( అంటే పార్టీ ఓడిపోయినాక మొఖం చాటేసిన అప్పటి అధికార ప్రతినిధి కాదు కదా ...! )
అల్లుడు గారు ఎవరండీ వీళ్ళు ...?
ఓహో ... తెగులుదేశం పార్టీ వ్యవస్థాపక రోజులనుండి పార్టీకోసం చెమట ధారపోసిన, ఆస్తులు కరిగించుకున్న, పార్టీలు అసలు ఏనాడు మారని నిఖార్సు వీరులా .... అయితే ఓకే అల్లుడు గారు ...! .
అసలు ఇంతకీ నేడు ఉన్నది తెలుగుదేశం పార్టీనా లేక తెగులుదేశం పార్టీనా ...? నాకు ఒక చిన్న డౌటు అంతే అల్లుడు గారు ...!
శ్రీ వైఎస్ జగన్ , శ్రీమతి వైఎస్ విజయలక్ష్మి, శ్రీ కేవీపీ , శ్రీమతి లక్ష్మీ పార్వతి, శ్రీమతి వాసిరెడ్డి పద్మ , శ్రీమతి రోజా , శ్రీమతి గంగుల భానుమతి, శ్రీ గాలి జనార్ధన రెడ్డి, శ్రీ వైవీ సుబ్బారెడ్డి , శ్రీ విజయసాయి రెడ్డి , శ్రీ సోమయాజులు, శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్, శ్రీ వీ హనుమంతరావు , శ్రీ కరుణాకర్ రెడ్డి , శ్రీ చెవిరెడ్డి , శ్రీ మంగలి కృష్ణ , శ్రీ బ్రదర్ అనిల్ వీళ్ళేమి పాపం చేసారు అల్లుడు గారు ... ? వీళ్ళు కూడా మన పార్టీకోసం బాగా శ్రమించారు కష్టపడ్డారు కదా , వీళ్ళను పోలిట్ బ్యురోలోకి తీసుకుంటే బాగుండేది కదా అల్లుడు గారు ...! ...?

విద్యావంతులతోనే

మన భగవద్గీత లాంటి గ్రంధాలు మూఢులకు భజనమార్గం, విద్యావంతులకు జ్ఞానమార్గం, వివేవుకులకు కార్యకారణ విభాజన మార్గం లాంటివి సూచించింది.
కానీ నేడు శీను రివర్సు,
బాగా చదువుకున్నవాళ్ళు భజన మార్గం, అక్షరాస్యత లేనివాళ్ళు కార్యకారణ విభాజన మార్గం, చేతగానివాళ్ళు జ్ఞానమార్గంలో నడుస్తున్నారు.
దురదృష్టం కొద్దీ సమాజం విద్యావంతులతోనే ఎక్కువ నింపబడింది...... సువేరా

సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

నేను పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా ( దివి తాలుకా ) మొవ్వ మండలం, పెదముత్తేవి అనే ఒక మాదిరి పెద్ద గ్రామం. మా గ్రామము చాలా చైతన్యవంతమైనది, ఎంతోమంది విద్యాధికులు పండితులు మేధావులు. మా గ్రామానికి కూతవేటు దూరములో నిమ్మకూరు చిన్న గ్రామం, మా రెండు గ్రామాల మధ్య దగ్గరి బంధుత్వాలు ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో అతికొద్ది ( కేవలం 5 లేక 6 ) పాఠశాలలొ మాత్రమె ఉన్న సంస్కృత పాఠశాలలు మా గ్రామములో కూడా ఉంది.
మా గ్రామములో ఒక మంచి గ్రంధాలయం కూడా ఉంది.
ఇది 1977, నాకు అప్పుడు 12 ఏళ్ళు ,
అప్పటికే మా గ్రామములో చాలామంది ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్, లా లాంటి ఉన్నత చదువులు నేర్చిన వాళ్ళు నాకంటే 10 నుండి 15 సంవత్సరములు పెద్దవాళ్ళు చాలామంది ఉండేవారు , వారిలో నాకు బాబాయ్ మామ అన్న బావల వరస అయ్యేవాళ్ళు అందరూనూ.
నాకు చిన్నప్పటినుండి ఆటపాటలతోపాటు నిత్యమూ కొంచెం సేపైనా గ్రంధాలయంకి వెళ్లి చందమామ బాలమిత్ర సోవియట్ భూమి మరియు ఇతర కధల పుస్తకాలు చదువుకునే అలవాటు ఉండేది. మాకు ఆనాడు మాకు గ్రంధాలయములో తెలుగు పత్రికలతోపాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కూడా వచ్చేది. అలా గ్రంధాలయానికి వెళ్ళిన సమయములో నాకంటే పెద్దలు చాలా విద్యావంతులు చాలా చైతన్యవంతులు అయినవాళ్ళు అందరు అక్కడ చేరి అప్పుడు నడుస్తున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉండేవారు. వారిలో ముఖ్యులు సర్వశ్రీ కాకర్ల దివ్వయ్య చౌదరి, కాకర్ల గోపీచంద్, లింగమనేని పూర్ణ భాస్కరరావు, జాస్తి లక్ష్మీనారాయణ, జాస్తి కృష్ణమూర్తి, జాస్తి ముత్తన్న, మన్నే సుబ్బారావు, లింగమనేని అప్పారావు, మన్నే ఠాగుర్, మన్నే కృష్ణ ప్రసాద్, కాకర్ల వెంకటేశ్వరరావు, కాకర్ల విజయకుమార్ లింగమనేని శివరామ ప్రసాద్ , మండవ ప్రేమచంద్ ఇంకా కొంతమంది ( కొన్ని పేర్లు ఇక్కడ ఉదాహరించాకూడదు). వీరందరూ అప్పట్లో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఇందిరాగాంధీ తన కుమారుడు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా తీసుకువచ్చి వారసత్వ పాలనకు పునాదులు వేస్తోందని, వ్యక్తీ ఆరాధన వారసత్వ పాలనతో రాజకీయ అరాచకం చేస్తోందని తీవ్రంగా చర్చించుకుంటూ ఉండేవారు , వారి చర్చ నాకు చాలా వినబుద్ధి అయ్యేది. వారు అందరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ చదివేవారు, అది చూసి నాకు కూడా ఆ పత్రిక చదివే అలవాటు అయ్యింది ( నేను చదువుకున్నది పూర్తిగా తెలుగు మీడియం అయినా కూడా పట్టుదలతోనే ఇంగ్లీషు పేపరు చదవడం నేర్చుకున్నా, దానికి పైన చెప్పిన వారే ఆదర్శం ). నాకు చిన్నప్పటి నుండి పెద్దలు మాట్లాడుకుంటే శ్రద్ధగా వినేవాడిని. మా ఇంట్లో నన్ను పెంచి పెద్దచేసిన మా తాత ( అమ్మ తండ్రి ) కీశే నర్రా సీతయ్య గారు ఫక్తు కాంగ్రెస్ అభిమాని, ఇందిరా భక్తుడు, మా తండ్రి కీశే సత్యన్నారాయణ గారు కరడుగట్టిన కమ్యునిస్టు ( మార్క్సిస్టు ). మాతాతకు ఈ మాటలు అస్సలు నచ్చేవి కానేకాదు.
అప్పుడు కీశే జయప్రకాశ్ నారాయణ, మొరార్జీదేశాయ్, రాజనారాయన్ లాంటి గొప్పవారి నేతృత్వములో జనతాపార్టీ ఏర్పడింది. అప్పుడే నాకంటే పెద్దలు శ్రీ రామ్ మనోహర్ లోహియా గురించి మాట్లాడుకుంటూ ఉంటె విని మా గ్రంధాలయములో ఆయన రచనలు శ్రీ తుమ్మల చౌదరి గారు తెలుగు అనువాదం చేసిన ఇతిహాస చక్రం చదివాను, అర్ధం అవ్వడానికి అది వయసుకాదు నాకు సమాజ పరిపక్వత లేదు, అయినా చదివాను అనే ఒక గొప్ప అనుభూతి / గర్వం. 
ఆ 1977 ఎన్నికలలో జనతా పార్టీ గెలిచింది కొద్ది నెలలకే పోయింది, ఆ కాంగ్రెస్ వ్యతిరేక ఆవేశం మా గ్రామములో ఉన్న విద్యావంతులలో చావలేదు,
అలా నడుస్తున్న సమయములో తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలొని కాంగ్రెస్ వారికి తాకట్టు పెట్టబడుతున్న తరుణములో కాంగ్రెస్ వారసత్వ కుటుంబ పాలనకు దోపిడీకి అరాచక రాజకీయానికి వారి అవినీతికి వ్యతిరేకముగా కీశే ఎన్టీఆర్ శ్రీ నాదెండ్ల భాస్కరరావు ల నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడటం, ఆ పార్టీ సిద్ధాంతకర్తల లో మా సన్నిహిత బంధువు మా గ్రామస్తుడు కూడా ఉన్నారు. మా గ్రామములో ఉన్న విద్యావంతులు కాంగ్రెస్ వ్యతిరేకులు అందరు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో తెలుగుదేశంపార్టీలో చేరినవారు అందరి జీవితాలు తెరచిన పుస్తకాలే, అందరు నిస్వార్ధంగా సమాజహితం కోరే యువకులు. తెలుగుదేశం పార్టీ అధికారికముగా కీశే ఎన్టీఆర్ ద్వారా ఏర్పడక కొన్ని నెలల ముందే మా గ్రామములో శ్రీ కాకర్ల విజయకుమార్ తన స్వంత డబ్బుతో చాలా ఖరీదు అయిన ఆయిల్ పెయింటు తో చాలా పెద్దగా తెలుగుదేశం అనే పేరు పసుపు రంగు మీద ఆకుపచ్చ రంగుతో వ్రాయించారు, అది ఒక గొప్ప అనిర్వచనీయ అనుభూతి మా గ్రామస్తులకు. అప్పుడు నావయసు 17 ఏళ్ళు , మేము బొడ్డూడని బుడ్డ వాళ్ళం, మాకు రాజకీయం అక్షరం ముక్క తెలియదు, అయినా మాలో ఎన్టీఆర్ అంటే ఆవేశం, కాంగ్రెస్ అంటే ఒక పిచ్చి వ్యతిరేకత ( ఎన్టీఆర్ బంధుత్వం లేక ఒకే కులం అనే ప్రశక్తే లేదు , మా గ్రామములో నేటికీ కుల గజ్జి అనేది ఎవరిలోనూ మచ్చుకైనా ఉండదు, అందరం ఒక్కటే ) . అప్పుడు తెలుగుదేశంపార్టీలో చేరినవారు ఎవ్వరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని పదవులకోసం రాలేదు, కేవలం సమాజములో మంచి మార్పు కోసం, వారసత్వ కుటుంబ రాజకీయానికి వ్యతిరేకముగా, అవినీతి అరాచక కాంగ్రెస్ రాజకీయానికి వ్యతిరేకముగా ఉరకలెత్తిన ఉత్సాహంతో చేరినవారే అందరూ. అందుకే అప్పటి ప్రజలు తెలుగుదేశాన్ని గుండెల్లోను నెత్తిమీదా పెట్టుకుని మోశారు, అత్యధిక మెజారిటీతో గెలిపించారు, అప్పటినుండి ఎన్టీఆర్ ని నమ్మారు, ఆయన ఏనాడు ప్రజల, కార్యకర్తల నాయకుల నమ్మకాన్ని ఒమ్ము చెయ్యలేదు, ఆయన కొడుకులను కుమార్తెలను ఏనాడు రాజకీయాలలోకి రానివ్వలేదు. ( అప్పట్లో శ్రీ దగ్గుబాటి రావడానికి కారణాలు వేరు ). 
1994 వరకు తెదేపాలో విలువలు నిలబడుతూ వచ్చాయి, ఆతరువాత నుండి ప్రతి ఎన్నికలకు దిగాజారుకుంటూ నేడు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం భిన్నము కాకుండా అదే వారసత్వాన్ని, అదే అరాచక అవినీతి నాయకుల్ని ప్రోత్సహిస్తూ, అధికారము పదవులే పరమావధిగా నేడు 2015 వచ్చేసరికి గతములో ధైర్యంగా గర్వంతో అవినీతి అరాచక కాంగ్రెస్ వాళ్ళను తిట్టిన వాళ్లము నేడు వారి ముందు తలదించుకునే పరిస్థితిని సృష్టిస్తున్నారు. 
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తీ పూజను, వారసత్వరాజకీయాన్ని వ్యతిరేకించి తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక రోజులనుండి ఒకే పార్టీలో నిభాద్ధతతో అంకితభావముతొ ఉంటున్న నిస్వార్ధ విద్యావంతులు విజ్ఞులు మేధావులు నేడు తెదేపాలో అదే వ్యక్తీ పూజను, అదే వారసత్వరాజకీయాన్ని, అదే కుటుంబ పాలనను సమర్ధిస్తూ,( కొంతమంది వీలయితే ఇతరుల చేత తమనే ఆరాధింప చేసుకుంటూ , పొగిడించు కుంటూ ) ఉండే పరిస్థితి చూసి నేను ఇన్నాళ్ళు ( నా చిన్న నాటినుండి ) ఆరాధించిన అభిమానించిన నా స్వంతవారి గురించే / నా యొక్క ఆలోచనా విధానం గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నాలాగా మధనపడే తెదేపా కార్యకర్తలు, నిస్వార్ధ నాయకులు ఎందరో ...? 
రేపు మనల్ని ప్రశ్నించాల్సిందే అని అనుకునేవాళ్లు ఇంకెందరో ...?
రేపు మనము ఇంకేందరికి సహేతుక సమాధానాలు ఇవ్వాల్సివస్తుందో ...?
నేటికి రాష్ట్రములో తెదేపా అనుసరిస్తున్న వారసత్వ కుటుంబ రాజకీయాలకు, ధన రాజకీయాలకు ఎన్ని వందల వేల తెదేపా నాయకుల కుటుంబాలు జీవశ్చవాలుగా మారాయో ...? రేపటికి వారికి ఎవరు సమాధానం చెబుతారు ?
ఇన్నాళ్ళు తెదేపాని ఒక పల్లకిగా బోయీలుగా మోస్తున్న కార్యకర్తల నాయకుల జీవితాలను పునాదిరాళ్ళుగా చేసుకుని వారికి రెండులక్షల తాయిలం / కిరాయి ఆశ చూపిస్తూ ఇంకా ఎంతమంది అవకాశవాద రాజకీయ భవంతులు నిర్మించుకుంటారో ...? ఇంకెంతమంది దళారులను, ఇన్నాళ్ళు పార్టీకి తీవ్ర ద్రోహం, కుట్ర చేసిన / చేస్తున్న వాళ్ళను చేర్చుకుంటారో , ఎంతమందికి లాభం చేకురుస్తారో ...?
రేపటి సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకుందాం అని అనుకునే బానిస మనస్కులు, స్వార్ధపరులు, భజన సామ్రాట్టులు నేడు నిజాలు మాట్లాడినవారి మీదకు, ప్రశ్నించిన వారి మీదకు రేసు కుక్కల్లాగా వస్తారనీ తెలుసు.
చూద్దాం .. చక్రవర్తుల మహారాజులు పాలించిన నాడు భూమి గుండ్రంగానే ఉంది, నేడు అలాగే ఉంది, రేపు అలాగే ఉంటుంది. భూమి చుట్టుకొలతలలో నాటికీ నేటికీ ఏనాటికీ మార్పు ఉండదు కదా ..! చరిత్రే సాక్ష్యం, ఈ నేలలో ఎన్ని చరిత్రలు మూతపడలేదు ? రేపు ఎన్ని పడవు ?
నేడు అవుతున్నది రేపటి చరిత్ర, రేపు ఏమవుతుందో భవిష్యత్తు చరిత్ర తప్పక చెబుతుంది..
.... సశేషం ... 
సువేరా

