Thursday, July 2, 2015

"తానా" సంస్థ చరిత్ర

ఉత్తర అమెరికాలో నివశించే మన తెలుగువారిలో ఒక వర్గం వాళ్ళు తానా పేరుతొ అందరు ఒకచోట చేరి, వేడుకల పేరుతొ ఏదొక రకముగా అందరు కలుసుకోవడం సంతోషమే. ఆ సోదర సోదరీమణులు వారికి అందరికి నా శుభాకాంక్షలు.
సరిగ్గా నాలుగైదు మసాల క్రితం నేను అమెరికాలోని తానా సంస్థ మీద నేను ఫెసుబుక్ లో కొన్ని పోస్టులు పెడితే అప్పుడు నాతొ ఒక పెద్దమనిషి తనంతట తనే నాకు మెసేజ్ పెడుతూ మీరు తానా మహాసభలు జరిగే సమయములో అమెరికా రండి మనమందరమూ తానా చేస్తున్న కల్చరల్ ఇమ్పీరియలిజాన్ని ( సాంస్కృతిక దాడి ) నిరశిస్తూ ఆ వేదిక దగ్గర ధర్నా చేద్దాం అని అన్నారు. ఆయన గారు హైదరాబాదు మహానగరములో మానవహక్కుల మీద, స్త్రీ హక్కుల మీదా హేతువాదము మీద రకరకాల విషయాలలో ఎన్నెన్నో గొప్ప గొప్ప ఉపన్యాసాలు అనర్గాలముగా ఇస్తూ ఉంటారు, నేను కూడా ఆయనని గత పాతిక ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను, ఆయన గురించి కొన్ని వింటూ ఉన్నాను. కాబట్టి నేని ఆయనకు తిరుగు మెసేజ్ లో " నేను అమెరికా రాను సార్, కానీ ఆ తానా పేరుతొ కొంతమంది ఇక్కడ హైదరాబాదులో చేస్తున్న చిల్లర పనుల్ని మాత్రం ఇక్కడ నుండే ఎండకదతాను, మీరే అక్కడ ఒకే భావజాలం ఉన్న వ్యక్తుల్ని సమీకరించండి ధర్నా చెయ్యండి బాగుంటుంది అని చెప్పాను. ఉన్నత చదువుల కోసం ఉన్నత జీవితం కోసం ప్రపంచములో ప్రధమ స్థానం పొందిన అమెరికాకి వచ్చి ఇక్కడ పాత వాసనల్ని వదులుకోకుండా నీచంగా ఇక్కడ కూడా రకరకాల పేరులతో సంఘాల్ని పెడుతున్నారు,తానా పేరుతొ ఇక్కడ కులసంఘాల్ని మత సంస్థల్ని పెడుతూ అమెరికాలో కూడా కుళ్ళు రాజకీయాల్ని చేస్తున్నారు, హైదరాబాదు విజయవాడ గుంటూరు లాంటి ప్రదేశాలలో చేసే కులసమావేశాలు లాంటివి మత సమావేశాలు ( దేవాలయాలు నిర్మిస్తూ ) నిర్వహిస్తూ ఆంధ్రావాళ్ళు ఇక్కడ సామాజిక ఔన్నత్యాన్ని మంటగాలుపుతున్నారు అని చెప్పిన పెద్దమనిషి నేడు అదే తానా సంస్థ చరిత్ర వ్రాయడము ( ఆ తానా సంస్థ వాళ్ళు ఈయనతో వ్రాయించుకున్నారు ) అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.
ఇలా ఆయన ఎందుకు వ్రాయాల్సి వచ్చిందో ? దీని వెనక ఉన్న " కారణాలు " ఏమిటో ?
నేడు అలా వండబడిన చరిత్రను ఏ మహానుభావుల చేతిమీడగా ఆవిష్కరిస్తారో చూడాలి ...!
చరిత్ర వ్రాయించుకునే వాళ్లకు ఏమీ లేదని చాలామందికి తెలుసు, కానీ వ్రాసే వాళ్లకు ఉండాలి కదా ....!
సరే ... వ్రాసే వాళ్లకు, వ్రాయించుకునే వాళ్లకు ఉండదనుకోండి రేపు అది చదివి అది అంతా నిజమని నమ్మే పరిస్థితి వస్తే " మహాత్మా గాంధీ కూతురే సోనియా గాంధీ" అని నమ్ముతున్నట్లే రేపు కూడా అమాయకులు ఇటువంటి వక్రీకరణ చరిత్రలు నమ్మే పరిస్థితి రావచ్చు.
నిభద్ధత లేని వ్యక్తులు వ్రాసే చరిత్ర అయినా, రచనలు అయినా, నీతి సూక్తులు అయినా, చేసే పనులు అయినా నిరర్ధకం అని ఒక అబ్రహం లింకన్ అంటారు.. సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.