Friday, October 2, 2015

విభజనలో సమిధలైనది సామాన్యుల జీవితాలు మాత్రమె

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న కేబినేట్ సమావేశములో ఒక తీర్మానం చేస్తూ 2017 జూన్ లోపు హైదరాబాద్, తెలంగాణా నుండి ఆంధ్రా రాయలసీమ వాళ్ళు వెనకకు తమతమ స్వస్థలాలకు తిరిగివస్తేనే స్థానికత ఇస్తాము అని ఒక హుకుం జారీ చేసారు. అదెంతవరకు సబబు ?
రాజకీయనాయకులైతే ఎన్ని వేషాలు అయినా వేయవచ్చు, చిరుద్యోగులు చిరు వ్యాపారులు అలా కాదుకదా ..!
రాజకీయనాయకుడు అక్కడా ఇక్కడా ఆస్తులు వ్యాపారాలు కూడబెట్టుకుని ఎన్ని నాటకాలైనా ఆడగలరు, చిన్న పరిశ్రమలు పెట్టుకున్నవాళ్ళు ,ఆ పరిశ్రమలలో ఉద్యోగ ఉపాధిపనులు చేసుకునేవారి పరిస్థితి వారి పిల్లల భవిష్యత్తు పరిస్థితి ఏమిటి ?
అంటే మీ మీ రాజకీయ స్వార్ధముతొ అన్ని రాజకీయపార్టీలు కలిసి చేసిన దుర్మార్గపు రాష్ట్ర విభజన పనులకు మేము మా పిల్లల భవిష్యత్తు నాశనం కావాలా ?
రాష్ట్ర విభజనతో లబ్ధి పొందినది రాజకీయపార్టీలే కదా ..?
గత 50 ఏళ్ళుగా హైదరాబాదు మన రాజధాని అని, తెలంగాణా ప్రాంతము కూడా మన రాష్ట్రమే అని నమ్మి ఆంధ్రా నుండి వెళ్ళిన లక్షలాది కుటుంబాలు హైదరాబాదులో స్థిరపడి చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడపెట్టుకుని ఇక్కడ హైదరాబాదులో ఆస్తులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొంతమంది బళ్ళారి రాయచూరు లాంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు . వాళ్లకు నేటికీ తమ గ్రామాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఆస్తులు కూడా కలిగి ఉన్నారు, వీళ్ళ సంతానం కూడా ఆంధ్రాతోనే పెళ్ళిళ్ళు లాంటి సంబంధాలు కలిగిఉన్నారు. స్థానికత కావాలంటే వీరందరూ తిరిగి రావాల్సిందేనా ?
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు అయితే రాజకీయనాయకులు లాగా ఎన్ని వేషాలు నాటకాలైనా ఆడవచ్చు , కానీ అక్కడ ఆంధ్రాలో అన్నే అమ్ముకోచ్చి ఇక్కడ తెలంగాణా ప్రాంతములో చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబాల పరిస్థితి ఏమిటి ?
ఆ విభజనలో సమిధలైనది సామాన్యుల జీవితాలు మాత్రమె.
హైదరాబాదులోనూ తెలంగాణాలోనూ మా ఖర్మకొద్దీ స్థిరపడిన మేము ఇక్కడ ఉండలేము .అక్కడకు కదలలేము ............ మాకు ఆత్మహత్యలే శరణ్యమా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.