Thursday, October 22, 2015

ఆంధ్రుల ఆత్మగౌరవం ఉందా ..?

ఆత్మగౌరవం ఆత్మాభిమానం పౌరుషం సిగ్గు ఎగ్గు ఏమాత్రం లేని ( మరచిపోయిన ) చేవ చచ్చిన దళారీ మనస్కులైన ( బ్రోకర్లు ) ఆంధ్రులకు స్పెషల్ స్టేటస్ , స్పెషల్ ప్యాకేజ్ లాంటివి ఏమీ ఇవ్వకపోయినా ఆ ఆంధ్రా బానిసలు ఏమీ పీకలేరని, ఆంధ్రులు వాజమ్మలని, దద్దమ్మలని, చవటలని, చేతగాని వెధవలని  దిల్లీకి బాగా తెలుసు.
పోరాటం అంటే ఏమిటో తెలియని ఆంధ్రులకు, అవసరాల కోసం ఎంతకైనా దిగజారే ఆంధ్రులకు ఏమీ ఇవ్వాల్సిన పనిలేదని, వాళ్ళు ఎలాగైనా ఎక్కడైనా బ్రతకగలరని దిల్లీకి బాగా తెలుసు.
వెన్నెముక లేని బానిస ఆంధ్రులు వాళ్ళ స్వార్ధం కోసం  ఎంతకైనా దిగాజారతారని, వాళ్ళు ఏమి చెయ్యమన్నా చేస్తారని, వాళ్ళ బ్రతుకుదెరువుకి  ఎవరినైనా పోగుడుతారని, ఎవరినైనా తిడతారని, వాళ్లకు సిగ్గు ఎగ్గు పౌరుషం ఏమాత్రం మచ్చుకైనా లేవని  ఇంటిలిజెన్స్ ద్వారా దిల్లీకి ఏనాడో సమాచారం చేరింది. దాని యొక్క రుజువే గత దశాబ్దంగా తీవ్రమైన పరుషమైన భాషతో ఆంధ్రులను ఆంధ్రా మహిళలను పిచ్చి తిట్టులు, కారు కూతలు కూసిన కెసీఆర్ ని అధికార పక్షం ఆహ్వానించడం, దాన్ని ప్రతిపక్షం కానీ లేదా  ఏ ఒక్కరు వ్యతిరేకించక పోవడం, అతని పేరు శిలాఫలకం మీద వెయ్యడం, అతనికి స్వాగత బ్యానర్లు పెట్టడం , అతను మాట్లాడుతుంటే చప్పట్లు ఈలలు వెయ్యడం నిదర్శనం. నేడు ఆంధ్రాలో అధికారపక్షం ఒక బానిసల సమూహం, ప్రతిపక్షం ఒక శిఖండి. ఆంధ్రాలో ప్రతిపక్షం  అది ఒక లంపెన్ గ్యాంగు, అది ఒక అరాచకుల, సంఘ వ్యతిరేకుల వేదిక, ఆ నాయకుడు ఒక మాఫియా లేదా ఒక నేరసామ్రాజ్య డాన్ మనస్కుడు.
రాజకీయంగా దేశములో ఎంతో చైతన్యవంతమైనది అని చెప్పుకునే విజయవాడ లో నేడు ఈ పరిస్థితి దాపురించడం బానిస దళారీ ఆంధ్రుల మానసిక పరిస్థితికి నిదర్శనం.
కనీసం విజయవాడలో గానీ ఆంధ్రాలో గానీ ఒక్కడంటే ఒక్కడు ( రాజకీయనాయకుడు లేదా పౌర సమాజం ) కెసీఆర్ రాకను ఖండించడం గానీ , వ్యతిరేక ప్రదర్శనలు చెయ్యడం గానీ మనము చూడలేకపోయాము. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ ఊదరగొట్టే  ఈనాడు రామోజీరావు  కూడా నలుగురు మధ్య ( బీజేపీ తెదేపా వైసీపీ టీఆరెస్ ) ఒక దళారీలాగా ప్రవర్తించి రాజీలు చేసాడు. మరి ఈయనకు ఆత్మగౌరవం అంటే అర్ధం తెలుసా ..? ఈయనకు అసలు
