Sunday, July 19, 2015

నేడు కాషాయం ఒక విలాస జీవన విధానం.

మన పంట పొలము బాగుండాలంటే ముందుగా  మన చేలో ఉన్న కలుపు మొక్కల్ని పీకాలి తరువాత పంటకు సారం చేకూర్చాలి, ఇది అందరికీ తెలిసిందే.
అలా కాకుండా మేము  పక్క రైతు పొలములో ఉన్న కలుపు పీకుటాము, తరువాత మా పంట పొలం సంగతి చూసుకుంటాము అంటే అది ఎవరి ఇష్టం వారిది.
ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , మన హిందూ మతములో ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న కలుపు మొక్కలు " బురిడీ బాబాలు, దొంగ స్వాములు, వ్యాపార పీఠాధిపతులు, సంభావనల కోసం అజ్ఞానాన్ని మిడిమిడి జ్ఞాన పండితులు మరియు ముఖ్యంగా నేటి సంఘవ్యతిరేక కిరాయి వ్యాపార మీడియా ". మరి హిందూమతం కోసం పనిచేసే ఆరెస్సెస్ వీహెచ్ పీ ఏమి చేస్తున్నట్టు ? అవి ఎవరి గుప్పెట్లో ఉన్నాయి ? ఆ సంస్థలలో దళితులు నాయకులుగా ఉన్నారా ? లేకపోతె కారణాలు ఏమిటి ? కారకులు ఎవరు ?
మన హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే ప్రతి హిందూమతాభిమాని చెయ్యాల్సింది తోలి యుద్ధం వీళ్ళ మీదే.
కాషాయం కట్టింది సర్వసంగ పరిత్యాగం చేసి సమాజానికి మతానికి అంకితం అవుతానని మాత్రమె కదా ..!
కాషాయం అంటే అగ్ని స్వరూపం. అగ్నిలో ఏమి వేసినా ఎలా ఆహుతి అయిపొతాయో అలాగే కాషాయం కట్టిన మనిషి సర్వసంగ పరిత్యాగం చేసి, వాళ్ళ పూర్వాశ్రమ ఆచారాలు అంటూ ముట్టూ వదిలేసి కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరినీ సమ దృష్టితో చూస్తూ సమాజం కోసం పరితపిస్తూ ఉండాలి.
కాషాయం కట్టిన వారికి  సమాజం అంటే అస్పృశ్యత అంటరానితనము పేద ధనిక భేదం లేకుండా అందరూ అన్ని జీవులు  ఒక్కటే అనే భావం.
 సర్వసంగ పరిత్యాగం అంటే అరిషడ్వర్గాలను అహంకారాన్ని అసూయాద్వేషాల ను యజ్ఞోపవీతాన్ని వదిలేసి  కుల వర్గ వర్ణ అంటూ ముట్టు మడి లాంటివి లేకుండా దీన జనోద్ధారణ, మతోద్ధారణ మరియు తానూ దైవత్వముతొ నిండి సమాజములో  దైవత్వాన్ని అందరిలో పెంపోదించడం కదా ..!
ఇది ఈరోజులలో ఎంతమంది కాషాయ ధారులు పాఠిస్తున్నారు ?
నేడు కాషాయం కట్టిన వాళ్ళు ఎవరు ? వాళ్ళు ఎవరికి దగ్గర ? ఎవరికి దూరంగా ఉంటున్నారు ?
మతం కోసం కాషాయం కట్టిన స్వామీజీలు నేడు ఎంతమంది దళితవాడల కు పేదల గృహాలకు వెళుతున్నారు?
నేడు కాషాయం ఒక పెద్ద వ్యాపారం.
నేడు కాషాయం ఒక పెద్ద రాజకీయం.
నేడు కాషాయం ఒక విలాస జీవన విధానం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.