Sunday, October 18, 2015

చీకటి రోజు...........

అమరావతి పట్టణ శంఖుస్థాపన శుభాకార్యక్రమానికి శ్రీ చంద్రబాబునాయుడు గారు స్వయాన వెళ్లి శ్రీ కెసీఆర్ & అతని కుటుంబాన్ని పౌరుషం లేకుండా ఆహ్వానించడం తెలుగుజాతికి సిగ్గుచేటు, ఆంధ్రులకు తలవంపు. ఇటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు, ఇది ఒక చీకటి రోజు.
దశాబ్దం పాటు ఆంధ్రులను తీవ్రంగా దుర్భాషలాడి తిట్టిన తిట్టు తట్టకుండా తిట్టి, ఆంధ్రులను ఆంధ్రా మహిళల్ని అవమానానికి గురిచేసిన చేస్తున్న వ్యక్తులను, టాంకు బండు మీద విగ్రహాలను కూల్చిన వ్యక్తులను ఇటువంటి శుభాకార్యక్రమాలకు పిలవడం తగదు, ఒకవేళ ఇది చంద్రబాబు గారిదో లేక తెదేపాదో ప్రైవేటు కార్యక్రమము అయితే ఎవరికీ అబ్యంతరము ఉండాల్సిన పనిలేదు, కానీ ఈ కార్యక్రమం మనసు గాయపడిన దగాపడిన అయిదు కోట్ల తెలుగువారి తెలుగుజాతి కార్యక్రమం.
ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా ఇలా వెళ్లి ఆహ్వానించడాన్ని జీర్ణించుకోలేరు, ఆత్మగౌరవం లేనివాళ్ళు ఈ పిలుపుని ఈ ఆహ్వాన చర్యను నిస్సిగ్గుగా సమర్దిస్తారని తెలుసు, కానీ వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఒక వేళ ఇలా పిలవడం వలన శ్రీ కెసీఆర్ & కో గనక సిగ్గు శరము నీతి జాతి లేకుండా తగుదునమ్మా అంటూ ఆ కార్యక్రమానికి హాజరు అయితే పరిపూర్ణమైన అమరావతి నిర్మాణం జరగదు గాక జరగదు.
హైదరాబాదు ఎల్ & టీ మెట్రో రైలు నిర్మాణములో నిర్మాణ పనులకు కావాల్సిన ఇసుక సిమెంటు స్టీలు రెడీ మిక్స్ లాంటివి సరఫరా కాంట్రాక్టు పొందిన ( కాంట్రాక్టులు పొందినట్టు వచ్చిన ఆరోపణలు ) జాగృతి నాయకురాలు రేపు ఆ అమరావతి పట్టణ నిర్మాణములో కూడా అదే కాంట్రాక్టులు పొందినా ఆశ్చర్యము లేదు, విశాల హృదయులు అయిన ఆంధ్రా నేతలు నిస్సిగ్గుగా ఇచ్చినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటె వారు వారు ఒక్కటే కదా, ప్రజలు కార్యకర్తలే సమిధలు.
సిగ్గు ఎగ్గు పౌరుషం ఆత్మగౌరవం లేకుండా అధినాయకులు చేస్తున్న వికృత చేష్టలను చూస్తూ ఇదంతా మన ఖర్మ అనుకుని మౌనంగా బాధతో బరువెక్కిన గుండెలతో శిలల్లాగా మిగిలిపోక ఏమీ చెయ్యలేము...... సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.