Friday, October 16, 2015

భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో.............

నిన్నటి రోజు భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో మరో చీకటి రోజు.
ఆ చీకటిలో ఒక చిరు కాంతిరేఖ మన తెలుగు వ్యక్తీ కావడం నాకు అత్యంత  ఆనందదాయకం గర్వకారణం. ఈయన నేటి న్యాయవ్యవస్థలో మరో వివేకానందుడు.
 ఇటువంటి కాంతిపుంజాలు మన న్యాయవ్యవస్తలోను రాజకీయ వ్యవస్థలోను విరజిమ్మాలని మన దేశానికి మన యువతకు వెలుగునివ్వాలని, మన యువత ఇటువంటి వారిని ఆదర్శముగా తీసుకుని దేశాన్ని ప్రపంచానికే గర్వకారణంగా మార్చాలని కోరుకుంటున్నాను.
నేను ఈరోజు మీముందు మాట్లాడగలిగే అర్హత జ్ఞానం ధైర్యం నాకు లభించడం ఆ కాంతిరేఖ యొక్క ప్రసరణ నామీద ఉండడమే, అది నా అదృష్టం.

అసలు విషయానికి వస్తాను .................,
ఇప్పటికే మన న్యాయవ్యస్త చాలావరకు బూజుపట్టి బుగిలిపోయింది, అది ఏనాడైనా కూలిపోయే రోజు కనిపిస్తోంది. నేడు వారసత్వ కబంద హస్తాలలోకి మన న్యాయవ్యవస్థ శాశనవ్యవస్థ అధికారవ్యవస్థ వెళ్ళిపోతున్నాయి, వారికి నేడు దళారీ తారుపుడుగాళ్ళ మీడియా కూడా వాళ్ళ ఆస్తులు అక్రమాలు కాపాడుకోవడానికి  కొమ్ముకాస్తోంది, ఈ వ్యవస్థలన్నీ  చాలావరకు కలిసిపోయి ఒక మాఫియాలాగా తయారయి మన దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని దోచుకుంటూ వ్యవస్థీకృత సామ్రాజ్యాన్ని సృష్టిస్తూ తమ వారసత్వ సంపదలాగా మారుస్తున్నారు.
నిన్న మన భారత సుప్రీం కోర్టు లో  అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం న్యాయమూర్తుల నియామక విషయములో నలుగురు  సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెలువరించిన అన్యాయ తీర్పు భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు, భారత రాజ్యాంగ వ్యవస్తకే మాయని మచ్చ, ఇది ఒక రకముగా అహంకార పూరిత తీర్పు, ఇది ఒక వ్యవస్తీకృత న్యాయవ్యవస్త తన నియంతృత్వాన్ని నిలుపుకోవడానికి అర్రులు చాస్తూ ఇచ్చిన దుర్మార్గపు తీర్పు.
కొన్ని సంవత్సరాలుగా మన దేశములో నడుస్తున్న కోలీజియం న్యాయవ్యవస్త  అసమర్ధులను దళారీలను అవినీతిపరులను రాజకీయ పార్టీల ఏజంట్లను కనీసం న్యాయశాస్త్రములొ అక్షరం ముక్క తెలియని కాపీలు కొట్టి ఉత్తీర్ణులైన వారిని ఉన్నత న్యాయస్థానాలలో చాలామందిని న్యాయముర్తులుగా నియమించడం మనకు తెలిసిందే , ఇది లోక విదితమే, ఇది మన భారత ప్రజల దౌర్భాగ్యం.