Saturday, July 25, 2015

నమ్మకపోతే మీ ఖర్మ .

గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ఒక అదృశ్య శక్తి వెనక ఉండి నడిపిస్తోంది. 
ఇప్పుడు ఆ అదృశ్య శక్తిని ఇంకొన్ని దుష్ట స్వార్ధ శక్తులు ప్రభావితం చేస్తున్నాయి, వెరసి శ్రీ చంద్రబాబునాయుడు గారు ఆ దుష్ట స్వార్ధ శక్తుల కబంద హస్తాలలో చిక్కుకొని పోయారు. 
మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు , ఆ చిలుక సప్త సముద్రాల అవతల ఉన్న పెద్ద మర్రిచెట్టు తొర్రలో ఉన్నట్టు, నేడు మాయల ఫకీరు లాంటి ఆ దుష్ట శక్తుల ప్రాణం చిలుక లాంటి లోటస్ పాండ్ పార్టీ సలహాదారుడు గుప్పెట్లో ఉన్నాయి, ఆ చిలుక లాంటి లోటస్ పాండ్ పార్టీ సలహాదారుడు మహామేత ఆత్మ కనుసన్నలలో ఉన్నాడు. ఆ ఆత్మే నేడు దురదృష్టవశాత్తు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పరమాత్మ అయ్యాడు, అతనే తెరాసా అధినేతకు నేడు అత్యంత ఆత్మీయుడు కూడా.
చూసారా .... భూమి గుండ్రంగా తిరిగి ఎక్కడకు చేరుతుందో ...!
నమ్మకపోతే మీ ఖర్మ .

శవానంద లహరి

అప్పట్లో శ్రీ ఆదిశంకరులు మనుషులు సత్యపధములొ నడవడానికి జ్ఞాన మార్గములో నడవడానికి శివానంద లహరి అనే ఒక గొప్ప శ్లోకాలను రచించారు.
నేడు మన కబంద రాజకీయనాయకులు, కపట మీడియా  ప్రజల్ని మభ్యపెట్టడానికి అజ్ఞానములో ముంచి ఉంచడానికి " శవానంద లహరి " అనే గొప్ప శోకాలను రచించారు. దానిని నేడు అన్నే రాజకీయపార్టీలు నాయకులు చాలా చక్కగా వీనుల విందుగా కను సొంపుగా దానిని పాడుతుంటే కిరాయి మీడియా నిస్సుగ్గుగా ప్రసారం చేస్తుంటే శాదిష్టు అనుయాయులు ఆనంద తాన్దవములొ మునిగి తేలుతున్నారు.
మేరా భారత్ మహాన్,
మేరా తెలంగాణా మహాన్,
మేరా ఆంధ్రా మహాన్,
హెచ్చరిక : ఈ " శవానంద లహరి" కి భారత దేశములో కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రాలో పేటెంటు హక్కులు  వైఎస్ కుటుంబానికి, తెలంగాణాలో కెసీఆర్ కుటుంబానికి దాఖలు పరచబడ్డాయి. 

Wednesday, July 22, 2015

Morning Mantras

Ekdantaya Vakratundaya Gauri Tanaya by Shankar Mahadevan in Mumbai Youth...

Ganapati Atharvashirsha - Ancient and Mystical Sanskrit Hymn for Blessin...

Bhaja Govindam

Sri Dakshinamurthy - Sanskrit

HANUMAN SAHASRANAAM {1008 Names}

Shree Ganesh Atharvashirsha (Suresh Wadkar)

Shree Ganesh Atharvashirsha (Suresh Wadkar)

GANESH SAHASRANAAM {1008 Names}

VARAHA KAVACHAM - EXTREMELY POWERFUL

Sri Dakshinamurthy - Sanskrit

SRI NARASIMHA KAVACAM Ultimate protection mantra- Srimathumitha

Extremely Powerful Narayan Kavach श्री नारायण कवच

shyamala dhandakam

shyamala dhandakam

Soundarya Lahari - Adi Shankara - Mambalam Sisters - BHAKTHI

Sri Devi Khadgamala Stotram By Bombay Sisters || Devotional Songs Jukebox

SRI DEVI KHADGAMAALA STHOTHRAM

Sri lalitha Sahasranama Stothram and PhalaSruthi

Vishnu Sahasranamam - M S Subbulakshmi

Sri Suktam

Hanuman Chalisa by MS Subbulakshmi.wmv

Rudram Chamakam

Sri Annapurna Ashtakam Telugu

Rudram Chamakam

Sacred Chants for Stress Relief - Totakashtakam

Dakshinamurthy Stotram

Guru Paduka Stotram

Sri Annapurna Ashtakam Telugu

Sunday, July 19, 2015

నేడు కాషాయం ఒక విలాస జీవన విధానం.