ఆత్మగౌరవం  ఉందా ..?
ప్రతిపక్షం కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రవర్తించింది. జగన్ కి కెసీఆర్ కి మధ్య ఉన్న సత్సంబంధాలు వలన ఒక జాతిద్రోహి ఒక జాతి విద్వేషి వస్తుంటే అడ్డుకోలేకపోగా కనీసం ఖండించను కూడా ఖండించలేదు.
కనీసం .. ఆంధ్రులు తమిళులను ఆదర్శంగానన్నా తీసుకోలేదు. శ్రీ లంక మాజీ అధ్యక్షుడు శ్రీ రాజపక్సే తిరుమలకు వస్తుంటే తమిళులు వారి రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చి తిరుమలలో శ్రీ రాజ పక్సేకి వ్యతిరేకముగా నిరసనలు చేసారు. నిన్న కనీసం అలాని వ్యతిరేక ప్రదర్శనలు కాదు కదా అతనికి కొంతమంది విజయవాడలోని తార్పుడుగాళ్ళు, బ్రోకర్లు , బానిసలు స్వాగత తోరణాలు కటౌటులు పెట్టడం సిగ్గు చేటు, శ్రీ కెసీఆర్ మాట్లాడుతుంటే కనీసం పదిమంది లేగిచి నిలబడి నిరసన కూడా వ్యక్తం చెయ్యకపోవడం ఆంధ్రుల దౌర్భాగ్యం.
ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదముతో స్థాపించిన తెదేపా అధికార పక్షములోని వారు ఒకాదంటే ఒక్కడు కూడా తమ నాయకుని చేష్టలని ప్రశ్నించకపోవడం, నిరశించాకపోవడం  వాళ్ళ బానిస భావదారిద్ర్యం.
మరి ఆరోజులలో ఈ వెధవలు అందరు సమైక్యం పేరుతొ ధర్నాలు నిరసనలు నిరాహారా దీక్షలు ఎందుకు చేసారు ? ఎవరిని మోసం చెయ్యడానికి చేసారు ?  మరి ఆరోజులలో కెసీఆర్ కి వ్యతిరేకముగా ఎందుకు ప్రజల్ని రెచ్చగొట్టారు ? హైదరాబాదులోని ప్రజల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి మీరు అందరు చేసిన డ్రామాలు / నిర్వాకాలు ఏమిటి ? ఇలా చేసిన ఈ రాజకీయనాయకుల, నేడు అధికార ప్రతిపక్షాల  వీళ్ళ పుట్టకే ప్రశ్నార్ధకం, వీళ్ళ తల్లులు మాత్రమె సత్యం. ఇలా తెలుగుజాతిని వంచనకు గురిచేసిన వీళ్ళు వీళ్ళ తరతరాలు సర్వనాశనం కాక తప్పదు. ఆత్మగౌరవం పౌరుషం పోరాటం అనేవి మరచిన  ఈ ఆంధ్రుల భవిష్యత్తు కూడా వంచనకు గురికాక తప్పదు .... సువేరా

