Monday, October 5, 2015

ఒక తెలుగు వాడి విన్నపము.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని నమస్కరించి ఒక తెలుగు వాడిగా చేసుకునే విన్నపము.
అయ్యా ,
మన ప్రియతమ నాయకుడు కీశే నందమూరి తారక రామా రావు గారు తెలుగుజాతి గురించి భవిష్యత్తు తరాలవారికి తెలియచెప్పడం కోసం ఆనాడు హైదరాబాదు సచివాలయానికి ఎదురుగా తెలుగుతల్లి విగ్రహము మరియు టాంకు బండ్ మీద మన తెలుగుజాతి మరియు తెలుగుభాష గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపజేసిన లబ్దప్రతిష్టుల కాంశ్య విగ్రహాలను నెలకొల్పడం జరిగింది, ఆ విగ్రహాలు హైదరాబాదు నగరానికే వన్నె తెచ్చాయి.
కానీ కాలగమనములొ తెలుగుజాతి యావత్తు సిగ్గుతో తలదించుకునే విధంగా జరిగిన నికృష్ట రాజకీయ స్వార్ధ పరిణామాలతో హైదరాబాదు కీర్తి మసకబారడం అందరికీ తెలిసిందే. కొంతమంది కుక్కమూతి పిందెలు మన భాషను యాసను మన తెలుగుజాతి దివ్వెలను హేళన చెయ్యడం , ఆ విగ్రహాలను అనాగరిక సంస్కారముతో ఒక కుటుంబం ఆనాటి కుసంస్కార కాంగ్రెస్ ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసు పహారాలో ద్వంసం చెయ్యడం కూడా మన కళ్ళముందే జరిగింది.
జరిగిన దానిని గుడ్లప్పగించి మౌన రోదనతో తెలుగుజాతి యావత్తు భరించింది. ఏది ఏమైనా తెలుగుజాతికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
తెలుగుజాతిని తార్పుడుగాళ్ళు తాగుబోతులు చీలికలు పీలికలుగా చేసేసారు.
గతం గతః
మన పదహారు అణాల స్వచ్చమైన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక, మనకు చారిత్రిక అమరావతిని మీ నాయకత్వములో రాజధానిగా ప్రకటించి నిర్మాణం మొదలు పెడుతున్న సందర్భములో ఇక్కడ హైదరాబాదులో సచివాలయము ఎదురుగా ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని, టాంక్ బండ్ మీద ఉన్న మన తెలుగువెలుగుల విగ్రహాలని అన్నిటికూడా తక్షణమే విజయవాడ కృష్ణమ్మ ఒడ్డుకి గానీ లేక అమరావతి నగర నడిబొడ్డుకు గానీ తరలించి మన తెలుగు జాతి మనోభావాలను కాపాడతారని ఆశిస్తున్నాను. వీలయితే ఈనెల అక్టోబరు 22 తేదీనే మనమే గౌరవంగా మేళతాళాలతో ఆ విగ్రహాలను మన స్వచ్చ తెలుగు రాష్ట్రానికి తరలించే ఏర్పాటు చెయ్యగలిగితే ఆ ఘట్టం కూడా మీ చేతులతో మన తెలుగుజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించ బడుతుంది.
ఇక్కడ మన తెలుగుజాతి వెలుగు దివ్వెల విగ్రహాలు ఉండటం ఏమాత్రం మనకు గౌరవప్రదము కానేకాదు.
ఇక్కడ కొన్ని విగ్రహాలను స్వార్ధ రాజకీయ ఓటు బ్యాంకు ఉద్దేశ్యముతో తెలంగాణా ప్రభుత్వమూ ఏర్పాటు చేస్తోంది అనే విషయము మీకు తెలియనిది కాదు, ఆ విగ్రహాల పక్కన లేదా అదే ప్రదేశములో మన చారిత్రిక పురుచుల గొప్పవాళ్ళ విగ్రహాలను ఉంచడం మన గొప్పవాళ్ళను మనము అవమానపరచడమే అవుతుంది.
ఈ విషయాన్ని శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి మంత్రివర్గం మరియు ఆయన సలహాదారులు కూడా సానుకూలముగా తెలుగు వారిగా వివేకముతో ఆలోచించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి మరియు విశాలాంధ్ర మహాసభ వ్యవస్థాపక సబ్యుడు
భవదీయుడు
సుంకర వెంకటేశ్వర రావు ( ఎస్వీరావు ) @ సువేరా @ కొండయ్య

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.