మన పంట పొలము బాగుండాలంటే ముందుగా  మన చేలో ఉన్న కలుపు మొక్కల్ని పీకాలి తరువాత పంటకు సారం చేకూర్చాలి, ఇది అందరికీ తెలిసిందే.
అలా కాకుండా మేము  పక్క రైతు పొలములో ఉన్న కలుపు పీకుటాము, తరువాత మా పంట పొలం సంగతి చూసుకుంటాము అంటే అది ఎవరి ఇష్టం వారిది.
ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , మన హిందూ మతములో ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న కలుపు మొక్కలు " బురిడీ బాబాలు, దొంగ స్వాములు, వ్యాపార పీఠాధిపతులు, సంభావనల కోసం అజ్ఞానాన్ని మిడిమిడి జ్ఞాన పండితులు మరియు ముఖ్యంగా నేటి సంఘవ్యతిరేక కిరాయి వ్యాపార మీడియా ". మరి హిందూమతం కోసం పనిచేసే ఆరెస్సెస్ వీహెచ్ పీ ఏమి చేస్తున్నట్టు ? అవి ఎవరి గుప్పెట్లో ఉన్నాయి ? ఆ సంస్థలలో దళితులు నాయకులుగా ఉన్నారా ? లేకపోతె కారణాలు ఏమిటి ? కారకులు ఎవరు ?
మన హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే ప్రతి హిందూమతాభిమాని చెయ్యాల్సింది తోలి యుద్ధం వీళ్ళ మీదే.
కాషాయం కట్టింది సర్వసంగ పరిత్యాగం చేసి సమాజానికి మతానికి అంకితం అవుతానని మాత్రమె కదా ..!
కాషాయం అంటే అగ్ని స్వరూపం. అగ్నిలో ఏమి వేసినా ఎలా ఆహుతి అయిపొతాయో అలాగే కాషాయం కట్టిన మనిషి సర్వసంగ పరిత్యాగం చేసి, వాళ్ళ పూర్వాశ్రమ ఆచారాలు అంటూ ముట్టూ వదిలేసి కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరినీ సమ దృష్టితో చూస్తూ సమాజం కోసం పరితపిస్తూ ఉండాలి.
కాషాయం కట్టిన వారికి  సమాజం అంటే అస్పృశ్యత అంటరానితనము పేద ధనిక భేదం లేకుండా అందరూ అన్ని జీవులు  ఒక్కటే అనే భావం.
 సర్వసంగ పరిత్యాగం అంటే అరిషడ్వర్గాలను అహంకారాన్ని అసూయాద్వేషాల ను యజ్ఞోపవీతాన్ని వదిలేసి  కుల వర్గ వర్ణ అంటూ ముట్టు మడి లాంటివి లేకుండా దీన జనోద్ధారణ, మతోద్ధారణ మరియు తానూ దైవత్వముతొ నిండి సమాజములో  దైవత్వాన్ని అందరిలో పెంపోదించడం కదా ..!
ఇది ఈరోజులలో ఎంతమంది కాషాయ ధారులు పాఠిస్తున్నారు ?
నేడు కాషాయం కట్టిన వాళ్ళు ఎవరు ? వాళ్ళు ఎవరికి దగ్గర ? ఎవరికి దూరంగా ఉంటున్నారు ?
మతం కోసం కాషాయం కట్టిన స్వామీజీలు నేడు ఎంతమంది దళితవాడల కు పేదల గృహాలకు వెళుతున్నారు?
నేడు కాషాయం ఒక పెద్ద వ్యాపారం.
నేడు కాషాయం ఒక పెద్ద రాజకీయం.
నేడు కాషాయం ఒక విలాస జీవన విధానం.

అమాయక ప్రజల నమ్మకాల మీద జరుగుతున్న దోపిడీ

అమాయక ప్రజల నమ్మకాల మీద జరుగుతున్న దోపిడీ. ఎవరి నమ్మకాలు ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి అని కాదని ఎవ్వరు అడ్డు చెప్పడములేదే..! అలాగని వాటి చాటున నిజాల్ని కప్పి పెట్టాలనుకోవడం మూర్ఖత్వమే కదా ..! ఆ నిజాలు ఎవరికి తెలిసినవి వాళ్ళు చెబుతారు, ఇష్టం ఉన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు వినరు, అందులో గొడవలు పడాల్సిన అవసరము లేదు.
సకానాతన వైదిక  శాస్త్రం ప్రకారం  నూటికి నూరు శాతం నేటి పుష్కర స్నాన వేలంవెర్రి తిరునాళ్ళు మాత్రమె, ఇది మూర్ఖత్వమే,
వైదిక సంప్రదాయం ప్రకారం పుష్కర స్నానాలు కేవలం సన్యాసులకు,ఋషులకు,  పితురులకు పిండ తర్పణాల కు మాత్రమె పరిమితం.
నేడు టీవీలలో నిత్యమూ ప్రవచనాలు చెప్పే పండితులు పీఠాధిపతులు ఎవరైనా సరే వేదాలలో గీతలో రామాయణ భారతాలలో ( పురాణాలు తప్పించి, పురాణాలు అన్నీ నేటి  నవలలు లాంటి కాల్పనిక కధలే )  ఎక్కడైనా సరే ఈ పుష్కర స్నానాలు మహిళలకు పిల్లలకు తండ్రి బ్రతికి ఉన్న కుమారులకు అని చెప్పబడి ఉంటె అది వాళ్ళు రుజువు చేస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధమే.
అసలు మహిళలకు కొన్ని సందర్భాలలో మాత్రమె నదీ సాగర స్నానానికి అర్హులు,
భర్త బ్రతికి ఉండగా ఏ మహిళా వైదిక సనాతన సంప్రదాయం ప్రకారము ఎత్తి పరిస్థితుల్లోను ఎక్కడా కూడా శిరోముండనం చేయించుకోకూడదు, అది తిరుమల అయినా కూడా.
కానీ నేడు ఈ పండితులు ఒక్కడు కూడా, ఈ పీఠాధిపతులలొ ఒక్కడు కూడా అలా మహిళలు శిరోముండనం చేయించుకోవద్దు అని చెబుతున్నాడా ? టీటీడీ వాళ్లకు ఆ వెంట్రుకల వ్యాపారం కావాలి, ఆ వెంత్రుల వ్యాపారములో అంతర్జాతీయ స్థాయి వ్యాపారులు ఉంటారు , కోట్లాది రూపాయిలు చేతులు మారుతుంటాయి. మరి తిరుమలలోను ఇంకా ఇతర ప్రదేశాలలోనూ భారతీయ హిందూ ముత్తైదు మహిళలు శిరోముండనం చేయించుకోవడం దరిద్రం అని, అలాంటి మహిళలను వాళ్ళ మోఖాలను  పురుషుడు / భర్త చూడకూడదు అని చెబుతున్నారా ?
బహిష్టు ఉన్న మహిళలు, మైల ఉన్న మహిళలు,కుటుంబాలు అస్సలు నదిలోకి సముద్రములోకి కాలు పెట్టకూడదు అని కదా మన శాస్త్రాలు చెప్పేది, నేడు పుష్కర స్నానాలు ఆచరిస్తున్న వాళ్ళలో ఎంతమంది ఇలా ఉండి ఉంటారు ? చెప్పగలరా ?
దీన్ని టీవీలు స్వామీజీలు పీఠాధిపతులు ప్రవచనకారులు పండితులు కలిసి అమాయక ప్రజల నమ్మకం మీద చేస్తున్న కోట్లాది  రూపాయిల ఆధ్యాత్మిక వ్యాపారము కాదా ? దీని వలన ఎవరికి చెడు ? ఎవరికి మంచి ?
ఈ విషయాల మీద నేటి సనాతన వైదిక పండితులు ఘనాపాఠీలు స్వామీజీలు పీఠాధిపతులు  శాస్త్ర ప్రకారం చర్చలకు  మీరు నేడు వాడుకున్న వాడుకుంటున్న చానెళ్ళలో ప్రత్యెక లైవ్ కార్యక్రమములో సిద్ధపడితే మేము సిద్ధమే.
మేము మా శాస్త్ర ప్రమాణాలు ఓడిపోతే / వీగిపోతే మీరు వేసే ఎటువంటి శిక్షకు అయినా మేము అర్హులమే, అలాగే మేము ఒక కోటి రూపాయిలు మీకు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే, ఒకవేళ మీరు ఓడిపోతే మీరు ( స్వామీజీలు పీఠాధిపతులు పండితులు ప్రవచానకారులు మరియు చానెళ్ళ అధిపతులు ) తెలుగు  సమాజానికి క్షమార్పణ చెబితే చాలు. ఆ కిరాయి చానెళ్లకు ఆ ప్రసారాల కిరాయి కూడా మేమే భరిస్తాం .
ఎవరైనా సరే,( ఇందులో ముఖ్యంగా శ్రీ చాగంతో కోటేశ్వరరావు గారు, శ్రీ పరిపూర్నానంద గారు, శ్రీ స్వరూపానంద గారు, శ్రీ చిన జియ్యరు గారు మరియు ఇతర ప్రతిరోజూ సనాతన ధర్మమూ మతము పేరుతొ టీవీలలో సొల్లు కక్కే  చిల్లర ప్రవచానకారులు అందరు పాల్గోనాల్సిందే ) చర్చకు సిద్ధపడి ముందుకు వస్తే సంప్రదించండి. ఈ చర్చలో మీరు  గెలిస్తే  మీకే మంచిది, మన సనాతన ధర్మానికే మంచిది, మన హిందూ మతానికే మంచిది.
ఇట్లు
సనాతన ధర్మాన్ని, వైదిక సంప్రదాయాన్ని పాటించే హిందూ బంధువులకు అందరికి నమస్సుమాంజలితో,
మీ సువేరా 