Sunday, October 18, 2015

చీకటి రోజు...........

అమరావతి పట్టణ శంఖుస్థాపన శుభాకార్యక్రమానికి శ్రీ చంద్రబాబునాయుడు గారు స్వయాన వెళ్లి శ్రీ కెసీఆర్ & అతని కుటుంబాన్ని పౌరుషం లేకుండా ఆహ్వానించడం తెలుగుజాతికి సిగ్గుచేటు, ఆంధ్రులకు తలవంపు. ఇటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు, ఇది ఒక చీకటి రోజు.
దశాబ్దం పాటు ఆంధ్రులను తీవ్రంగా దుర్భాషలాడి తిట్టిన తిట్టు తట్టకుండా తిట్టి, ఆంధ్రులను ఆంధ్రా మహిళల్ని అవమానానికి గురిచేసిన చేస్తున్న వ్యక్తులను, టాంకు బండు మీద విగ్రహాలను కూల్చిన వ్యక్తులను ఇటువంటి శుభాకార్యక్రమాలకు పిలవడం తగదు, ఒకవేళ ఇది చంద్రబాబు గారిదో లేక తెదేపాదో ప్రైవేటు కార్యక్రమము అయితే ఎవరికీ అబ్యంతరము ఉండాల్సిన పనిలేదు, కానీ ఈ కార్యక్రమం మనసు గాయపడిన దగాపడిన అయిదు కోట్ల తెలుగువారి తెలుగుజాతి కార్యక్రమం.
ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా ఇలా వెళ్లి ఆహ్వానించడాన్ని జీర్ణించుకోలేరు, ఆత్మగౌరవం లేనివాళ్ళు ఈ పిలుపుని ఈ ఆహ్వాన చర్యను నిస్సిగ్గుగా సమర్దిస్తారని తెలుసు, కానీ వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఒక వేళ ఇలా పిలవడం వలన శ్రీ కెసీఆర్ & కో గనక సిగ్గు శరము నీతి జాతి లేకుండా తగుదునమ్మా అంటూ ఆ కార్యక్రమానికి హాజరు అయితే పరిపూర్ణమైన అమరావతి నిర్మాణం జరగదు గాక జరగదు.
హైదరాబాదు ఎల్ & టీ మెట్రో రైలు నిర్మాణములో నిర్మాణ పనులకు కావాల్సిన ఇసుక సిమెంటు స్టీలు రెడీ మిక్స్ లాంటివి సరఫరా కాంట్రాక్టు పొందిన ( కాంట్రాక్టులు పొందినట్టు వచ్చిన ఆరోపణలు ) జాగృతి నాయకురాలు రేపు ఆ అమరావతి పట్టణ నిర్మాణములో కూడా అదే కాంట్రాక్టులు పొందినా ఆశ్చర్యము లేదు, విశాల హృదయులు అయిన ఆంధ్రా నేతలు నిస్సిగ్గుగా ఇచ్చినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటె వారు వారు ఒక్కటే కదా, ప్రజలు కార్యకర్తలే సమిధలు.
సిగ్గు ఎగ్గు పౌరుషం ఆత్మగౌరవం లేకుండా అధినాయకులు చేస్తున్న వికృత చేష్టలను చూస్తూ ఇదంతా మన ఖర్మ అనుకుని మౌనంగా బాధతో బరువెక్కిన గుండెలతో శిలల్లాగా మిగిలిపోక ఏమీ చెయ్యలేము...... సువేరా

Friday, October 16, 2015

భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో.............

నిన్నటి రోజు భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో మరో చీకటి రోజు.
ఆ చీకటిలో ఒక చిరు కాంతిరేఖ మన తెలుగు వ్యక్తీ కావడం నాకు అత్యంత  ఆనందదాయకం గర్వకారణం. ఈయన నేటి న్యాయవ్యవస్థలో మరో వివేకానందుడు.
 ఇటువంటి కాంతిపుంజాలు మన న్యాయవ్యవస్తలోను రాజకీయ వ్యవస్థలోను విరజిమ్మాలని మన దేశానికి మన యువతకు వెలుగునివ్వాలని, మన యువత ఇటువంటి వారిని ఆదర్శముగా తీసుకుని దేశాన్ని ప్రపంచానికే గర్వకారణంగా మార్చాలని కోరుకుంటున్నాను.
నేను ఈరోజు మీముందు మాట్లాడగలిగే అర్హత జ్ఞానం ధైర్యం నాకు లభించడం ఆ కాంతిరేఖ యొక్క ప్రసరణ నామీద ఉండడమే, అది నా అదృష్టం.

