Sunday, July 5, 2015

శ్రీ కంచె అయిలయ్యను ద్వేషించడం

పత్రికలలో కొన్ని వ్యాసాలు వ్రాసాడని శ్రీ కంచె అయిలయ్యను ద్వేషించడం కంటే అతను హిందూమత వ్యతిరేకి అని అనేకంటే అలా అతను ద్వేషించడానికి హిందూమతము పేరుతొ కొంతమంది / కొన్ని వర్గాలు సృష్టించిన కారణాలు ఏమిటో ఆలోచిస్తే విశ్లేషిస్తే ఇంకా బాగుంటుంది కదా ..!
అలా అతన్ని ద్వేషిస్తే వాళ్ళు గొప్ప మేధావులని వాళ్ళే హిందూమతోద్దారకులని కొంతమంది మాట్లాడటం సహేతుకం కాదు. అలా మాట్లాడేవాళ్ళు హిందూమతములో శ్రీ కంచె అయిలయ్య ఎత్తిచూపే లోపాలు లేవని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలరా ...?
హిందూమతము పేరుతొ కొన్ని వర్గాలు కొన్ని రాజకీయపార్టీలు మాత్రమె మనుగడ సాగించడం నిజం కాదా ?
హిందూమతము పేరుతొ ఆచారాలు పేరుతొ ఒక ప్రధాన అగ్ర కులం అంటరానితనాన్ని అస్పృశ్యతను పెంచి పోషించలేదా ? అలా చెయ్యడము వలన కాదా నేడు వేరే మతాలవైపు పీడితతాడిత వర్గాలు చూస్తున్నది !
అసలు హిందూమతము పేరుతొ చలామణీ అయ్యే చాలామంది స్వాములు పీఠాధిపతులు చేస్తున్న భాగోతాలు ఏమిటి ? వాళ్ళందరూ ఒకే కులము నుండి మాత్రమె ఉద్భవిస్తు హిందూమతములోని నిమ్న వర్గాలను ఇంకా దూరం పెట్టడము నిజం కాదా ? 
ఆ స్వాములు పీఠాధిపతులు మతం పేరుతొ వ్యాపారాలు చేసుకోవడం నిజం కాదా ? 
అసలు ఒక వ్యక్తీ హిందూమత సంప్రదాయాల ప్రకారం సంయాసాశ్రమ ధర్మాలు నియమాలు ప్రకారం సన్యాసం తీసుకుని కాషాయం కట్టిన తరువాత వాళ్లకు అంటూ ముట్టు మడి అంటరానితనం అస్పృశ్యత అంటూ ఉంటాయా ? వాళ్ళు యజ్ఞోపవీతం ధరించవచ్చా ?
అటువంటి వాళ్ళు మతము పేరుతొ విలాసవంతమైన జీవితాలు కొనసాగించడం లేదా ? 
ఇలా నిజాలు మాట్లాడితే సరైన హేతుబద్ధ సమాధానాలు చెప్పలేని ఒక కులములోని కొంతమంది సంస్కారహీనులు అసభ్య భాషా ప్రయోగం చేస్తూ శాపనార్ధాలతో అమాయకులను భయపెడతల్లెదా ?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.