Friday, July 17, 2015

వీళ్ళు మతానికే కాదు భూమికి కూడా బరువే.

రాజమండ్రి పుష్కర దుర్ఘటనలో స్వార్ధపూరిత ప్రభుత్వ దురాశ, కిరాయి మీడియా పాత్రతో పాటు హిందూమత బ్రతుకుదెరువు పండితులు మరియు వ్యాపార దృక్పద దొంగ పీఠాధిపతుల పాత్ర కూడా ఉంది.
ఎడిసేవాళ్ళకు, ఏడిపించే వాళ్లకు, ఏడిసెవాళ్ళను చూసి ఆనందించే వాళ్లకు ఇప్పుడు సమయం వచ్చింది, ఇక మీ ఇష్టం .....!
కులం మీద పది ఎడిసే వాళ్ళు కొంతమంది, మతం మీద పడి ఎడిసే వాళ్ళు కొంతమంది.
ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకునేది రాజకీయనాయకులే కాదు ఇప్పుడు దొంగ పీఠాధిపతులు కూడా తయారయ్యారు.
పుష్కర స్నానాల గురించి అర్ధసత్యాలతో ఇన్ని రోజులు తార్పుడుగాళ్ళ కిరాయి టీవీ చానెళ్ళలో ఇష్టానికి సోల్లు కక్కిన దొంగ పీఠాధిపతులు పండితులు ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు క్రొత్త పల్లవి అందుకున్నారు. వీళ్ళు మతానికే కాదు భూమికి కూడా బరువే.
ఇన్నాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకున్న జాతీయ కీరస్తానీ కాంగ్రెస్ బానిసగాళ్ళు మరియు అదే తానుముక్క అయిన ఆంధ్రా కీరస్తానీ కాంగ్రెస్ వయ్యేస్సార్సీపీ నాయకుడు మరియు విశాఖ బ్లాక్ మెయిల్ పీఠాధిపతి కూడా రాబందులు లాగా అక్కడ వాలిపోయారు.
ఇన్నాళ్ళు అక్కడ ఉన్న తప్పులు ఏనాడూ ఎత్తి చూపని తెలుగు తార్పుడు కిరాయి అవకాశవాద మీడియా కూడా గొట్టాలతో తయారు.
అక్కడ పనులలో జరిగిన అవినీతి అలసత్వం అక్రమాలు గోదావరి వరద లాగా కోకొల్లలు..... సువేరా

తిలాపాపం తలా పిడికెడు.

గేదోడు గేదకి ఏడిస్తే, తోలోడు తోలుకి ఎడ్చాడని ఒక సామెత, ఆ సామెత నేడు రాజమండ్రి పుష్కర దుర్ఘటనలో నిజమని నిరూపించబడింది.
ప్రభుత్వం తన పరాజయాలను తప్పిదాలను కప్పి పెట్టుకోవడానికి 1500 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ పుష్కరాల అతి ఆడంబర ప్రచారముతో లబ్దిపొందాలని చూసింది, తెలుగు వార్తా చానెళ్ళు పత్రికలూ ప్రభుత్వం నుండి ప్రకటనలు ఆశించి కావలసిన దానికంటే ఎక్కువ ప్రచారం కల్పించాయి.ప్రజల్ని జాగారూకులు చెయ్యాల్సిన ఈ రెండు వ్యవస్థలు కూడా ప్రజల్ని ఇంకా తప్పుదోవ పట్టించి మూదులుగా తయారు చెయ్యడములో విజయం పొందినాయి.
ప్రభుత్వం అక్కడ కల్పింహ్చే ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక అదనపు డీజీపీ స్థాయి అధికారిని శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి, ఒక ప్రతేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని అక్కడ ఇతర అన్ని ఎర్పాతులు పర్యవేక్షించడానికి నియమించి, ఒక్కొక్క ప్రధాన ఘాట్ దగ్గర ఒక ఆర్డీవో ని , ఒక అదనపు ఎస్పీ ని నియమించి వారికి తగిన సిబ్బందిని ఇచ్చి ఉంటె ఇటువంటు దుర్ఘటన జరగడానికి అవకాశం ఉండేది కాదేమో.
ఇప్పుడు తక్షణం ప్రభుత్వం ఉపెక్షించకున్దా మీనా మేషాలు లెక్కించకుండా బాధ్యులైన అధికారుల మీద మంత్రుల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద హత్య కేసులు నమోదు చెయ్యాలి.
ప్రతి తార్పుడు గాడు, బ్రోకరు గాడూ నేడు చానెళ్ళు పెట్టి వాళ్ళ చీకటి వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయ నాయకులను అధికారులను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళను లొంగ దీసుకుని సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్నారు. ఈ మీడియా గుప్పెట్లో న్యామూర్తులు కూడా చిక్కుకుంటున్నారు, ఇదే మీడియా నేడు మతాన్ని మత విశ్వాసాన్ని కూడా వాళ్ళ వ్యాపార వస్తువుగా మార్చుకుని కొంతమంది వెధవల్ని మహా పండితులుగా స్వామీజీలుగా పీఠాధిపతులుగా చూపించి / తయారుచేసి వాళ్ళ ద్వారా అనైతిక వ్యాపారాలు చేసుకుంటున్నారు. సమాజాన్ని దోచుకుని దేశాన్ని కొల్లగోట్టుకుని, పాపాలు చేసి కొంపలు ఆర్పిన రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, స్మగ్లర్లు, చానెళ్ళ అధినేతలు, దొంగ పీఠాధిపతులు, నికృష్ట పండితులు, వ్యభిచారులు, జర్నలిష్టులు, దొంగసారా ఎర్రచందనం గంజాయి వ్యాపారస్తులు, డాక్టర్లు, లాయర్లు అందరు గోదావరిలో మునిగేసి వాళ్ళు చేసిన పాపాలు వదిలించుకోవడానికి రావాలను కోవడం మన హిందూమత దరిద్రం.
ప్రతి నిత్యమూ తెలుగు కిరాయి చానెళ్ళు పెట్టగానే పైసాకి కూడా పనికిరాని దొంగ ముండా కొడుకులు కాషాయం కట్టి స్వాములుగా పీఠాధిపతులుగా మారి పెద్ద అంచు పట్టు పంచెలు లాల్చీలు కట్టుకుని అడ్డ బొట్లు నిలువు బొట్లు పెట్టుకుని కూర్చుని ఆ తార్పుడు చానెళ్ళ ద్వారా అమాయక ప్రజలలో అజ్ఞానాన్ని నింపుతూ ప్రజల నమ్మకముతో వ్యాపారాలు చేసుకుంటూ హిందూమతము అంటే జుగుప్స కలిగే విధముగా మార్చేసారు. నేడు అదే చానెళ్ళు 40 అమాయక నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. అసలు పుష్కరాలే వేద ప్రమాణాలు కావు, అటువంటిది ఒక వర్గము మాత్రమె వాళ్ళ వర్గ ప్రయోజనాల కోసం పుష్కర స్నానాలు చేసే ముందు ఒకడు నదిలోకి మట్టి విసర మంటాడు , ఒకడు బంగారం విసర మంటాడు, ఒకడు పట్టు బట్టలు విసరమంటాడు, ఒకడు ఇంకా ఏదేదో విసరమంటాడు, ఒకడు ఇదే రోజు స్నానం చేయ్యాలంటాడు, ఇంకొకడు అదే రోజు ఇంకో విధంగా చేస్తే మనకు కనిపించని ముక్కోటి దేవతలు వరాలు ఇస్తారు అని అంటాడు. ఒక్క చానెల్ కూడా ఇవన్నీ తప్పని ఇలా చేస్తే నది కలుషితం అవుతుందని చెప్పడానికి సాహసం చెయ్యలేదు.
అసలు నిన్న రాజమండ్రిలో జరిగిన 40 మంది హత్యాకాండకు బాధ్యులుగా తెలుగు చానెళ్ళలో రోజు కనిపింస్తు వేద శాస్త్ర ప్రామాణికం కాని పిచ్చి కూతలు కూసే పండితులను పీఠాధిపతులను అవి ప్రసారం చేసే చానెళ్ళ యాజమాన్యాలను గుర్తించి వాళ్ళ మీద హత్య కేసులు నమోదు చెయ్యాలి.
సందట్లో సడేమియా లాగా శవాల మీద పేలాలు ఏరుకోవడానికి దౌర్భాగ్య కాంగ్రెస్ బానిసలు నోళ్ళు లేపుతున్నారు, వాళ్లకు తోడూ నరహంతక ప్రతిపక్ష నాయకుడు తయారయ్యాడు, వీళ్ళకు తోడు విశాఖపట్నానికి చెందినా సినిమా టిక్కట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని బ్రతికి నేడు కాషాయం కట్టి నేను ఒక పీఠాధిపతిని అని చెప్పుకుంటూ మరొక అవకాశవాది పైరవీకారుడు, ఒక కుల వ్యతిరేకి తయారయ్యాడు. 
ఈ దుర్ఘటనలో తిలాపాపం తలా పిడికెడు.