అసలు విషయానికి వస్తాను .................,
ఇప్పటికే మన న్యాయవ్యస్త చాలావరకు బూజుపట్టి బుగిలిపోయింది, అది ఏనాడైనా కూలిపోయే రోజు కనిపిస్తోంది. నేడు వారసత్వ కబంద హస్తాలలోకి మన న్యాయవ్యవస్థ శాశనవ్యవస్థ అధికారవ్యవస్థ వెళ్ళిపోతున్నాయి, వారికి నేడు దళారీ తారుపుడుగాళ్ళ మీడియా కూడా వాళ్ళ ఆస్తులు అక్రమాలు కాపాడుకోవడానికి  కొమ్ముకాస్తోంది, ఈ వ్యవస్థలన్నీ  చాలావరకు కలిసిపోయి ఒక మాఫియాలాగా తయారయి మన దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని దోచుకుంటూ వ్యవస్థీకృత సామ్రాజ్యాన్ని సృష్టిస్తూ తమ వారసత్వ సంపదలాగా మారుస్తున్నారు.
నిన్న మన భారత సుప్రీం కోర్టు లో  అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం న్యాయమూర్తుల నియామక విషయములో నలుగురు  సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెలువరించిన అన్యాయ తీర్పు భారత ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు, భారత రాజ్యాంగ వ్యవస్తకే మాయని మచ్చ, ఇది ఒక రకముగా అహంకార పూరిత తీర్పు, ఇది ఒక వ్యవస్తీకృత న్యాయవ్యవస్త తన నియంతృత్వాన్ని నిలుపుకోవడానికి అర్రులు చాస్తూ ఇచ్చిన దుర్మార్గపు తీర్పు.
కొన్ని సంవత్సరాలుగా మన దేశములో నడుస్తున్న కోలీజియం న్యాయవ్యవస్త  అసమర్ధులను దళారీలను అవినీతిపరులను రాజకీయ పార్టీల ఏజంట్లను కనీసం న్యాయశాస్త్రములొ అక్షరం ముక్క తెలియని కాపీలు కొట్టి ఉత్తీర్ణులైన వారిని ఉన్నత న్యాయస్థానాలలో చాలామందిని న్యాయముర్తులుగా నియమించడం మనకు తెలిసిందే , ఇది లోక విదితమే, ఇది మన భారత ప్రజల దౌర్భాగ్యం.
ఇలా నియమించబడిన వారి చేతిలో మన న్యాయవ్యవస్థను ప్రజల భవితను మన రాజ్యాంగాన్ని అప్పచెప్పడం మన ఖర్మ. వీరందరూ న్యాయాన్ని రాజ్యాంగాన్ని నడిబజారులో అపహాస్యం చెయ్యడం కూడా విదితమే. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక హైకోర్టులో ఉన్నత న్యాయమురులుగా నియమించడానికి  13 మంది అభ్యర్ధుల దగ్గర ఒక్కో అభ్యర్ధి ( హైకోర్టు న్యాయవాదులు ) దగ్గర అక్షరాల మూడు కోట్ల రూపాయిలు చొప్పున వసూలు చేసిన వ్యక్తీ ఎవరో, ఏజెంట్లు ఎవరో  మూసినది ఒడ్డున ఎవరిని అడిగినా