Saturday, July 25, 2015

నమ్మకపోతే మీ ఖర్మ .

గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ఒక అదృశ్య శక్తి వెనక ఉండి నడిపిస్తోంది. 
ఇప్పుడు ఆ అదృశ్య శక్తిని ఇంకొన్ని దుష్ట స్వార్ధ శక్తులు ప్రభావితం చేస్తున్నాయి, వెరసి శ్రీ చంద్రబాబునాయుడు గారు ఆ దుష్ట స్వార్ధ శక్తుల కబంద హస్తాలలో చిక్కుకొని పోయారు. 
మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు , ఆ చిలుక సప్త సముద్రాల అవతల ఉన్న పెద్ద మర్రిచెట్టు తొర్రలో ఉన్నట్టు, నేడు మాయల ఫకీరు లాంటి ఆ దుష్ట శక్తుల ప్రాణం చిలుక లాంటి లోటస్ పాండ్ పార్టీ సలహాదారుడు గుప్పెట్లో ఉన్నాయి, ఆ చిలుక లాంటి లోటస్ పాండ్ పార్టీ సలహాదారుడు మహామేత ఆత్మ కనుసన్నలలో ఉన్నాడు. ఆ ఆత్మే నేడు దురదృష్టవశాత్తు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పరమాత్మ అయ్యాడు, అతనే తెరాసా అధినేతకు నేడు అత్యంత ఆత్మీయుడు కూడా.
చూసారా .... భూమి గుండ్రంగా తిరిగి ఎక్కడకు చేరుతుందో ...!
నమ్మకపోతే మీ ఖర్మ .

శవానంద లహరి

అప్పట్లో శ్రీ ఆదిశంకరులు మనుషులు సత్యపధములొ నడవడానికి జ్ఞాన మార్గములో నడవడానికి శివానంద లహరి అనే ఒక గొప్ప శ్లోకాలను రచించారు.
నేడు మన కబంద రాజకీయనాయకులు, కపట మీడియా  ప్రజల్ని మభ్యపెట్టడానికి అజ్ఞానములో ముంచి ఉంచడానికి " శవానంద లహరి " అనే గొప్ప శోకాలను రచించారు. దానిని నేడు అన్నే రాజకీయపార్టీలు నాయకులు చాలా చక్కగా వీనుల విందుగా కను సొంపుగా దానిని పాడుతుంటే కిరాయి మీడియా నిస్సుగ్గుగా ప్రసారం చేస్తుంటే శాదిష్టు అనుయాయులు ఆనంద తాన్దవములొ మునిగి తేలుతున్నారు.
మేరా భారత్ మహాన్,
మేరా తెలంగాణా మహాన్,
మేరా ఆంధ్రా మహాన్,
హెచ్చరిక : ఈ " శవానంద లహరి" కి భారత దేశములో కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రాలో పేటెంటు హక్కులు  వైఎస్ కుటుంబానికి, తెలంగాణాలో కెసీఆర్ కుటుంబానికి దాఖలు పరచబడ్డాయి. 

Wednesday, July 22, 2015

Morning Mantras

Ekdantaya Vakratundaya Gauri Tanaya by Shankar Mahadevan in Mumbai Youth...

Ganapati Atharvashirsha - Ancient and Mystical Sanskrit Hymn for Blessin...

Bhaja Govindam

Sri Dakshinamurthy - Sanskrit

HANUMAN SAHASRANAAM {1008 Names}

Shree Ganesh Atharvashirsha (Suresh Wadkar)

Shree Ganesh Atharvashirsha (Suresh Wadkar)

GANESH SAHASRANAAM {1008 Names}

VARAHA KAVACHAM - EXTREMELY POWERFUL

Sri Dakshinamurthy - Sanskrit

SRI NARASIMHA KAVACAM Ultimate protection mantra- Srimathumitha

Extremely Powerful Narayan Kavach श्री नारायण कवच

shyamala dhandakam

shyamala dhandakam

Soundarya Lahari - Adi Shankara - Mambalam Sisters - BHAKTHI

Sri Devi Khadgamala Stotram By Bombay Sisters || Devotional Songs Jukebox

SRI DEVI KHADGAMAALA STHOTHRAM

Sri lalitha Sahasranama Stothram and PhalaSruthi

Vishnu Sahasranamam - M S Subbulakshmi

Sri Suktam

Hanuman Chalisa by MS Subbulakshmi.wmv

Rudram Chamakam

Sri Annapurna Ashtakam Telugu

Rudram Chamakam

Sacred Chants for Stress Relief - Totakashtakam

Dakshinamurthy Stotram

Guru Paduka Stotram

Sri Annapurna Ashtakam Telugu

Sunday, July 19, 2015

నేడు కాషాయం ఒక విలాస జీవన విధానం.

మన పంట పొలము బాగుండాలంటే ముందుగా  మన చేలో ఉన్న కలుపు మొక్కల్ని పీకాలి తరువాత పంటకు సారం చేకూర్చాలి, ఇది అందరికీ తెలిసిందే.
అలా కాకుండా మేము  పక్క రైతు పొలములో ఉన్న కలుపు పీకుటాము, తరువాత మా పంట పొలం సంగతి చూసుకుంటాము అంటే అది ఎవరి ఇష్టం వారిది.
ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , మన హిందూ మతములో ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న కలుపు మొక్కలు " బురిడీ బాబాలు, దొంగ స్వాములు, వ్యాపార పీఠాధిపతులు, సంభావనల కోసం అజ్ఞానాన్ని మిడిమిడి జ్ఞాన పండితులు మరియు ముఖ్యంగా నేటి సంఘవ్యతిరేక కిరాయి వ్యాపార మీడియా ". మరి హిందూమతం కోసం పనిచేసే ఆరెస్సెస్ వీహెచ్ పీ ఏమి చేస్తున్నట్టు ? అవి ఎవరి గుప్పెట్లో ఉన్నాయి ? ఆ సంస్థలలో దళితులు నాయకులుగా ఉన్నారా ? లేకపోతె కారణాలు ఏమిటి ? కారకులు ఎవరు ?
మన హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే ప్రతి హిందూమతాభిమాని చెయ్యాల్సింది తోలి యుద్ధం వీళ్ళ మీదే.
కాషాయం కట్టింది సర్వసంగ పరిత్యాగం చేసి సమాజానికి మతానికి అంకితం అవుతానని మాత్రమె కదా ..!
కాషాయం అంటే అగ్ని స్వరూపం. అగ్నిలో ఏమి వేసినా ఎలా ఆహుతి అయిపొతాయో అలాగే కాషాయం కట్టిన మనిషి సర్వసంగ పరిత్యాగం చేసి, వాళ్ళ పూర్వాశ్రమ ఆచారాలు అంటూ ముట్టూ వదిలేసి కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరినీ సమ దృష్టితో చూస్తూ సమాజం కోసం పరితపిస్తూ ఉండాలి.
కాషాయం కట్టిన వారికి  సమాజం అంటే అస్పృశ్యత అంటరానితనము పేద ధనిక భేదం లేకుండా అందరూ అన్ని జీవులు  ఒక్కటే అనే భావం.
 సర్వసంగ పరిత్యాగం అంటే అరిషడ్వర్గాలను అహంకారాన్ని అసూయాద్వేషాల ను యజ్ఞోపవీతాన్ని వదిలేసి  కుల వర్గ వర్ణ అంటూ ముట్టు మడి లాంటివి లేకుండా దీన జనోద్ధారణ, మతోద్ధారణ మరియు తానూ దైవత్వముతొ నిండి సమాజములో  దైవత్వాన్ని అందరిలో పెంపోదించడం కదా ..!
ఇది ఈరోజులలో ఎంతమంది కాషాయ ధారులు పాఠిస్తున్నారు ?
నేడు కాషాయం కట్టిన వాళ్ళు ఎవరు ? వాళ్ళు ఎవరికి దగ్గర ? ఎవరికి దూరంగా ఉంటున్నారు ?
మతం కోసం కాషాయం కట్టిన స్వామీజీలు నేడు ఎంతమంది దళితవాడల కు పేదల గృహాలకు వెళుతున్నారు?
నేడు కాషాయం ఒక పెద్ద వ్యాపారం.
నేడు కాషాయం ఒక పెద్ద రాజకీయం.
నేడు కాషాయం ఒక విలాస జీవన విధానం.