ఇలా నియమించబడిన వారి చేతిలో మన న్యాయవ్యవస్థను ప్రజల భవితను మన రాజ్యాంగాన్ని అప్పచెప్పడం మన ఖర్మ. వీరందరూ న్యాయాన్ని రాజ్యాంగాన్ని నడిబజారులో అపహాస్యం చెయ్యడం కూడా విదితమే. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక హైకోర్టులో ఉన్నత న్యాయమురులుగా నియమించడానికి  13 మంది అభ్యర్ధుల దగ్గర ఒక్కో అభ్యర్ధి ( హైకోర్టు న్యాయవాదులు ) దగ్గర అక్షరాల మూడు కోట్ల రూపాయిలు చొప్పున వసూలు చేసిన వ్యక్తీ ఎవరో, ఏజెంట్లు ఎవరో  మూసినది ఒడ్డున ఎవరిని అడిగినా చెబుతారు, ఈ వ్యవహారం బహిర్గతం అయిన తరువాత ఆ పేర్లను వెనక్కి పంపించివేయడం జరిగింది ( ఒకవేళ ఇది బయట పడకపోయి ఉంటె మన ఖర్మ కాలి వాళ్ళు నేడు మనకు న్యాయమూర్తులు అయ్యేవారు ). ఇలా జరిగిన సంఘటనలు భారతదేశ న్యాయవ్యవస్థలో చాలా ఉన్నాయి. ఇలా అక్రమంగా నియమించబదినవారు నేడు వారి ఏజంట్ల ద్వారా, తమ కుటుంబసభ్యుల ద్వారా బహిరంగాముగానే కేసునిబట్టి వెలకట్టి వసూళ్లు చెయ్యడం కోర్టు వ్యవహాలలో అబున్హవం ఉన్నవారు ఎవరైనా చెబుతారు.
కొంతమంది వ్యక్తిత్వం లేని వారు ఇలా న్యాయముర్తులుగా నియమించిన తరువాత వారిని ఎవరు ప్రశ్నించకుండా ఉండటానికి సమాజాన్ని భయపెట్టడానికి కోర్టులోనూ బయట ఎవ్వరు వారిని ఎదిరించకుండా ఉండటానికి వారిచేతిలో ఒక దుర్మార్గపు అస్త్రం " కన్టేమ్ప్ట్ ఆఫ్ కోర్ట్ " . ఇది వెధవల్ని ఆ వెధవలు చేసే పనుల్ని కప్పిపెట్టదానికే ఉపయోగపడుతోంది.  ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఉండే క్రింది స్థాయి కోర్టులలో కూడా నియామకాల్లో అక్రమాలు అవినీతి  జరుగుతూ కోట్లరూపాయిలు చేతులుమారడం అందరికీ తెలిసిందే.
చాలామంచి మార్కులతో ఉత్తీర్ణులు అయినవారు న్యాయశాస్త్రంలో మంచి అవగాహన ఉన్న నీతిమంతులు నేడు క్రింద స్థాయిలోనే ఉండిపోతున్నారు, అటువంటివారు మేజిస్త్రేటులుగాను, జిల్లా న్యాయముర్తులుగానే మిగిలిపోతున్నారు.
నిన్న కోలీజియం వ్యవస్థను సమర్ధించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో చాలా అసందర్భ అహంకార వ్యాఖ్యలు చూస్తుంటే ఇటువంటి వ్యక్తులు మనకు అత్యంత ఉన్నత న్యాయమూర్తులు అవ్వడం చూస్తుంటే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు ఉంది.
నిన్నటి తీర్పులో న్యాయమూర్తి శ్రీ చలమేశ్వర్ గారు నడుస్తున్న న్యాయవ్యస్త నియామకాల్లో చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు ఎత్తి చూపిన లోపాలు ప్రజలకు కూడా చేరువవ్వడం సంతోషదాయకం.
ఆయన ఒక జ్ఞాని, ఒక తాత్వికుడు, ఒక నిండు కుండ. ఇటువంటివారు నేడు మన న్యాయవ్యవస్థలో చాలా తక్కువగా ఉన్నారు, ఇటువంటివారికి మనుగడ ఉండనివ్వని నేటి వ్యవస్థలో మనం ఉండటం ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.