Friday, July 17, 2015

ఉలుకెందుకు ?

ఆకలితో అలమటించే వాడికి, రెక్కాడితేగాని డొక్కాడని నిర్భాగ్యులకు మతంతో పనేమిటి ?
కూడు గూడు గుడ్డ లేని అభాగ్యులకు మతంతో పనేమిటి ?
వాళ్ళు గత జన్మలో చేసిన పాపాలకు వాళ్ళు ఈ జన్మలో పేదరికము దరిద్రము అనుభవిస్తున్నారు అని చెప్పే వాళ్లకు ఆ నిర్భాగ్యులు / దరిద్రులు వేరే మతము నీడలోకి వెళుతుంటే ఉలుకెందుకు ?
మతం వేర్రితో ఊగిపోయే వాళ్లకు వాళ్ళ దేవుడు వాళ్లకి ఉన్నాడు కదా , పోయి ఆ దేవుని పాలతోను పళ్ళ రసాలతోను ముంచేసి ఆ పాలను పళ్ళ రసాలని మురుగు కాలవల్లో ప్రవహిస్తుంటే అది చూసుకుంటూ మీ పాపం కొట్టుకుపోతోంది అని ఊహించుకుంటూ ఆనందించండి, కాదన్నది ఎవరు ?
దేవుడికి దేవుని పూజలకు సేవలకు దర్శనానికి వెల కట్టి వాటిని నడి బజారులో  నిస్సిగ్గుగా  అమ్ముకుంటూ, వీలయితే నల్ల బజారులో కూడా అమ్ముకుంటూ, దొంగల్ని దోపిడీదారుల్ని అసాంఘిక శక్తులను ధర్మకర్తలుగా పెట్టుకుని ఊరేగుతున్నారు కదా, ఊరేగండి కాదన్నది ఎవరు ? భక్తుల హోదాల్ని బట్టి దేవుడిని అమ్ముకుంటుంటే ఎవరన్నా కాదంటున్నారా ? కాదనగాలుగుతున్నారా ? ఒకవేళ ఎవరన్నా కాదు అంటే మీరు ఊరుకుంటారా ?
పగలు రాత్రిళ్ళు పొట్టనిండా పళ్ళు పాలు నింపేసి దేవుడి పేరుతొ ఉపవాసం అని చెప్పుకుంటూ దేవుని దర్శనం కోసం ప్రసాదం కోసం తీర్ధం కోసం  తోపులాడుకుంటూ కొట్టుకుంటూ కిందా మీదా పడిపోతూ రేపు దేవుడు ఉండడేమో అన్నట్టు ఆత్రంతో పడే అగచాట్లు మీకు ఇష్టం అయింది కాబట్టి మీరు ఆ బాటలో నడుస్తున్నారు, నడవండి కాదన్నది ఎవరు ? అది ఇష్టం లేని వారు వేరే మార్గం ఎంచుకుంటే మీకు బాధ ఎందుకు ?
హిందూ మతం పేరుతొ మనంఎప్పుదన్నా నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చామా ? కట్టుకోవడానికి బట్టలు ఇచ్చామా ? వాళ్ళ పిల్లలు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తుంటే మనం ఏనాడన్నా గుక్కెడు పాలు ఇచ్చామా ? నిరుపేద గర్భిణీ మహిళలు కాన్పుకోసం వస్తే వాళ్లకు ఎవరన్నా ఉచితంగా కాన్పులు చేసారా ?
మంకు కావాల్సింది పుణ్యం కదా, మనం ఎన్ని వెధవ వేషాలు వేసినా, వెధవ పనులు చేసినా  అదెలాగో దేవుడిని కోరికలతోను కానుకలతోను నగలతోను  పాలతోను పళ్ళ రసాలతోను ముంచేస్తే ఆయన ఇచ్చేస్తాడు కదా ....! సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.