అమాయక ప్రజల నమ్మకాల మీద జరుగుతున్న దోపిడీ

అమాయక ప్రజల నమ్మకాల మీద జరుగుతున్న దోపిడీ. ఎవరి నమ్మకాలు ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి అని కాదని ఎవ్వరు అడ్డు చెప్పడములేదే..! అలాగని వాటి చాటున నిజాల్ని కప్పి పెట్టాలనుకోవడం మూర్ఖత్వమే కదా ..! ఆ నిజాలు ఎవరికి తెలిసినవి వాళ్ళు చెబుతారు, ఇష్టం ఉన్నవాళ్ళు వింటారు, లేని వాళ్ళు వినరు, అందులో గొడవలు పడాల్సిన అవసరము లేదు.
సకానాతన వైదిక  శాస్త్రం ప్రకారం  నూటికి నూరు శాతం నేటి పుష్కర స్నాన వేలంవెర్రి తిరునాళ్ళు మాత్రమె, ఇది మూర్ఖత్వమే,
వైదిక సంప్రదాయం ప్రకారం పుష్కర స్నానాలు కేవలం సన్యాసులకు,ఋషులకు,  పితురులకు పిండ తర్పణాల కు మాత్రమె పరిమితం.
నేడు టీవీలలో నిత్యమూ ప్రవచనాలు చెప్పే పండితులు పీఠాధిపతులు ఎవరైనా సరే వేదాలలో గీతలో రామాయణ భారతాలలో ( పురాణాలు తప్పించి, పురాణాలు అన్నీ నేటి  నవలలు లాంటి కాల్పనిక కధలే )  ఎక్కడైనా సరే ఈ పుష్కర స్నానాలు మహిళలకు పిల్లలకు తండ్రి బ్రతికి ఉన్న కుమారులకు అని చెప్పబడి ఉంటె అది వాళ్ళు రుజువు చేస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధమే.
అసలు మహిళలకు కొన్ని సందర్భాలలో మాత్రమె నదీ సాగర స్నానానికి అర్హులు,
భర్త బ్రతికి ఉండగా ఏ మహిళా వైదిక సనాతన సంప్రదాయం ప్రకారము ఎత్తి పరిస్థితుల్లోను ఎక్కడా కూడా శిరోముండనం చేయించుకోకూడదు, అది తిరుమల అయినా కూడా.
కానీ నేడు ఈ పండితులు ఒక్కడు కూడా, ఈ పీఠాధిపతులలొ ఒక్కడు కూడా అలా మహిళలు శిరోముండనం చేయించుకోవద్దు అని చెబుతున్నాడా ? టీటీడీ వాళ్లకు ఆ వెంట్రుకల వ్యాపారం కావాలి, ఆ వెంత్రుల వ్యాపారములో అంతర్జాతీయ స్థాయి వ్యాపారులు ఉంటారు , కోట్లాది రూపాయిలు చేతులు మారుతుంటాయి. మరి తిరుమలలోను ఇంకా ఇతర ప్రదేశాలలోనూ భారతీయ హిందూ ముత్తైదు మహిళలు శిరోముండనం చేయించుకోవడం దరిద్రం అని, అలాంటి మహిళలను వాళ్ళ మోఖాలను  పురుషుడు / భర్త చూడకూడదు అని చెబుతున్నారా ?
బహిష్టు ఉన్న మహిళలు, మైల ఉన్న మహిళలు,కుటుంబాలు అస్సలు నదిలోకి సముద్రములోకి కాలు పెట్టకూడదు అని కదా మన శాస్త్రాలు చెప్పేది, నేడు పుష్కర స్నానాలు ఆచరిస్తున్న వాళ్ళలో ఎంతమంది ఇలా ఉండి ఉంటారు ? చెప్పగలరా ?
దీన్ని టీవీలు స్వామీజీలు పీఠాధిపతులు ప్రవచనకారులు పండితులు కలిసి అమాయక ప్రజల నమ్మకం మీద చేస్తున్న కోట్లాది  రూపాయిల ఆధ్యాత్మిక వ్యాపారము కాదా ? దీని వలన ఎవరికి చెడు ? ఎవరికి మంచి ?
ఈ విషయాల మీద నేటి సనాతన వైదిక పండితులు ఘనాపాఠీలు స్వామీజీలు పీఠాధిపతులు  శాస్త్ర ప్రకారం చర్చలకు  మీరు నేడు వాడుకున్న వాడుకుంటున్న చానెళ్ళలో ప్రత్యెక లైవ్ కార్యక్రమములో సిద్ధపడితే మేము సిద్ధమే.
మేము మా శాస్త్ర ప్రమాణాలు ఓడిపోతే / వీగిపోతే మీరు వేసే ఎటువంటి శిక్షకు అయినా మేము అర్హులమే, అలాగే మేము ఒక కోటి రూపాయిలు మీకు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే, ఒకవేళ మీరు ఓడిపోతే మీరు ( స్వామీజీలు పీఠాధిపతులు పండితులు ప్రవచానకారులు మరియు చానెళ్ళ అధిపతులు ) తెలుగు  సమాజానికి క్షమార్పణ చెబితే చాలు. ఆ కిరాయి చానెళ్లకు ఆ ప్రసారాల కిరాయి కూడా మేమే భరిస్తాం .
ఎవరైనా సరే,( ఇందులో ముఖ్యంగా శ్రీ చాగంతో కోటేశ్వరరావు గారు, శ్రీ పరిపూర్నానంద గారు, శ్రీ స్వరూపానంద గారు, శ్రీ చిన జియ్యరు గారు మరియు ఇతర ప్రతిరోజూ సనాతన ధర్మమూ మతము పేరుతొ టీవీలలో సొల్లు కక్కే  చిల్లర ప్రవచానకారులు అందరు పాల్గోనాల్సిందే ) చర్చకు సిద్ధపడి ముందుకు వస్తే సంప్రదించండి. ఈ చర్చలో మీరు  గెలిస్తే  మీకే మంచిది, మన సనాతన ధర్మానికే మంచిది, మన హిందూ మతానికే మంచిది.
ఇట్లు
సనాతన ధర్మాన్ని, వైదిక సంప్రదాయాన్ని పాటించే హిందూ బంధువులకు అందరికి నమస్సుమాంజలితో,
మీ సువేరా 

Friday, July 17, 2015

వీళ్ళు మతానికే కాదు భూమికి కూడా బరువే.