చెబుతారు, ఈ వ్యవహారం బహిర్గతం అయిన తరువాత ఆ పేర్లను వెనక్కి పంపించివేయడం జరిగింది ( ఒకవేళ ఇది బయట పడకపోయి ఉంటె మన ఖర్మ కాలి వాళ్ళు నేడు మనకు న్యాయమూర్తులు అయ్యేవారు ). ఇలా జరిగిన సంఘటనలు భారతదేశ న్యాయవ్యవస్థలో చాలా ఉన్నాయి. ఇలా అక్రమంగా నియమించబదినవారు నేడు వారి ఏజంట్ల ద్వారా, తమ కుటుంబసభ్యుల ద్వారా బహిరంగాముగానే కేసునిబట్టి వెలకట్టి వసూళ్లు చెయ్యడం కోర్టు వ్యవహాలలో అబున్హవం ఉన్నవారు ఎవరైనా చెబుతారు.
కొంతమంది వ్యక్తిత్వం లేని వారు ఇలా న్యాయముర్తులుగా నియమించిన తరువాత వారిని ఎవరు ప్రశ్నించకుండా ఉండటానికి సమాజాన్ని భయపెట్టడానికి కోర్టులోనూ బయట ఎవ్వరు వారిని ఎదిరించకుండా ఉండటానికి వారిచేతిలో ఒక దుర్మార్గపు అస్త్రం " కన్టేమ్ప్ట్ ఆఫ్ కోర్ట్ " . ఇది వెధవల్ని ఆ వెధవలు చేసే పనుల్ని కప్పిపెట్టదానికే ఉపయోగపడుతోంది.  ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఉండే క్రింది స్థాయి కోర్టులలో కూడా నియామకాల్లో అక్రమాలు అవినీతి  జరుగుతూ కోట్లరూపాయిలు చేతులుమారడం అందరికీ తెలిసిందే.
చాలామంచి మార్కులతో ఉత్తీర్ణులు అయినవారు న్యాయశాస్త్రంలో మంచి అవగాహన ఉన్న నీతిమంతులు నేడు క్రింద స్థాయిలోనే ఉండిపోతున్నారు, అటువంటివారు మేజిస్త్రేటులుగాను, జిల్లా న్యాయముర్తులుగానే మిగిలిపోతున్నారు.
నిన్న కోలీజియం వ్యవస్థను సమర్ధించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో చాలా అసందర్భ అహంకార వ్యాఖ్యలు చూస్తుంటే ఇటువంటి వ్యక్తులు మనకు అత్యంత ఉన్నత న్యాయమూర్తులు అవ్వడం చూస్తుంటే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు ఉంది.
నిన్నటి తీర్పులో న్యాయమూర్తి శ్రీ చలమేశ్వర్ గారు నడుస్తున్న న్యాయవ్యస్త నియామకాల్లో చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు ఎత్తి చూపిన లోపాలు ప్రజలకు కూడా చేరువవ్వడం సంతోషదాయకం.
ఆయన ఒక జ్ఞాని, ఒక తాత్వికుడు, ఒక నిండు కుండ. ఇటువంటివారు నేడు మన న్యాయవ్యవస్థలో చాలా తక్కువగా ఉన్నారు, ఇటువంటివారికి మనుగడ ఉండనివ్వని నేటి వ్యవస్థలో మనం ఉండటం ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

