Friday, October 2, 2015

గోమాత ....రైతు

గోమాతను కాపాడాల్సిందే , నిజమే
కాపాడుకుందాం ..........!
మరి ఆ గోవులను మేపే
రైతు సంగతి ఆలొచించవద్దా ...?
మా గ్రామములో ( కృష్ణాజిల్లా, మొవ్వ మండలం , పెదముత్తేవి గ్రామము ) శ్రీ క్రిష్ణాశ్రమంలో 400 ఆవులతో  నిస్వార్ధంగా ఒక  గోశాల నడుపబడుతోంది, ఆ గోశాల నడపడానికి వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో , ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ  దేవునికే ఎరుక. ప్రతి సంవత్సరం పశుగ్రాసం దొరకక వారు పడే అవస్థలు చూస్తుంటే మనకు మనసు వికలం అవుతుంది. ఎక్కడా పైసా లాభం ఆశించకుండా కేవలం మన ధర్మం మీద నమ్మకముతో మాత్రమె నిర్వహిస్తున్నారు.

పట్టణాలలో ఫ్యాన్ల కిందా ఏసీ గదులలోను పడక కుర్చీలలోను కూర్చుని సేదతీరే వాళ్ళు రోజూ  టీవీల ముందు కూర్చుని గోమాతని కాపాడుకోవాలి అని  ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పెద్దలు పండితులు స్వాములు పీఠాధిపతులు కనీసం ఆ గోవులను పెంచిపోశించే రైతు కూలీ వ్యవస్థ వాళ్ళ సాధకబాధలు గురించి కనీసం మాట్లాడరే ...? ఎంతసేపు గోమాతను పూజిస్తే పుణ్యం , గోమాతను పెంచితే స్వర్గం అని ప్రజలకు చెబుతుంటారు, మరి వాటినే నమ్ముకుని ఇన్నాళ్ళు వ్యవసాయం చేసుకునే రైతులు నిత్యమూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే వీళ్ళు ఆ రైతన్నలకు బాసటగా నిలిచే విధంగా ప్రజల్ని తమ ఉపన్యాసాలతో కదిలించావచ్చు కదా ...!
ఏ రైతు కూడా తమ పిల్లలతో పాటు పెంచుకునే చూసుకునే పశువుల్ని / గోవుల్ని కబెళాకు , కటిక వాళ్ళకు అమ్ముకోవడానికి కావాలని ప్రయత్నించడు. సరైన వర్షాలు నీళ్ళు పంటలు లేక  ఆ రైతన్న పెంచుకునే పశువులు / ఆవులు పశుగ్రాసం లేక అవస్థ పడుతూ ఉంటె వాటి ఆకలి బాధ చూడలేక తను మానసికముగా చచ్చిపోయి వాటిని కబేళాలకు అమ్ముకుంటాడు , ఆ తరువాత అతను కూడా  మానసికవేదనతో నిత్యమూ చస్తూ బ్రతుకుతుంటాడు.
ఆ పండితులకు స్వాములకు పెద్దలకు పశు జాతి మీద  నిజమైన ప్రేమ మమకారము ఆప్యాయత ఉంటె వీళ్ళు వారి సంపాదనలో కనీసం ఒక పది శాతం గోరక్షణ కోసం రైతు నిధికి ఇవ్వొచ్చు , కానీ వీళ్ళు అలా చెయ్యరు , వీళ్ళకు చితికేయ్యగానే పుణ్యం రావాలి , వీళ్ళు ఎవరి కష్టాలు తీర్చకుండా మాయలతో స్వర్గలోకానికి వెళ్లిపోవాలి , అక్కడ రంభ ఊర్వసి మేనక తిలోత్తమాలతో కులకాలి ... అదీ నేటి కాషాయం కధ.
ఇలా పచ్చి నిజాలు నాలాంటి వాళ్ళు ఎవరన్నా బయటకు అంటే వీళ్ళకు మనుషులకు వచ్చినంత కోపము ఆవేశము వస్తాయి .


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.