రాజమండ్రి పుష్కర దుర్ఘటనలో స్వార్ధపూరిత ప్రభుత్వ దురాశ, కిరాయి మీడియా పాత్రతో పాటు హిందూమత బ్రతుకుదెరువు పండితులు మరియు వ్యాపార దృక్పద దొంగ పీఠాధిపతుల పాత్ర కూడా ఉంది.
ఎడిసేవాళ్ళకు, ఏడిపించే వాళ్లకు, ఏడిసెవాళ్ళను చూసి ఆనందించే వాళ్లకు ఇప్పుడు సమయం వచ్చింది, ఇక మీ ఇష్టం .....!
కులం మీద పది ఎడిసే వాళ్ళు కొంతమంది, మతం మీద పడి ఎడిసే వాళ్ళు కొంతమంది.
ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకునేది రాజకీయనాయకులే కాదు ఇప్పుడు దొంగ పీఠాధిపతులు కూడా తయారయ్యారు.
పుష్కర స్నానాల గురించి అర్ధసత్యాలతో ఇన్ని రోజులు తార్పుడుగాళ్ళ కిరాయి టీవీ చానెళ్ళలో ఇష్టానికి సోల్లు కక్కిన దొంగ పీఠాధిపతులు పండితులు ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇప్పుడు క్రొత్త పల్లవి అందుకున్నారు. వీళ్ళు మతానికే కాదు భూమికి కూడా బరువే.
ఇన్నాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకున్న జాతీయ కీరస్తానీ కాంగ్రెస్ బానిసగాళ్ళు మరియు అదే తానుముక్క అయిన ఆంధ్రా కీరస్తానీ కాంగ్రెస్ వయ్యేస్సార్సీపీ నాయకుడు మరియు విశాఖ బ్లాక్ మెయిల్ పీఠాధిపతి కూడా రాబందులు లాగా అక్కడ వాలిపోయారు.
ఇన్నాళ్ళు అక్కడ ఉన్న తప్పులు ఏనాడూ ఎత్తి చూపని తెలుగు తార్పుడు కిరాయి అవకాశవాద మీడియా కూడా గొట్టాలతో తయారు.
అక్కడ పనులలో జరిగిన అవినీతి అలసత్వం అక్రమాలు గోదావరి వరద లాగా కోకొల్లలు..... సువేరా

తిలాపాపం తలా పిడికెడు.

గేదోడు గేదకి ఏడిస్తే, తోలోడు తోలుకి ఎడ్చాడని ఒక సామెత, ఆ సామెత నేడు రాజమండ్రి పుష్కర దుర్ఘటనలో నిజమని నిరూపించబడింది.
ప్రభుత్వం తన పరాజయాలను తప్పిదాలను కప్పి పెట్టుకోవడానికి 1500 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ పుష్కరాల అతి ఆడంబర ప్రచారముతో లబ్దిపొందాలని చూసింది, తెలుగు వార్తా చానెళ్ళు పత్రికలూ ప్రభుత్వం నుండి ప్రకటనలు ఆశించి కావలసిన దానికంటే ఎక్కువ ప్రచారం కల్పించాయి.ప్రజల్ని జాగారూకులు చెయ్యాల్సిన ఈ రెండు వ్యవస్థలు కూడా ప్రజల్ని ఇంకా తప్పుదోవ పట్టించి మూదులుగా తయారు చెయ్యడములో విజయం పొందినాయి.
ప్రభుత్వం అక్కడ కల్పింహ్చే ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక అదనపు డీజీపీ స్థాయి అధికారిని శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి, ఒక ప్రతేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని అక్కడ ఇతర అన్ని ఎర్పాతులు పర్యవేక్షించడానికి నియమించి, ఒక్కొక్క ప్రధాన ఘాట్ దగ్గర ఒక ఆర్డీవో ని , ఒక అదనపు ఎస్పీ ని నియమించి వారికి తగిన సిబ్బందిని ఇచ్చి ఉంటె ఇటువంటు దుర్ఘటన జరగడానికి అవకాశం ఉండేది కాదేమో.
ఇప్పుడు తక్షణం ప్రభుత్వం ఉపెక్షించకున్దా మీనా మేషాలు లెక్కించకుండా బాధ్యులైన అధికారుల మీద మంత్రుల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద హత్య కేసులు నమోదు చెయ్యాలి.
ప్రతి తార్పుడు గాడు, బ్రోకరు గాడూ నేడు చానెళ్ళు పెట్టి వాళ్ళ చీకటి వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయ నాయకులను అధికారులను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళను లొంగ దీసుకుని సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్నారు. ఈ మీడియా గుప్పెట్లో న్యామూర్తులు కూడా చిక్కుకుంటున్నారు, ఇదే మీడియా నేడు మతాన్ని మత విశ్వాసాన్ని కూడా వాళ్ళ వ్యాపార వస్తువుగా మార్చుకుని కొంతమంది వెధవల్ని మహా పండితులుగా స్వామీజీలుగా పీఠాధిపతులుగా చూపించి / తయారుచేసి వాళ్ళ ద్వారా అనైతిక వ్యాపారాలు చేసుకుంటున్నారు. సమాజాన్ని దోచుకుని దేశాన్ని కొల్లగోట్టుకుని, పాపాలు చేసి కొంపలు ఆర్పిన రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, స్మగ్లర్లు, చానెళ్ళ అధినేతలు, దొంగ పీఠాధిపతులు, నికృష్ట పండితులు, వ్యభిచారులు, జర్నలిష్టులు, దొంగసారా ఎర్రచందనం గంజాయి వ్యాపారస్తులు, డాక్టర్లు, లాయర్లు అందరు గోదావరిలో మునిగేసి వాళ్ళు చేసిన పాపాలు వదిలించుకోవడానికి రావాలను కోవడం మన హిందూమత దరిద్రం.
ప్రతి నిత్యమూ తెలుగు కిరాయి చానెళ్ళు పెట్టగానే పైసాకి కూడా పనికిరాని దొంగ ముండా కొడుకులు కాషాయం కట్టి స్వాములుగా పీఠాధిపతులుగా మారి పెద్ద అంచు పట్టు పంచెలు లాల్చీలు కట్టుకుని అడ్డ బొట్లు నిలువు బొట్లు పెట్టుకుని కూర్చుని ఆ తార్పుడు చానెళ్ళ ద్వారా అమాయక ప్రజలలో అజ్ఞానాన్ని నింపుతూ ప్రజల నమ్మకముతో వ్యాపారాలు చేసుకుంటూ హిందూమతము అంటే జుగుప్స కలిగే విధముగా మార్చేసారు. నేడు అదే చానెళ్ళు 40 అమాయక నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. అసలు పుష్కరాలే వేద ప్రమాణాలు కావు, అటువంటిది ఒక వర్గము మాత్రమె వాళ్ళ వర్గ ప్రయోజనాల కోసం పుష్కర స్నానాలు చేసే ముందు ఒకడు నదిలోకి మట్టి విసర మంటాడు , ఒకడు బంగారం విసర మంటాడు, ఒకడు పట్టు బట్టలు విసరమంటాడు, ఒకడు ఇంకా ఏదేదో విసరమంటాడు, ఒకడు ఇదే రోజు స్నానం చేయ్యాలంటాడు, ఇంకొకడు అదే రోజు ఇంకో విధంగా చేస్తే మనకు కనిపించని ముక్కోటి దేవతలు వరాలు ఇస్తారు అని అంటాడు. ఒక్క చానెల్ కూడా ఇవన్నీ తప్పని ఇలా చేస్తే నది కలుషితం అవుతుందని చెప్పడానికి సాహసం చెయ్యలేదు.
అసలు నిన్న రాజమండ్రిలో జరిగిన 40 మంది హత్యాకాండకు బాధ్యులుగా తెలుగు చానెళ్ళలో రోజు కనిపింస్తు వేద శాస్త్ర ప్రామాణికం కాని పిచ్చి కూతలు కూసే పండితులను పీఠాధిపతులను అవి ప్రసారం చేసే చానెళ్ళ యాజమాన్యాలను గుర్తించి వాళ్ళ మీద హత్య కేసులు నమోదు చెయ్యాలి.
సందట్లో సడేమియా లాగా శవాల మీద పేలాలు ఏరుకోవడానికి దౌర్భాగ్య కాంగ్రెస్ బానిసలు నోళ్ళు లేపుతున్నారు, వాళ్లకు తోడూ నరహంతక ప్రతిపక్ష నాయకుడు తయారయ్యాడు, వీళ్ళకు తోడు విశాఖపట్నానికి చెందినా సినిమా టిక్కట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని బ్రతికి నేడు కాషాయం కట్టి నేను ఒక పీఠాధిపతిని అని చెప్పుకుంటూ మరొక అవకాశవాది పైరవీకారుడు, ఒక కుల వ్యతిరేకి తయారయ్యాడు. 
ఈ దుర్ఘటనలో తిలాపాపం తలా పిడికెడు.