Monday, October 5, 2015

ఒక తెలుగు వాడి విన్నపము.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని నమస్కరించి ఒక తెలుగు వాడిగా చేసుకునే విన్నపము.
అయ్యా ,
మన ప్రియతమ నాయకుడు కీశే నందమూరి తారక రామా రావు గారు తెలుగుజాతి గురించి భవిష్యత్తు తరాలవారికి తెలియచెప్పడం కోసం ఆనాడు హైదరాబాదు సచివాలయానికి ఎదురుగా తెలుగుతల్లి విగ్రహము మరియు టాంకు బండ్ మీద మన తెలుగుజాతి మరియు తెలుగుభాష గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపజేసిన లబ్దప్రతిష్టుల కాంశ్య విగ్రహాలను నెలకొల్పడం జరిగింది, ఆ విగ్రహాలు హైదరాబాదు నగరానికే వన్నె తెచ్చాయి.
కానీ కాలగమనములొ తెలుగుజాతి యావత్తు సిగ్గుతో తలదించుకునే విధంగా జరిగిన నికృష్ట రాజకీయ స్వార్ధ పరిణామాలతో హైదరాబాదు కీర్తి మసకబారడం అందరికీ తెలిసిందే. కొంతమంది కుక్కమూతి పిందెలు మన భాషను యాసను మన తెలుగుజాతి దివ్వెలను హేళన చెయ్యడం , ఆ విగ్రహాలను అనాగరిక సంస్కారముతో ఒక కుటుంబం ఆనాటి కుసంస్కార కాంగ్రెస్ ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసు పహారాలో ద్వంసం చెయ్యడం కూడా మన కళ్ళముందే జరిగింది.
జరిగిన దానిని గుడ్లప్పగించి మౌన రోదనతో తెలుగుజాతి యావత్తు భరించింది. ఏది ఏమైనా తెలుగుజాతికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
తెలుగుజాతిని తార్పుడుగాళ్ళు తాగుబోతులు చీలికలు పీలికలుగా చేసేసారు.
గతం గతః
మన పదహారు అణాల స్వచ్చమైన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక, మనకు చారిత్రిక అమరావతిని మీ నాయకత్వములో రాజధానిగా ప్రకటించి నిర్మాణం మొదలు పెడుతున్న సందర్భములో ఇక్కడ హైదరాబాదులో సచివాలయము ఎదురుగా ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని, టాంక్ బండ్ మీద ఉన్న మన తెలుగువెలుగుల విగ్రహాలని అన్నిటికూడా తక్షణమే విజయవాడ కృష్ణమ్మ ఒడ్డుకి గానీ లేక అమరావతి నగర నడిబొడ్డుకు గానీ తరలించి మన తెలుగు జాతి మనోభావాలను కాపాడతారని ఆశిస్తున్నాను. వీలయితే ఈనెల అక్టోబరు 22 తేదీనే మనమే గౌరవంగా మేళతాళాలతో ఆ విగ్రహాలను మన స్వచ్చ తెలుగు రాష్ట్రానికి తరలించే ఏర్పాటు చెయ్యగలిగితే ఆ ఘట్టం కూడా మీ చేతులతో మన తెలుగుజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించ బడుతుంది.
ఇక్కడ మన తెలుగుజాతి వెలుగు దివ్వెల విగ్రహాలు ఉండటం ఏమాత్రం మనకు గౌరవప్రదము కానేకాదు.
ఇక్కడ కొన్ని విగ్రహాలను స్వార్ధ రాజకీయ ఓటు బ్యాంకు ఉద్దేశ్యముతో తెలంగాణా ప్రభుత్వమూ ఏర్పాటు చేస్తోంది అనే విషయము మీకు తెలియనిది కాదు, ఆ విగ్రహాల పక్కన లేదా అదే ప్రదేశములో మన చారిత్రిక పురుచుల గొప్పవాళ్ళ విగ్రహాలను ఉంచడం మన గొప్పవాళ్ళను మనము అవమానపరచడమే అవుతుంది.
ఈ విషయాన్ని శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి మంత్రివర్గం మరియు ఆయన సలహాదారులు కూడా సానుకూలముగా తెలుగు వారిగా వివేకముతో ఆలోచించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి మరియు విశాలాంధ్ర మహాసభ వ్యవస్థాపక సబ్యుడు
భవదీయుడు
సుంకర వెంకటేశ్వర రావు ( ఎస్వీరావు ) @ సువేరా @ కొండయ్య

బెజవాడ బెమ్మీలు

వాళ్లకి వాళ్ళు గొప్ప పెపంచ మేధావులు అని, దేశ భక్తులు అని ఒక గొప్ప ఫీలింగు.
వీళ్ళకు  మేమే గొప్ప వాళ్ళం  అని చాలా నమ్మకం, ఇప్పుడే వచ్చిన నడమంత్రపు సిరితొ. హైదరాబాదు వాళ్ళు అంటే చులకన.
కోతికి కొబ్బరికాయ దొరికితే ఏదో చేసినట్టు, వీళ్ళకి అర్ధంతరంగా గుర్తింపు వచ్చేసింది, దానితో వీళ్ళకు కాళ్ళ కింద ఉన్నది ఆకాశం పైన ఉన్నది భూమి అన్నట్టు అయింది.
వీళ్ళకు ఆంధ్రా ప్రాంతము మీద అంత ఆప్యాయత ప్రేమ ఉంటె పదేళ్ళ క్రితమే జై ఆంధ్రా అంటే పోయేది కదా .. కానీ ఒక్కడు కూడా అన్న పాపాన పోలేదు.
వాళ్ళు ప్రపంచానికి నీతులు చెబుతారు కానీ ఒక్కడు కూడా పుట్టిన ఊళ్ళో ఒక్క పాయఖానా కూడా కట్టించిన పాపాన పోలేదు,  
వాళ్లకి నవ్వుకి ఏడుపుకి తేడా తెలియడంలేదు,
ఆకుకి పువ్వుకి తేడా తెలియడంలేదు,
చెబితే వినరు, గిల్లితే ఏడుస్తారు,
వాళ్ళే బెజవాడ బెమ్మీలు,
బెజవాడ బెమ్మీలు చాలామంది కమ్మనైన చిడతల భజనలో ప్రపంచ దిట్టలు.చిడతల భజనలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టేతట్టున్నారు.