జ్ఞాన గంగలో కదా ........!

ఇక్కడ ప్రాణాలు తీసి, కాపరాలు కూల్చి, మోసాలు చేసి చేసిన పాపాలు గోచీలో పెట్టుకుని అక్కడ గంగా గోదావరీ కృష్ణా తుంగభద్రా యమునా సరస్వతీ నదులలో మునిగితే ఆ చేసిన పాపాలు పోతాయా ?
రోజూ ఆ నదులలో పందులు పశువులు కూడా పోర్లుతాయి మరి ..!
మనం మునగాల్సింది, తడిసి ముద్దవ్వాల్సింది జ్ఞాన గంగలో కదా ........! సువేరా

ఈ రెండు తరగతుల వాళ్ళు నేటి సమాజానికి చెడుపే..

కనీసం శ్రీసూక్తం, పురుషసూక్తం, రుద్రం నమకం చమకం స్వరదోషాలు లేకుండా పఠించలెని వాళ్ళు నిత్య త్రిసంధ్యలలో గాయత్రీ చెయ్యని వాళ్ళు, కనీస ప్రమాణాలు పాఠించని వాళ్ళు, యగ్నోపవీతముతో మధ్య మాంసాలు, గుట్కా సిగరెట్లు సేవించే వాళ్ళు నేడు హిందూమతం పేరుతొ అమాయక ప్రజల్ని పండితులమని మోసం చెయ్యడం, శాపనార్ధాలు పెడుతూ ప్రజల్ని భయపెట్టి బ్రతకే వాళ్ళు,
కనీసం రిపోర్టింగు ఎలా చెయ్యాలో, ఎలా వ్రాయాలో, ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళు, ఏది వార్తో, ఏది కాదో తెలియని వాళ్ళు జర్నలిజం అంటే కనీస అవగాహన లేకుండా సరైన చదువు సంధ్యలు లేకుండా మెడలలో మూర్చరోగి వేసుకున్నట్టు ఒక కార్డు వేసుకుని ప్రెస్ అని జర్నలిష్టునని సమాజాన్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తూ బ్రతకే వాళ్ళు,
ఈ రెండు తరగతుల వాళ్ళు నేటి సమాజానికి చెడుపే...... సువేరా

మీరు ఒప్పుకుంటే అది మీ ఖర్మ .

నీవెవరో చెప్పాలంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు,
నీ రాజ్యం / దేశం / రాష్ట్రం ఎలాంటిదో చెప్పాలంటే మీ రాజు : నాయకుడు ఎవరో చెప్పు,
మీ సమాజం ఎలాంటిదో చెప్పాలంటే మీ సమాజములో విద్యావంతులు మేధావులు ఎలాంటి వారో ఎవరో చూపించు.
మేము చాలా గొప్ప వాళ్లము, బాగా తెలివిగల వాళ్లము, మేదావులము, ప్రపంచానికి మార్గదర్శకులము అని వ్హేప్పుకుని విర్రవీగే నేటి ఆంధ్రప్రదేశ్ విద్యావంతులు మేధావులు నాయకులు నేడు ఆంద్ర ప్రజలకు సమాధానం చెప్పుకుని తీరాలి. ఒక స్వయం ప్రకటిత మేధావిని కిమ్మనకుండా మోస్తున్న హైదరాబాదు కిరాయి మీడియా సంస్థలు నిశ్శబ్దముహా ప్రమోట్ చేస్తున్న ఒక విష పురుగు, ఒక మానసిక రోగి, హైదరాబాదులో వెలమ కౌగిలిలో సేద తీరుతూ హైదరాబాదులోని అవకాశవాద మీడియాలో పాతుకుపోయి డబ్బులకు మనుషులను ప్రమోట్ చేసే మీడియాలోని కొన్ని వికృత శక్తుల ద్వారా చూపించబడుతున్న ఒక కిరాయి సైకో.
నేటి ఆంద్రప్రదేశ్ విద్యావంతులను నాయకులను చూస్తుంటే జుగుప్స జాలి కలుగుతోంది.
పాపం ..... వాళ్ళ స్థాయి నేడు చెప్పాలంటే, ఆంధ్రా మేధావుల ఫోరం అనే స్వయంప్రకటిత సంఘం అధ్యక్షుడిని చూపించవచ్చు. అతను ఎవరి చెప్పు చేతలలో ఉన్నాడు ? అతని వెనక ఉన్నది ఎవరు ? అతనికి ఆర్ధిక సహకారం చేస్తున్నది ఎవరు ? ఆ సంఘములో సభ్యులు ఎవరు ? ఆ సంఘం చిరునామా ఎక్కడ ? ఆ సంఘం ఎక్కడ నమోదు చేసారు ? ఈ మేధావి గత దశాబ్దముగా హైదరాబాదులో ఎవరి కనుసన్నలలో పని చేసాడు ? ఆతను ఏమి మాట్లాడుచున్నాడో మీకు తెలుసా ? అతను గతములో ఏమి మాట్లాడాడు, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడు ?
ఇటువంటి వ్యక్తులను మీ మేధావులుగా మీరు ఒప్పుకుంటే అది మీ ఖర్మ .