జ్ఞాన గంగలో కదా ........!

ఇక్కడ ప్రాణాలు తీసి, కాపరాలు కూల్చి, మోసాలు చేసి చేసిన పాపాలు గోచీలో పెట్టుకుని అక్కడ గంగా గోదావరీ కృష్ణా తుంగభద్రా యమునా సరస్వతీ నదులలో మునిగితే ఆ చేసిన పాపాలు పోతాయా ?
రోజూ ఆ నదులలో పందులు పశువులు కూడా పోర్లుతాయి మరి ..!
మనం మునగాల్సింది, తడిసి ముద్దవ్వాల్సింది జ్ఞాన గంగలో కదా ........! సువేరా

ఈ రెండు తరగతుల వాళ్ళు నేటి సమాజానికి చెడుపే..

కనీసం శ్రీసూక్తం, పురుషసూక్తం, రుద్రం నమకం చమకం స్వరదోషాలు లేకుండా పఠించలెని వాళ్ళు నిత్య త్రిసంధ్యలలో గాయత్రీ చెయ్యని వాళ్ళు, కనీస ప్రమాణాలు పాఠించని వాళ్ళు, యగ్నోపవీతముతో మధ్య మాంసాలు, గుట్కా సిగరెట్లు సేవించే వాళ్ళు నేడు హిందూమతం పేరుతొ అమాయక ప్రజల్ని పండితులమని మోసం చెయ్యడం, శాపనార్ధాలు పెడుతూ ప్రజల్ని భయపెట్టి బ్రతకే వాళ్ళు,
కనీసం రిపోర్టింగు ఎలా చెయ్యాలో, ఎలా వ్రాయాలో, ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళు, ఏది వార్తో, ఏది కాదో తెలియని వాళ్ళు జర్నలిజం అంటే కనీస అవగాహన లేకుండా సరైన చదువు సంధ్యలు లేకుండా మెడలలో మూర్చరోగి వేసుకున్నట్టు ఒక కార్డు వేసుకుని ప్రెస్ అని జర్నలిష్టునని సమాజాన్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తూ బ్రతకే వాళ్ళు,
ఈ రెండు తరగతుల వాళ్ళు నేటి సమాజానికి చెడుపే...... సువేరా

మీరు ఒప్పుకుంటే అది మీ ఖర్మ .

నీవెవరో చెప్పాలంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు,
నీ రాజ్యం / దేశం / రాష్ట్రం ఎలాంటిదో చెప్పాలంటే మీ రాజు : నాయకుడు ఎవరో చెప్పు,
మీ సమాజం ఎలాంటిదో చెప్పాలంటే మీ సమాజములో విద్యావంతులు మేధావులు ఎలాంటి వారో ఎవరో చూపించు.
మేము చాలా గొప్ప వాళ్లము, బాగా తెలివిగల వాళ్లము, మేదావులము, ప్రపంచానికి మార్గదర్శకులము అని వ్హేప్పుకుని విర్రవీగే నేటి ఆంధ్రప్రదేశ్ విద్యావంతులు మేధావులు నాయకులు నేడు ఆంద్ర ప్రజలకు సమాధానం చెప్పుకుని తీరాలి. ఒక స్వయం ప్రకటిత మేధావిని కిమ్మనకుండా మోస్తున్న హైదరాబాదు కిరాయి మీడియా సంస్థలు నిశ్శబ్దముహా ప్రమోట్ చేస్తున్న ఒక విష పురుగు, ఒక మానసిక రోగి, హైదరాబాదులో వెలమ కౌగిలిలో సేద తీరుతూ హైదరాబాదులోని అవకాశవాద మీడియాలో పాతుకుపోయి డబ్బులకు మనుషులను ప్రమోట్ చేసే మీడియాలోని కొన్ని వికృత శక్తుల ద్వారా చూపించబడుతున్న ఒక కిరాయి సైకో.
నేటి ఆంద్రప్రదేశ్ విద్యావంతులను నాయకులను చూస్తుంటే జుగుప్స జాలి కలుగుతోంది.
పాపం ..... వాళ్ళ స్థాయి నేడు చెప్పాలంటే, ఆంధ్రా మేధావుల ఫోరం అనే స్వయంప్రకటిత సంఘం అధ్యక్షుడిని చూపించవచ్చు. అతను ఎవరి చెప్పు చేతలలో ఉన్నాడు ? అతని వెనక ఉన్నది ఎవరు ? అతనికి ఆర్ధిక సహకారం చేస్తున్నది ఎవరు ? ఆ సంఘములో సభ్యులు ఎవరు ? ఆ సంఘం చిరునామా ఎక్కడ ? ఆ సంఘం ఎక్కడ నమోదు చేసారు ? ఈ మేధావి గత దశాబ్దముగా హైదరాబాదులో ఎవరి కనుసన్నలలో పని చేసాడు ? ఆతను ఏమి మాట్లాడుచున్నాడో మీకు తెలుసా ? అతను గతములో ఏమి మాట్లాడాడు, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడు ?
ఇటువంటి వ్యక్తులను మీ మేధావులుగా మీరు ఒప్పుకుంటే అది మీ ఖర్మ .

తప్పుని తప్పు అందాం ... ఒప్పుని ఒప్పు అందాం —

జరిగిన తప్పులను ఒప్పుకోవడానికి సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపం చెందడానికి కూడా వ్యక్తిత్వం ఉండాలి, హుందాతనం ఉండాలి, మానవత్వం ఉండాలి, గుండె నిండా ధైర్యం ఉండాలి.
అవి అన్నీ అతనిలో కనీసం ఉన్నాయి కాబట్టే రాజమండ్రి పుష్కర దుర్ఘటన బాదితల దగ్గరకు, మృతుల కుటుంబ సభ్యుల దగ్గరకు ఒక ముఖ్యమంత్రిగా వెళ్లి క్షమార్పణలు అడగగలిగాడు. అభినందనీయుడు.
తప్పుని తప్పు అందాం ... ఒప్పుని ఒప్పు అందాం
 — 

పాదాభివందనాలు చేస్తా. ....

భారతదేశములో ఏ రాజకీయపార్టీకి చెందని అందరు కాంగ్రెస్ పార్టీనే,
అలాగే, భారతదేశములో ఏ మతానికి చెందని వారు, హేతువాదులు, నాస్తికులు, మతం అంటే ఏమాత్రం అర్ధం తెలియని వాళ్ళు అందరు హిందువులే అని చాలామంది భావన అన్నమాట ....!
అసలు మతం అంటే ఏమిటి ?
మతం ఎవరికి కావాలి ?
మనిషికి జీవితంలో మతం ఎప్పుడు మొదలవుతుంది ? 
మతం పరమార్ధం ఏమిటి ?
వీటికి సరైన సమాధానాలు చెప్పగలిగితే వారికి నేను పాదాభివందనాలు చేస్తా. .... సువేరా

ఉలుకెందుకు ?