Sunday, October 4, 2015

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు 18 మార్గాలలో దేవుడిని ఎలా చేరుకోవచ్చు అని మాత్రమె చెప్పాడు, 
కానీ, ఆయన కలికాలములో 19 వ మార్గము కూడా ఒకటి వస్తుంది అని , దానితోపాటు కూడా దేవుడిని చేరుకోవచ్చు అని చెప్పలేకపోయాడు లేదా ఊహించలేకపోయాడు.
ఆ 19 వ మార్గమే నేటి ఆధ్యాత్మిక వేలంవెర్రి మార్గం. 
ఇందులో గురువులు ప్రవక్తలు మొదలు అనుసరించే అందరు వెర్రిబాగుల వాళ్ళే.
ఆ మార్గాన్ని నేడు పండితులు పామరులు విద్యావంతులు గుడ్డిగా అనుసరిస్తున్నారు, ఈ మార్గాన్ని నేడు మీడియా మరియు పండితులు పీఠాధిపతులు ప్రవక్తలు బాగా వాడుకుని అన్నివిధాలా ఆరితేరిపోతున్నారు.
కానీ ఈమార్గములొ ప్రయాణం చేసేవారు చేరుకునేది దేవుడిని కాదు ... పిచ్చి ఆసుపత్రినే సుమా ...!