తప్పుని తప్పు అందాం ... ఒప్పుని ఒప్పు అందాం —

జరిగిన తప్పులను ఒప్పుకోవడానికి సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపం చెందడానికి కూడా వ్యక్తిత్వం ఉండాలి, హుందాతనం ఉండాలి, మానవత్వం ఉండాలి, గుండె నిండా ధైర్యం ఉండాలి.
అవి అన్నీ అతనిలో కనీసం ఉన్నాయి కాబట్టే రాజమండ్రి పుష్కర దుర్ఘటన బాదితల దగ్గరకు, మృతుల కుటుంబ సభ్యుల దగ్గరకు ఒక ముఖ్యమంత్రిగా వెళ్లి క్షమార్పణలు అడగగలిగాడు. అభినందనీయుడు.
తప్పుని తప్పు అందాం ... ఒప్పుని ఒప్పు అందాం
 — 

పాదాభివందనాలు చేస్తా. ....

భారతదేశములో ఏ రాజకీయపార్టీకి చెందని అందరు కాంగ్రెస్ పార్టీనే,
అలాగే, భారతదేశములో ఏ మతానికి చెందని వారు, హేతువాదులు, నాస్తికులు, మతం అంటే ఏమాత్రం అర్ధం తెలియని వాళ్ళు అందరు హిందువులే అని చాలామంది భావన అన్నమాట ....!
అసలు మతం అంటే ఏమిటి ?
మతం ఎవరికి కావాలి ?
మనిషికి జీవితంలో మతం ఎప్పుడు మొదలవుతుంది ? 
మతం పరమార్ధం ఏమిటి ?
వీటికి సరైన సమాధానాలు చెప్పగలిగితే వారికి నేను పాదాభివందనాలు చేస్తా. .... సువేరా

ఉలుకెందుకు ?

ఆకలితో అలమటించే వాడికి, రెక్కాడితేగాని డొక్కాడని నిర్భాగ్యులకు మతంతో పనేమిటి ?
కూడు గూడు గుడ్డ లేని అభాగ్యులకు మతంతో పనేమిటి ?
వాళ్ళు గత జన్మలో చేసిన పాపాలకు వాళ్ళు ఈ జన్మలో పేదరికము దరిద్రము అనుభవిస్తున్నారు అని చెప్పే వాళ్లకు ఆ నిర్భాగ్యులు / దరిద్రులు వేరే మతము నీడలోకి వెళుతుంటే ఉలుకెందుకు ?
మతం వేర్రితో ఊగిపోయే వాళ్లకు వాళ్ళ దేవుడు వాళ్లకి ఉన్నాడు కదా , పోయి ఆ దేవుని పాలతోను పళ్ళ రసాలతోను ముంచేసి ఆ పాలను పళ్ళ రసాలని మురుగు కాలవల్లో ప్రవహిస్తుంటే అది చూసుకుంటూ మీ పాపం కొట్టుకుపోతోంది అని ఊహించుకుంటూ ఆనందించండి, కాదన్నది ఎవరు ?
దేవుడికి దేవుని పూజలకు సేవలకు దర్శనానికి వెల కట్టి వాటిని నడి బజారులో  నిస్సిగ్గుగా  అమ్ముకుంటూ, వీలయితే నల్ల బజారులో కూడా అమ్ముకుంటూ, దొంగల్ని దోపిడీదారుల్ని అసాంఘిక శక్తులను ధర్మకర్తలుగా పెట్టుకుని ఊరేగుతున్నారు కదా, ఊరేగండి కాదన్నది ఎవరు ? భక్తుల హోదాల్ని బట్టి దేవుడిని అమ్ముకుంటుంటే ఎవరన్నా కాదంటున్నారా ? కాదనగాలుగుతున్నారా ? ఒకవేళ ఎవరన్నా కాదు అంటే మీరు ఊరుకుంటారా ?
పగలు రాత్రిళ్ళు పొట్టనిండా పళ్ళు పాలు నింపేసి దేవుడి పేరుతొ ఉపవాసం అని చెప్పుకుంటూ దేవుని దర్శనం కోసం ప్రసాదం కోసం తీర్ధం కోసం  తోపులాడుకుంటూ కొట్టుకుంటూ కిందా మీదా పడిపోతూ రేపు దేవుడు ఉండడేమో అన్నట్టు ఆత్రంతో పడే అగచాట్లు మీకు ఇష్టం అయింది కాబట్టి మీరు ఆ బాటలో నడుస్తున్నారు, నడవండి కాదన్నది ఎవరు ? అది ఇష్టం లేని వారు వేరే మార్గం ఎంచుకుంటే మీకు బాధ ఎందుకు ?
హిందూ మతం పేరుతొ మనంఎప్పుదన్నా నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చామా ? కట్టుకోవడానికి బట్టలు ఇచ్చామా ? వాళ్ళ పిల్లలు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తుంటే మనం ఏనాడన్నా గుక్కెడు పాలు ఇచ్చామా ? నిరుపేద గర్భిణీ మహిళలు కాన్పుకోసం వస్తే వాళ్లకు ఎవరన్నా ఉచితంగా కాన్పులు చేసారా ?
మంకు కావాల్సింది పుణ్యం కదా, మనం ఎన్ని వెధవ వేషాలు వేసినా, వెధవ పనులు చేసినా  అదెలాగో దేవుడిని కోరికలతోను కానుకలతోను నగలతోను  పాలతోను పళ్ళ రసాలతోను ముంచేస్తే ఆయన ఇచ్చేస్తాడు కదా ....! సువేరా