ఆకలితో అలమటించే వాడికి, రెక్కాడితేగాని డొక్కాడని నిర్భాగ్యులకు మతంతో పనేమిటి ?
కూడు గూడు గుడ్డ లేని అభాగ్యులకు మతంతో పనేమిటి ?
వాళ్ళు గత జన్మలో చేసిన పాపాలకు వాళ్ళు ఈ జన్మలో పేదరికము దరిద్రము అనుభవిస్తున్నారు అని చెప్పే వాళ్లకు ఆ నిర్భాగ్యులు / దరిద్రులు వేరే మతము నీడలోకి వెళుతుంటే ఉలుకెందుకు ?
మతం వేర్రితో ఊగిపోయే వాళ్లకు వాళ్ళ దేవుడు వాళ్లకి ఉన్నాడు కదా , పోయి ఆ దేవుని పాలతోను పళ్ళ రసాలతోను ముంచేసి ఆ పాలను పళ్ళ రసాలని మురుగు కాలవల్లో ప్రవహిస్తుంటే అది చూసుకుంటూ మీ పాపం కొట్టుకుపోతోంది అని ఊహించుకుంటూ ఆనందించండి, కాదన్నది ఎవరు ?
దేవుడికి దేవుని పూజలకు సేవలకు దర్శనానికి వెల కట్టి వాటిని నడి బజారులో  నిస్సిగ్గుగా  అమ్ముకుంటూ, వీలయితే నల్ల బజారులో కూడా అమ్ముకుంటూ, దొంగల్ని దోపిడీదారుల్ని అసాంఘిక శక్తులను ధర్మకర్తలుగా పెట్టుకుని ఊరేగుతున్నారు కదా, ఊరేగండి కాదన్నది ఎవరు ? భక్తుల హోదాల్ని బట్టి దేవుడిని అమ్ముకుంటుంటే ఎవరన్నా కాదంటున్నారా ? కాదనగాలుగుతున్నారా ? ఒకవేళ ఎవరన్నా కాదు అంటే మీరు ఊరుకుంటారా ?
పగలు రాత్రిళ్ళు పొట్టనిండా పళ్ళు పాలు నింపేసి దేవుడి పేరుతొ ఉపవాసం అని చెప్పుకుంటూ దేవుని దర్శనం కోసం ప్రసాదం కోసం తీర్ధం కోసం  తోపులాడుకుంటూ కొట్టుకుంటూ కిందా మీదా పడిపోతూ రేపు దేవుడు ఉండడేమో అన్నట్టు ఆత్రంతో పడే అగచాట్లు మీకు ఇష్టం అయింది కాబట్టి మీరు ఆ బాటలో నడుస్తున్నారు, నడవండి కాదన్నది ఎవరు ? అది ఇష్టం లేని వారు వేరే మార్గం ఎంచుకుంటే మీకు బాధ ఎందుకు ?
హిందూ మతం పేరుతొ మనంఎప్పుదన్నా నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇచ్చామా ? కట్టుకోవడానికి బట్టలు ఇచ్చామా ? వాళ్ళ పిల్లలు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తుంటే మనం ఏనాడన్నా గుక్కెడు పాలు ఇచ్చామా ? నిరుపేద గర్భిణీ మహిళలు కాన్పుకోసం వస్తే వాళ్లకు ఎవరన్నా ఉచితంగా కాన్పులు చేసారా ?
మంకు కావాల్సింది పుణ్యం కదా, మనం ఎన్ని వెధవ వేషాలు వేసినా, వెధవ పనులు చేసినా  అదెలాగో దేవుడిని కోరికలతోను కానుకలతోను నగలతోను  పాలతోను పళ్ళ రసాలతోను ముంచేస్తే ఆయన ఇచ్చేస్తాడు కదా ....! సువేరా

Thursday, July 16, 2015

నేను హిందువుని

నేను హిందువుని అని చెప్పుకోవడానికి అందరు గర్వపడతారు గానీ , ఆ గర్వం మనకు ఎందుకో కూడా తెలియాలి కదా ..?
హిందువుని అని చెప్పుకుని తిరిగేవారు విర్రవీగే వారు ఆ హిందూమతము లోని లోటుపాట్లు కూడా తెలుసుకోవాలి కదా ...?
హిందూమతములో ఇప్పుడు చెప్పుకునే కుల వ్యవస్థ ఎప్పుడు మొదలయ్యింది ? దానికి బాధ్యులు ఎవరు ? మన వేదాలలో గీతలో కుల వ్యవస్థ గురించి ఎక్కడైనా చెప్పారా ? ఇప్పుడు కులాల కుంపట్లో హిందూ / సనాతన జాతి నాశనం అయిపోతుంటే ఈ విర్రవీగే వాళ్లకు చీమైనా కుట్టినట్టు ఉందా ?
మనకు గీతలో చెప్పింది వర్ణ వ్యవస్థ కదా ...! చాతుర్ వర్ణం మయా సృష్టం అని కదా గీతా చార్యుడు మనకు చెప్పింది ., అసలు వర్ణం అంటే ఏమిటి ? వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చింది ఎవరు ? కుల వ్యవస్థని పెంచి పోషించి నూటికి 90 మందిని అంటరాని వారిగా సమాజానికి దూరంగా పెట్టింది ఎవరు ? మనకు ఆదిశంకరుల వారు అంటరానితనాన్ని ఉద్భోదించారా ? ఆయన చండాలుని కాళ్ళు పాట్టుకున్నారని మనము చదువుతామే, మరి ఆ చండాలుర కులస్థులను గ్రామాలకు దూరంగా పెట్టి వాళ్ళను సంఘ బహిష్క్రుతులుగా చేసింది ఎవరు ? కారకులు ఎవరు ? దళితుల్ని వెనుకబడిన వర్గాలను దేవాలయాలలోకి రాకుండా ఆపింది ఎవరు ? శూద్రులను కేవలం ఉత్పాదక శక్తులుగా మాత్రమె గుర్తించి ఆ ఉత్పాదన కోసమే వాళ్ళను గౌరవించి వాళ్ళను మాత్రం దేవాలయాలలో ధ్వజ స్థంభం దగ్గరకు మాత్రమె రానిచ్చింది ఎవరు ? అదే దళితులను దేవాలయాల ప్రాకారాల బయటే ఉంచింది ఎవరు ? మన వేదాలా ? మన శాస్త్రాలా ? మన సనాతన ధర్మమా ? మన భగవద్గీతా ? మన రామాయణ భారతాలా ? భాగవత పురాణాలా ?
అనాదిగా మన హిందూ పీఠాధిపతులు స్వాములు పండితులు ఎవరు ? వాళ్ళు చేసింది ఏమిటి ? ఒక్క కంచి పరమాచార్య తప్పించి మిగతా వాళ్ళు ఎవరన్నా దళితుల్ని నిమ్న వర్గాలను మనుషులుగా చూసారా ? ఎవరన్నా మన పేద సమాజానికి పనికి వచ్చే విధంగా ఉచిత ఆసుపత్రులు పాఠశాలలు నిర్మించారా ? వేల లక్షల కోట్ల రూపాయిలు ఈ పీఠాధిపతులు స్వామీజీలు ఎక్కడ దాచారు ? ఎవరి దగ్గర దాస్తున్నారు ? మన మతం గురించి అనీ వదిలేసి కాషాయం కట్టిన వాళ్లకు బంగారు సింహాసనాలు బంగారు మంచాలు కంచాలు బంగారు పాదుకలు గండపెండేరాలు అవసరమా ? బెంజి కార్లు ప్రత్యెక విమానాలు అవసరమా ? వీళ్ళందరూ మతోద్దారకులం అని చెప్పుకుంటూ విలాసవంతమైన జీవితాలు అనుభవించడం నిజం కాదా ? వీళ్ళందరూ ఏ వర్గానికి చెందినా వారు ? వీళ్ళను, వీళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాలను శ్రీ కంచె అయిలయ్య కాకపొతే ఇంకొకరు ప్రశ్నిస్తారు, ప్రశ్నించ కూడదా ? ప్రశ్నించిన వాళ్ళు అందరు మత ద్రోహులేనా ? మనం వాళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక, మన మతములో ఉన్న కుళ్ళును ప్రశ్నించే వాళ్ళను చూసి ఓర్వలేక వాళ్ళ అనుమానాలు నివృత్తి చెయ్యలేక వాళ్లకు శాపనార్ధాలు పెడుతూ ఎన్నాళ్ళు మనం మన అంతరాత్మకు ముసుగులు వేసుకుని బ్రతుకుదాం ? అమాయకుల్ని మతం పేరుతొ పాపం పుణ్యం స్వర్గం నరకం అనే పేరుతొ భయపెట్టి ఎన్నాళ్ళు ఇలా దొంగ బ్రతుకులు వెళ్ళ దీద్దాం ? దొంగ పూజలతో ఎన్నాళ్ళు దోపిడీకి గురవుదాం ? అభిషేకాలు సేవలు పేరుతొ నిత్యమూ ఎన్ని లీటర్ల పాలు పండ్ల రసాలు మురికి కాలువల పాలు చేద్దాం ? వాటిని నిరుపేదలకు అనాధ పిల్లలకు వయో వృద్ధులకు ఇస్తే శక్తివంతమైన దేశం అవుతుంది కదా ? ఏ దేవుడు ఎక్కడ చెప్పాడు ఇలా అభిషేకాలు చేసి పాలు పళ్ళు మురికి గుంతల పాలు చెయ్యమని ? మన వేదాలలో గీతలో చెప్పింది హవిస్సు ( హోమం ) మాత్రమె కదా ..? అమాయకులకు జ్ఞాన బోధ చెయ్యాల్సిన గురువులు పండితులు స్వాములు పీఠాధిపతులు అజ్ఞానాన్ని నూరి పోస్తూ ఇంకా ఎన్నాళ్ళు సమాజాన్ని ఇలా అజ్ఞానములో ఉంచుతారు ? ఇలా చెయ్యడం మన సనాతన ధర్మానికి మంచిదా ? మనం ఇలా చెయ్యడం వలెనే కదా అన్య మతాలూ రాచపుండు లాగా మన వ్యవస్థని మింగేస్తునాయి కదా ? అది వాళ్ళ తప్పా లేక మన తప్పా ?
శాంతంగా ఆలోచించండి, మనలోని తప్పిదాలను సరిదిద్దుకుందాం, మనలో మన వాళ్ళను అందరినీ కలుపుకోవడానికి ముందుకు కదులుదాం ..................! సువేరా