Saturday, October 3, 2015

అడిగేవి , అడగాల్సినవి చాలా ఉన్నాయి...కానీ సమాధానాలే ఉండవు

పార్టీ పుట్టిన నాటినుండి పార్టీనే నమ్ముకుని పార్టీని రాక్షసుల మధ్య బ్రతికిన్చుకుంటూ వస్తున్నా వాళ్ళు 2004, 2009,2014 ఎన్నికలలో పార్టీ పోకడల మీద ప్రజలో ఒక వ్యతిరేక గాలిలో  రాష్ట్ర వ్యాప్తంగా చాలా పటిష్టమైన ప్రదేశాలలో కూడా ఓడిపోయిన సందర్భములో, నేడు పార్టీ అధిష్టానం కొన్ని చోట్ల అలా ఓడిపోయినా ప్రాంతాలలో అక్కడ ప్రతిపక్షములో ( వైఎస్సార్ కాంగ్రెస్ ) గెలిచినా వారిని తెదేపాలోకి తీసుకురావాలను కోవడం రాజకీయ పలాయనవాదమె కదా ...!
ఒకవేళ అలా ఓడిపోయినవారు పార్టీకి పనికిరాకపోతే చాలామంది ఓడిపోయినా వారికి పార్టీలు తరచుగా మారిన వారికి పిలిచి మంత్రిపదవులు ఎలా ఇచ్చారు ?
అలా ఇచ్చిన వారిలో
1. శ్రీ యనమల రామకృష్ణుడు ... ఈయన ఎన్నిసార్లు ఓడిపోలేదు ? ఓడిపోయినా ఈయనకు  ఈయనకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు ?
2. శ్రీ ఘంటా శ్రీనివాసరావు ... ఈయన ఎన్ని పార్టీలు మారాడు ? ఈయన పార్టీకి ఎంత సేవ చేసాడని పిలిచి మంత్రి పదవి ఇచ్చారు ?
3. శ్రీ నారాయణ ( నెల్లూరు ) .... ఈయనకు పార్టీలో సభ్యత్వం ఉందా ? ఈయన బయటపడి పార్టీ కోసం ఎప్పుడన్నా పనిచేశారా ? ఈయన ఆనాడు వైఎస్సార్ కి చాలా అత్యంత సన్నిహితంగా మేలగాలేదా ? ఈయనకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు ?
4. శ్రీ కిషోర్ బాబు .... ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ? ఈయన పార్టీకి చేసిన సేవలు ఏమిటి ? ఈయనకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు ?
5. శ్రీ లోకేష్ ... ఈయన వయసెంత ? ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చి క్రియాశీలకంగా పనిచేసాడు ? ఈయన ఎన్ని ఎన్నికలో పోటీ చేసాడు ? ఎన్ని గెలిచాడు ? ఎన్ని ఓడాడు ?  ఈయన పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసాడని అప్పుడే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు ? ఈయన అధినేత  కొడుకు / వారసుడు తప్పించి  ఈయనకు ఉన్న అర్హతలు ఏమిటి ? పార్టీకోసం 30 ఏళ్ళుగా పనిచేస్తున్నవారు ఈయన కంటే చురుకైన వాళ్ళు మేధావులు లేరా ? దొరకలేదా ?
6. శ్రీ మండలి బుద్ధప్రసాద్ ... ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ? ఈయన అవనిగడ్డ ప్రాంతములో పార్టీకి చేసిన ద్రోహం ఎంత ? ఈయనకు డిప్యూటి స్పీకర్ పదవి ఎలా ఇచ్చారు ?
7. శ్రీ పిన్నమనేని వెంకటేశ్వరరావు ... ఈయన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ? ఈయన పార్టీకి చేసిన సేవలు ఏమిటి ? ఈయనకు ఆప్కాబ్ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు ?
8. శ్రీ కూచిభొట్ల ఆనంద్ ... ఈయనకు పార్టీలో సభ్యత్వం ఉందా ? ఈయనకు పార్టీ ఆఫీసు మెట్లు ఎలా ఉంటాయో తెలుసా ? ఈయనకు కూచిపూడి  నాట్యానికి ఏమన్నా సంబంధం ఉందా ? ఈయనకు ఆ పదవి ఎలా ఇచ్చారు ? ఇతను కళని అమ్ముకునే ఒక కమర్షియల్  ఈవెంట్ ఆర్గనైజర్ మాత్రమె కదా ?
9. శ్రీ పోట్లురి హరికృష్ణ .... ఇతనికి అధికార భాష సంఘం అధ్యక్షినిగా పదవి ఇచ్చారు ? ఇతని అర్హతలు ఏమిటి ? ఇతని వయసెంత ? ఇతనికి తెలుగు భాషలో ఉన్న అర్హత గుర్తింపు ఏమిటి ? ఇతని ఎన్ని సంవత్సరాలుగా పార్టీకి పనిచేసాడు ? ఎక్కడ చేసాడు ఏమి చేసాడు ?
10. శ్రీ జూపూడి ప్రభాకర్ , శ్రీ డొక్కా మాణిక్య ప్రసాద్ ... వీళ్ళు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు ? వీళ్ళు పార్టీకి చేసిన సేవ ఏమిటి ? వీళ్ళకంటే గొప్పవాళ్ళు పార్టీలో లేరని వీరిద్దరికీ అధికార ప్రతినిధుల పదవులు ఇచ్చారా ?

ఇంకా చాలా ఉన్నాయి అడిగేవి , అడగాల్సినవి.
కానీ సమాధానాలే ఉండవు .
సమాధానాలు చెప్పలేక సమాధానాలకి బదులు పెంపుడు వీధి కుక్కలు మాత్రం మొరగాడానికి కరవడానికి సిద్ధం.