Thursday, July 16, 2015

నేను హిందువుని

నేను హిందువుని అని చెప్పుకోవడానికి అందరు గర్వపడతారు గానీ , ఆ గర్వం మనకు ఎందుకో కూడా తెలియాలి కదా ..?
హిందువుని అని చెప్పుకుని తిరిగేవారు విర్రవీగే వారు ఆ హిందూమతము లోని లోటుపాట్లు కూడా తెలుసుకోవాలి కదా ...?
హిందూమతములో ఇప్పుడు చెప్పుకునే కుల వ్యవస్థ ఎప్పుడు మొదలయ్యింది ? దానికి బాధ్యులు ఎవరు ? మన వేదాలలో గీతలో కుల వ్యవస్థ గురించి ఎక్కడైనా చెప్పారా ? ఇప్పుడు కులాల కుంపట్లో హిందూ / సనాతన జాతి నాశనం అయిపోతుంటే ఈ విర్రవీగే వాళ్లకు చీమైనా కుట్టినట్టు ఉందా ?
మనకు గీతలో చెప్పింది వర్ణ వ్యవస్థ కదా ...! చాతుర్ వర్ణం మయా సృష్టం అని కదా గీతా చార్యుడు మనకు చెప్పింది ., అసలు వర్ణం అంటే ఏమిటి ? వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చింది ఎవరు ? కుల వ్యవస్థని పెంచి పోషించి నూటికి 90 మందిని అంటరాని వారిగా సమాజానికి దూరంగా పెట్టింది ఎవరు ? మనకు ఆదిశంకరుల వారు అంటరానితనాన్ని ఉద్భోదించారా ? ఆయన చండాలుని కాళ్ళు పాట్టుకున్నారని మనము చదువుతామే, మరి ఆ చండాలుర కులస్థులను గ్రామాలకు దూరంగా పెట్టి వాళ్ళను సంఘ బహిష్క్రుతులుగా చేసింది ఎవరు ? కారకులు ఎవరు ? దళితుల్ని వెనుకబడిన వర్గాలను దేవాలయాలలోకి రాకుండా ఆపింది ఎవరు ? శూద్రులను కేవలం ఉత్పాదక శక్తులుగా మాత్రమె గుర్తించి ఆ ఉత్పాదన కోసమే వాళ్ళను గౌరవించి వాళ్ళను మాత్రం దేవాలయాలలో ధ్వజ స్థంభం దగ్గరకు మాత్రమె రానిచ్చింది ఎవరు ? అదే దళితులను దేవాలయాల ప్రాకారాల బయటే ఉంచింది ఎవరు ? మన వేదాలా ? మన శాస్త్రాలా ? మన సనాతన ధర్మమా ? మన భగవద్గీతా ? మన రామాయణ భారతాలా ? భాగవత పురాణాలా ?
అనాదిగా మన హిందూ పీఠాధిపతులు స్వాములు పండితులు ఎవరు ? వాళ్ళు చేసింది ఏమిటి ? ఒక్క కంచి పరమాచార్య తప్పించి మిగతా వాళ్ళు ఎవరన్నా దళితుల్ని నిమ్న వర్గాలను మనుషులుగా చూసారా ? ఎవరన్నా మన పేద సమాజానికి పనికి వచ్చే విధంగా ఉచిత ఆసుపత్రులు పాఠశాలలు నిర్మించారా ? వేల లక్షల కోట్ల రూపాయిలు ఈ పీఠాధిపతులు స్వామీజీలు ఎక్కడ దాచారు ? ఎవరి దగ్గర దాస్తున్నారు ? మన మతం గురించి అనీ వదిలేసి కాషాయం కట్టిన వాళ్లకు బంగారు సింహాసనాలు బంగారు మంచాలు కంచాలు బంగారు పాదుకలు గండపెండేరాలు అవసరమా ? బెంజి కార్లు ప్రత్యెక విమానాలు అవసరమా ? వీళ్ళందరూ మతోద్దారకులం అని చెప్పుకుంటూ విలాసవంతమైన జీవితాలు అనుభవించడం నిజం కాదా ? వీళ్ళందరూ ఏ వర్గానికి చెందినా వారు ? వీళ్ళను, వీళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాలను శ్రీ కంచె అయిలయ్య కాకపొతే ఇంకొకరు ప్రశ్నిస్తారు, ప్రశ్నించ కూడదా ? ప్రశ్నించిన వాళ్ళు అందరు మత ద్రోహులేనా ? మనం వాళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక, మన మతములో ఉన్న కుళ్ళును ప్రశ్నించే వాళ్ళను చూసి ఓర్వలేక వాళ్ళ అనుమానాలు నివృత్తి చెయ్యలేక వాళ్లకు శాపనార్ధాలు పెడుతూ ఎన్నాళ్ళు మనం మన అంతరాత్మకు ముసుగులు వేసుకుని బ్రతుకుదాం ? అమాయకుల్ని మతం పేరుతొ పాపం పుణ్యం స్వర్గం నరకం అనే పేరుతొ భయపెట్టి ఎన్నాళ్ళు ఇలా దొంగ బ్రతుకులు వెళ్ళ దీద్దాం ? దొంగ పూజలతో ఎన్నాళ్ళు దోపిడీకి గురవుదాం ? అభిషేకాలు సేవలు పేరుతొ నిత్యమూ ఎన్ని లీటర్ల పాలు పండ్ల రసాలు మురికి కాలువల పాలు చేద్దాం ? వాటిని నిరుపేదలకు అనాధ పిల్లలకు వయో వృద్ధులకు ఇస్తే శక్తివంతమైన దేశం అవుతుంది కదా ? ఏ దేవుడు ఎక్కడ చెప్పాడు ఇలా అభిషేకాలు చేసి పాలు పళ్ళు మురికి గుంతల పాలు చెయ్యమని ? మన వేదాలలో గీతలో చెప్పింది హవిస్సు ( హోమం ) మాత్రమె కదా ..? అమాయకులకు జ్ఞాన బోధ చెయ్యాల్సిన గురువులు పండితులు స్వాములు పీఠాధిపతులు అజ్ఞానాన్ని నూరి పోస్తూ ఇంకా ఎన్నాళ్ళు సమాజాన్ని ఇలా అజ్ఞానములో ఉంచుతారు ? ఇలా చెయ్యడం మన సనాతన ధర్మానికి మంచిదా ? మనం ఇలా చెయ్యడం వలెనే కదా అన్య మతాలూ రాచపుండు లాగా మన వ్యవస్థని మింగేస్తునాయి కదా ? అది వాళ్ళ తప్పా లేక మన తప్పా ?
శాంతంగా ఆలోచించండి, మనలోని తప్పిదాలను సరిదిద్దుకుందాం, మనలో మన వాళ్ళను అందరినీ కలుపుకోవడానికి ముందుకు కదులుదాం ..................! సువేరా

Tuesday, July 7, 2015

కీశే ఎన్టీఆర్ కి అవమానము కాదు ఇది ?

ఈ అమెరికా వాళ్ళు సామాన్యులు కాదురయ్యా ...!
లాస్ ఏంజిల్స్ లో కీశే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అంటే నేను అబ్బో అని ఊహించా , అక్కడ ఏదో ఒక మంచి కూడలిలోనో మంచి జనసంచారం ఉండే ప్రదేశమో అనుకున్నా ...!!
లాస్ ఏంజిల్స్ లో కీశే ఎన్టీఆర్ విగ్రహం పెడతాన్నారని ప్రపంచం అంతా దప్పులు కొట్టి మరీ చెప్పి , ఇక్కడ నుండి ఘనాపాటీలను అందరినీ అక్కడకు విగ్రాహావిష్కరణకు తీసుకెళ్ళి తీరా ఎవరో ఇంటి ఆవరణలోని గార్డెన్ లోనో లేక పెరటి దొడ్లోనో ఆ విగ్రహం పెట్టి ఆ విగ్రాహావిష్కరణకు వెళ్ళిన వాళ్ళను ఇక్కడ మనల్ని చాలా చక్కగా బోల్తా కొట్టించారుగా ...!
కాకపొతే అందరికీ బాగా ఘనంగానే ముట్టజెప్పి ఉంటారు ఆ ఇంటి యజమాని.
కీశే ఎన్టీఆర్ కి అవమానము కాదు ఇది ?