Tuesday, July 7, 2015

కీశే ఎన్టీఆర్ కి అవమానము కాదు ఇది ?

ఈ అమెరికా వాళ్ళు సామాన్యులు కాదురయ్యా ...!
లాస్ ఏంజిల్స్ లో కీశే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అంటే నేను అబ్బో అని ఊహించా , అక్కడ ఏదో ఒక మంచి కూడలిలోనో మంచి జనసంచారం ఉండే ప్రదేశమో అనుకున్నా ...!!
లాస్ ఏంజిల్స్ లో కీశే ఎన్టీఆర్ విగ్రహం పెడతాన్నారని ప్రపంచం అంతా దప్పులు కొట్టి మరీ చెప్పి , ఇక్కడ నుండి ఘనాపాటీలను అందరినీ అక్కడకు విగ్రాహావిష్కరణకు తీసుకెళ్ళి తీరా ఎవరో ఇంటి ఆవరణలోని గార్డెన్ లోనో లేక పెరటి దొడ్లోనో ఆ విగ్రహం పెట్టి ఆ విగ్రాహావిష్కరణకు వెళ్ళిన వాళ్ళను ఇక్కడ మనల్ని చాలా చక్కగా బోల్తా కొట్టించారుగా ...!
కాకపొతే అందరికీ బాగా ఘనంగానే ముట్టజెప్పి ఉంటారు ఆ ఇంటి యజమాని.
కీశే ఎన్టీఆర్ కి అవమానము కాదు ఇది ?


Sunday, July 5, 2015

మతము

ప్రపంచాన్ని / సమాజాన్ని అతి సునాయాసముగా మతము అనే పక్క పదముతో మోసము చెయ్యవచ్చు, ఇది చారిత్రిక రుజువు.
ఇప్పుడు నేను పలానా మతము అని చెప్పుకునే వాళ్లకు ఎవ్వరికీ కూడా అసలు మతము అంటే ఏమిటి ? అనే ప్రశ్నకు సరైన సమాధానం తెలియదు చెప్పలేరు.

శ్రీ కంచె అయిలయ్యను ద్వేషించడం

పత్రికలలో కొన్ని వ్యాసాలు వ్రాసాడని శ్రీ కంచె అయిలయ్యను ద్వేషించడం కంటే అతను హిందూమత వ్యతిరేకి అని అనేకంటే అలా అతను ద్వేషించడానికి హిందూమతము పేరుతొ కొంతమంది / కొన్ని వర్గాలు సృష్టించిన కారణాలు ఏమిటో ఆలోచిస్తే విశ్లేషిస్తే ఇంకా బాగుంటుంది కదా ..!
అలా అతన్ని ద్వేషిస్తే వాళ్ళు గొప్ప మేధావులని వాళ్ళే హిందూమతోద్దారకులని కొంతమంది మాట్లాడటం సహేతుకం కాదు. అలా మాట్లాడేవాళ్ళు హిందూమతములో శ్రీ కంచె అయిలయ్య ఎత్తిచూపే లోపాలు లేవని గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలరా ...?
హిందూమతము పేరుతొ కొన్ని వర్గాలు కొన్ని రాజకీయపార్టీలు మాత్రమె మనుగడ సాగించడం నిజం కాదా ?
హిందూమతము పేరుతొ ఆచారాలు పేరుతొ ఒక ప్రధాన అగ్ర కులం అంటరానితనాన్ని అస్పృశ్యతను పెంచి పోషించలేదా ? అలా చెయ్యడము వలన కాదా నేడు వేరే మతాలవైపు పీడితతాడిత వర్గాలు చూస్తున్నది !
అసలు హిందూమతము పేరుతొ చలామణీ అయ్యే చాలామంది స్వాములు పీఠాధిపతులు చేస్తున్న భాగోతాలు ఏమిటి ? వాళ్ళందరూ ఒకే కులము నుండి మాత్రమె ఉద్భవిస్తు హిందూమతములోని నిమ్న వర్గాలను ఇంకా దూరం పెట్టడము నిజం కాదా ? 
ఆ స్వాములు పీఠాధిపతులు మతం పేరుతొ వ్యాపారాలు చేసుకోవడం నిజం కాదా ? 
అసలు ఒక వ్యక్తీ హిందూమత సంప్రదాయాల ప్రకారం సంయాసాశ్రమ ధర్మాలు నియమాలు ప్రకారం సన్యాసం తీసుకుని కాషాయం కట్టిన తరువాత వాళ్లకు అంటూ ముట్టు మడి అంటరానితనం అస్పృశ్యత అంటూ ఉంటాయా ? వాళ్ళు యజ్ఞోపవీతం ధరించవచ్చా ?
అటువంటి వాళ్ళు మతము పేరుతొ విలాసవంతమైన జీవితాలు కొనసాగించడం లేదా ? 
ఇలా నిజాలు మాట్లాడితే సరైన హేతుబద్ధ సమాధానాలు చెప్పలేని ఒక కులములోని కొంతమంది సంస్కారహీనులు అసభ్య భాషా ప్రయోగం చేస్తూ శాపనార్ధాలతో అమాయకులను భయపెడతల్లెదా ?

Friday, July 3, 2015

Thursday, July 2, 2015

"తానా" "నాట్స్" ఎవరి అవసరాలు వాళ్ళవి. ....

"తానా"  "నాట్స్"  సంస్థల ఆడంబర  ఉత్సవాల పేరుతొ నేడు  షుమారు 20 కోట్ల రూపాయల తెలుగు ( కమ్మ ) సోదరుల  సొమ్ము వృధాగా దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ఇదే ధనాన్ని తెలుగుజాతికి ఇక్కడ వేరే పనులకు ( ఆసుపత్రులు వృద్ధాశ్రమాలు అనాధ శరణాలయాలు లాంటి వాటికి ) వాడితే ఫలితము పుణ్యము పురుషార్ధము ఉంటుంది కదా ...!
ఆ ఉత్సవాలకు ఇండియా నుండి అతిధులుగా ఆహ్వానితులుగా ఆడంబరముగా అక్కడకు వెళ్ళే వాళ్లకు వాళ్ళ ప్రచారము వాళ్లకు కావాలి, అక్కడకు ఆహ్వానించిన ఆ సంస్థల నిర్వాహకులకు ఈ సంస్థల నాయకత్వము లేదా పెద్దరికము పేరుతొ ఆ అతిధుల పదవులు అధికారము హోదాలతో   వాళ్ళ సొత అవసరాలు వాళ్లకు తీరాలి . అక్కడకు ముఖ్య అతిధులుగా వెళ్ళే వాళ్ళూ వాళ్లకు ఇలా చెయ్యమని ఇది తప్పని చెప్పరు, ఎందుకంటె  వాళ్ళ అవసరాలు వాళ్ళవి.
నిజంగా ఇక్కడ సంఘములో గొప్ప వాళ్ళుగా పెద్దలుగా అధికారముతొ పదవులతో హోదాలతో  చలామణీ అయ్యేవాళ్ళు , సినిమా నటులు  గనక అక్కడి వాళ్ళు ఇలాంటి ఆడంబర వేడుకలకు పిలిచినప్పుడు వెళ్ళకుండా ఉంటె చాలు కదా వాళ్ళలో మార్పు రావడానికి.
కానీ ఇక్కడ మాత్రం  ... గేదోడు గేదకి ఏడిస్తే , తోలోడు తోలుకి ఏడ్చినట్టు.... ఎవరి అవసరాలు వాళ్ళవి. .... సువేరా 

"తానా" సంస్థ చరిత్ర

ఉత్తర అమెరికాలో నివశించే మన తెలుగువారిలో ఒక వర్గం వాళ్ళు తానా పేరుతొ అందరు ఒకచోట చేరి, వేడుకల పేరుతొ ఏదొక రకముగా అందరు కలుసుకోవడం సంతోషమే. ఆ సోదర సోదరీమణులు వారికి అందరికి నా శుభాకాంక్షలు.
సరిగ్గా నాలుగైదు మసాల క్రితం నేను అమెరికాలోని తానా సంస్థ మీద నేను ఫెసుబుక్ లో కొన్ని పోస్టులు పెడితే అప్పుడు నాతొ ఒక పెద్దమనిషి తనంతట తనే నాకు మెసేజ్ పెడుతూ మీరు తానా మహాసభలు జరిగే సమయములో అమెరికా రండి మనమందరమూ తానా చేస్తున్న కల్చరల్ ఇమ్పీరియలిజాన్ని ( సాంస్కృతిక దాడి ) నిరశిస్తూ ఆ వేదిక దగ్గర ధర్నా చేద్దాం అని అన్నారు. ఆయన గారు హైదరాబాదు మహానగరములో మానవహక్కుల మీద, స్త్రీ హక్కుల మీదా హేతువాదము మీద రకరకాల విషయాలలో ఎన్నెన్నో గొప్ప గొప్ప ఉపన్యాసాలు అనర్గాలముగా ఇస్తూ ఉంటారు, నేను కూడా ఆయనని గత పాతిక ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను, ఆయన గురించి కొన్ని వింటూ ఉన్నాను. కాబట్టి నేని ఆయనకు తిరుగు మెసేజ్ లో " నేను అమెరికా రాను సార్, కానీ ఆ తానా పేరుతొ కొంతమంది ఇక్కడ హైదరాబాదులో చేస్తున్న చిల్లర పనుల్ని మాత్రం ఇక్కడ నుండే ఎండకదతాను, మీరే అక్కడ ఒకే భావజాలం ఉన్న వ్యక్తుల్ని సమీకరించండి ధర్నా చెయ్యండి బాగుంటుంది అని చెప్పాను. ఉన్నత చదువుల కోసం ఉన్నత జీవితం కోసం ప్రపంచములో ప్రధమ స్థానం పొందిన అమెరికాకి వచ్చి ఇక్కడ పాత వాసనల్ని వదులుకోకుండా నీచంగా ఇక్కడ కూడా రకరకాల పేరులతో సంఘాల్ని పెడుతున్నారు,తానా పేరుతొ ఇక్కడ కులసంఘాల్ని మత సంస్థల్ని పెడుతూ అమెరికాలో కూడా కుళ్ళు రాజకీయాల్ని చేస్తున్నారు, హైదరాబాదు విజయవాడ గుంటూరు లాంటి ప్రదేశాలలో చేసే కులసమావేశాలు లాంటివి మత సమావేశాలు ( దేవాలయాలు నిర్మిస్తూ ) నిర్వహిస్తూ ఆంధ్రావాళ్ళు ఇక్కడ సామాజిక ఔన్నత్యాన్ని మంటగాలుపుతున్నారు అని చెప్పిన పెద్దమనిషి నేడు అదే తానా సంస్థ చరిత్ర వ్రాయడము ( ఆ తానా సంస్థ వాళ్ళు ఈయనతో వ్రాయించుకున్నారు ) అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.
ఇలా ఆయన ఎందుకు వ్రాయాల్సి వచ్చిందో ? దీని వెనక ఉన్న " కారణాలు " ఏమిటో ?
నేడు అలా వండబడిన చరిత్రను ఏ మహానుభావుల చేతిమీడగా ఆవిష్కరిస్తారో చూడాలి ...!
చరిత్ర వ్రాయించుకునే వాళ్లకు ఏమీ లేదని చాలామందికి తెలుసు, కానీ వ్రాసే వాళ్లకు ఉండాలి కదా ....!
సరే ... వ్రాసే వాళ్లకు, వ్రాయించుకునే వాళ్లకు ఉండదనుకోండి రేపు అది చదివి అది అంతా నిజమని నమ్మే పరిస్థితి వస్తే " మహాత్మా గాంధీ కూతురే సోనియా గాంధీ" అని నమ్ముతున్నట్లే రేపు కూడా అమాయకులు ఇటువంటి వక్రీకరణ చరిత్రలు నమ్మే పరిస్థితి రావచ్చు.
నిభద్ధత లేని వ్యక్తులు వ్రాసే చరిత్ర అయినా, రచనలు అయినా, నీతి సూక్తులు అయినా, చేసే పనులు అయినా నిరర్ధకం అని ఒక అబ్రహం లింకన్ అంటారు.. సువేరా

నా ఇష్టం అంటే కుదరదు,

ఒక బాధ్యతగల అయ్యేఎస్ ఐపీఎస్ అధికారిణి / అధికారి ఎటువంటి దుస్తులు ధరించారు / ధరిస్తున్నారు మరియు వాళ్ళు బయట ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తప్పకుండా ప్రజలు చర్చించే విషయమే. వాళ్ళ ఇష్టానికి దుస్తులు ధరించి నా ఇష్టం అంటే కుదరదు, వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉండే రాజకీయనాయకులు లాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ జీవితాలు వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ ఇష్టానికి పబ్లిక్ లోకి అలానితి దుస్తులలో వస్తే ఎవరైనా ఏమైనా అంటారు.
చాలామంది చదువుకున్న వాళ్ళు విజ్ఞులు కూడా ఆమెను సమర్ధించడానికి ప్రయత్నించడం శోచనీయం, ఆమె ఇష్టానికి వచ్చిన దుస్తులలో బాధ్యతలకు హాజరు కాకూడదు, కావాలంటే అటువంటి దుస్తులలో ప్రైవేటు జీవితములో లేక విహారయాత్రల్లో తిరగవచ్చు.

Wednesday, July 1, 2015

కూతురు ప్రసవ వేదనలు విని అల్లుడిని తిట్టినట్టు ఉంది.

కూతురు ప్రసవ వేదనలు విని అల్లుడిని తిట్టినట్టు ఉంది.
ఒక సీనియర్ జర్నలిష్టుగా పేరున్న శ్రీ ఆర్వీ రామారావు గారు ఇటువంటి వ్రాతలు వ్రాయడం విచారకరం, అవుట్ లుక్ వ్రాతలకు ఇప్పుడు శ్రీ ఆర్వీ రామారావు వ్రాతలు తేడా ఏమీలేదు,
ఈయన అనవసరముగా తెదేపా ని ఇందులోకి లాగడం అకయన స్థాయిని దిగాజార్చుకోవడమే .

 http://teluguglobal.com/using-journalism-in-an-abrupt-way-by-outlook-magazine/

తానా తందానా.............!

పార్లమెంటు తలుపులు బిగించి టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆపించి కండబలముతో దౌర్జన్యముతో తెలుగుజాతిని తెలుగు భూమిని దగ్గర ఉండి రెండుగా చీల్చిన పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీమాన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు రేపోమాపో అమెరికాలో నివశించే తెలుగుజాతి వీరులు దేశభక్తులు అత్యంత నిరాడంబరంగా రికార్డింగు డాన్సులు లాంటివి ఏమాత్రం లేకుండా, ఎవరి భోజనాలు వాళ్ళే తెచ్చుకునే విధంగా, దరిదాపు నాలుగు లక్షల డాలర్ల కేటరింగు కాంట్రాక్ట్ ఒకరికే లేదా కేవలం ఒకే వ్యక్తికీ చెందినా సంస్థకి ఇవ్వకుండా, ట్రావెల్ ఏజన్సీ కూడా సొంత మనుషులకు చెందినది కాకుండా బయటి వారికి ఇచ్చి, ఒక్క నయాపైసా కూడా సంఘం సొమ్ము దుర్వినియోగం కాకుండా, తానా అధినాయకులే ( ముగ్గురు రింగు మాష్టార్లు లాంటి ప్రధాన వ్యక్తులు ) తమ సొంత జేబుల నుండి తీసి ఖర్చు పెడుతూ, అక్కడ జిల్లా వారీ సంఘాలు గ్రూపులు లేకుండా ఘనంగా జరుపుకునే " తానా సంబరాలు" కు ముఖ్య అతిధిగా వెళ్లుచున్నారు, చాలా సంతోషం గర్వకారణం కూడాను.
అక్కడ అమెరికాలో నివశిస్తూ ఎప్పుడూ తెలుగుజాతి కోసం తెలుగు నేల కోసం, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు కోసం అహర్నిశలు కలవరించే నిరాడంబరులు, ఇక్కడ తెలుగు నేల మీద ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా అక్కడ తిండీతిప్పలు మానేసి మనకోసమే నిరంతరమూ పాటుపడే తెలుగు వీరులు, ఆంధ్రాలో ఉండే నిర్భాగులు అందరు తానా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆంధ్రాకి వచ్చి వాళ్ళ కష్టాలు తీరుస్తారా అనే విధంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ, అధికారా కేంద్రానికి ఆమడ దూరములో ఉంటూ తానా సంస్థని ఏమాత్రం తమ స్వార్ధం కోసం వాడుకొని నిస్వార్ధ జీవులు, ఇక్కడ ఎవరు అధికారములో ఉంటె వాళ్ళ కాళ్ళు పట్టుకోకుండా, వాళ్లకు భజన చెయ్యకుండా, కేవలం ఏ ఒక్క కులానికో కాకుండా అమెరికాలో ఉండే అన్ని కులాల తెలుగువారిని ఒకే త్రాటి మీదకు తెచ్చి, వర్గవిభేదాలు లేకుండా, కులానికొక సంస్థ లేకుండా, ప్రతిసారి ఒక్కొక్క కులానికి తానా సంస్థ నిర్వాహణా బాధ్యతులు ఇస్తూ అందరికీ ఆదర్శముగా ఉంటూ, నిధులు ఏ మాత్రము దుర్వినియోగము చెయ్యకుండా, తానా నాయకులు మాత్రమె వారి వారి సంపాదనలో భూరి విరాళాలు ఇస్తూ, అప్పట్లో చంద్రబాబుకి, ఆ తరువాత రాజశేఖరరెడ్డి కి, మరలా ఇప్పుడు చంద్రబాబుకి కెసీఆర్ కి భజన చెయ్యకుండా పాద పూజలు చెయ్యకుండా, వాళ్ళ నుండి ఎటువంటి పదవులు పనులు ఆశించకుండా, తానా తిరనాళ్ళలో కేటరింగు కాంట్రాక్ట్ ఎప్పుడు ఒకే సంస్థకు / మనిషికి ఇవ్వకుండా, సంస్థని ఏ ఇద్దరు ముగ్గురు చెప్పు చేతలలో పెట్టుకోకుండా, అస్సలు రింగు మాష్టార్లు అనే పదాన్ని దగ్గరకు చేరనివ్వకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో / తెలంగాణా రాష్ట్రములో ఏ పార్టీ అధికారములో ఉంటె ఆ పార్టీకి లేదా ఆ అధినేతలకు బానిసలుగా, పైరవీ కారులుగా మారకుండా, హైదరాబాదులో తానా నాయకత్వము పేరుతొ రియల్ ఎష్టేట్ దండాలు సెటిల్మెంట్లు చెయ్యకుండా. నోబుల్ స్థాయిలో చదువుకున్న వారు వాళ్ళ రంగాలలో అంతర్జాతీయ స్తాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన లబ్ధ ప్రతిష్టులు మాత్రమె గత దశాభ్దముగా తానా సంస్థకి అధ్యక్షా కార్యదర్శులుగా ఇతర పదవులలోను నాయకత్వం వహిస్తూ, రేపు రాబోయే కాలములో కూడా అటువంటి లబ్ధప్రతిష్టులనే నాయకులుగా గెలిపించుకుని ప్రపంచానికి ఆదర్శముగా నిలిచినా అమెరికా తెలుగు సోదరులు ( సారీ ... కమ్మ సోదరులు ), రేపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారిని ఆయన ఆనాడు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక ప్రతిపత్తి కల్పిస్తాము అని, ఆ స్పెషల్ స్టేటస్ కేవలం అయిదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తాము అని, మీరు భయపడాల్సిన పని లేదని, బీజేపీ అధికారములోకి రాగానే ఆంధ్రాకి ఒకటే నిధుల వరద అని, ఆంధ్రాని భూతల స్వర్గం చేస్తామని, పదేళ్లల్లో ఆంధ్రాని ప్రపంచ స్థాయికి తీసుకు వెళతామని చెప్పిన మాటలు, ఈనాడు స్పెషల్ స్టేటస్ రాదు , వీలు పడదు అని కుంటి సాకులు చెబుతున్న శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారిని ఈ తానా నాయకులు సభ్యులు నిలదీసి అడగగలరా ..? ఈ తానా వారికి తందానా అనే కొంతమంది దళారీ రాజకీయ నాయకుల అండ చూసుకుని, వాళ్ళను అక్కడకు ఈ తిరునాళ్ళకు ప్రత్యేకముగా తీసుకెళ్ళి లాస్ ఏంజిల్స్ లాంటి ప్రదేశాలలో రకరకాలుగా సేద తీరుస్తూ వారికి అక్కడ అన్ని అవసరాలు తీరుస్తూ వారిని పైరవీలకు సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వాడుకుంటున్నారు అనే అపప్రద ఏమాత్రము రాకుండా చాలా హుందాగా నిర్వహిస్తున్న తానా తందానా సభ్యులకు నాయకులకు శుభాభినందనలు.
మీరు రేపు వెంకయ్యనాయుడు గారిని కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీద సవతితల్లి ప్రేమ చూపించడాన్ని, నిధులు లేకుండా, స్పెషల్ స్టేటస్ లేకుండా చెయ్యడాన్ని నిల దీస్తారా ..? నిగ్గదీస్తారా ? లేక శ్రీ వెంకయ్యనాయుడు గారి హోదాని పదవిని మీమీ సొంత అవసరాలకు అవకాశాలకు వాడుకుంటారా ?