Thursday, June 18, 2015

మా మీద మీ జాలి అవసరము లేదు

హైదరాబాదులో నివసించే 40 లక్షల  మా ( ఆంధ్రులు ) గురించి, మొత్తం తెలంగాణలో నివశించే షుమారు ఒక కోటి మంది ఆంధ్రుల గురించి ఎవరు దిగులు పడాల్సిన అవసరము లేదు, మీ నిరర్ధక సూత్రీకరణలు ఇక్కడ పనిచేయవు. మేము హైదరాబాదు నివాసులమే, మేము ఇక్కడే ఉంటాము, మేము ఎటువంటి పరిస్థితినైనా చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎదుర్కొంటాం, మాకు ఆ నమ్మకం ఉంది, కాకపొతే మమ్మల్ని నిలువునా ముంచిన, మా జీవితాల్ని చిన్నాభిన్నం చేసిన ఆంధ్రా బ్రోకర్ నాయకులంటే  ఏమిటో,  దళారీ రాజకీయపార్తీలంటే  ఏమిటో, అవకాశవాద ఆంధ్రా మీడియా అంటే ఏమిటో, వాళ్ళ చరిత్ర ఏమిటో మాకు బాగా తెలుసు. వాళ్ళంటే మాకు అసహ్యం, జుగుప్స.
మా మీద మీ జాలి అవసరము లేదు, మా మీద  దాడులు జరుగుతాయి అని, కాబట్టి చంద్రబాబు  గారు ఆలోచిస్తాన్నారు అనే కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు, మీరు అంతగా దిగులు చెందాల్సిన అవసరము లేదు, మాకు తెలుసు ఎవరిని ఎలా ఎదుర్కోవాలో, మాకు తెలుసు ఎలా మా ఆత్మగౌరవం నిలుపుకోవాలో.
ముందు మీరు ఇప్పుడు జరుగుచున్న యుద్ధంలో  శ్రీ చంద్రబాబు గారు  జారిపోకుండా వెన్నుతిప్పకుండా ఉండే విధంగా  మీ పరువు పోనీ విధంగా చూసుకోండి, మీరు మీకోసం మీ నాయకుని కోసం బాధపదండి, మా కోసం అవసరంలేదు.
ఇప్పుడు జరుగుతోంది నిజమైన ఆత్మగౌరవ పోరాటం, ఇప్పుడు కూడా మీరు మీ నాయకుని స్వార్ధం కోసం  మా భావోద్రేకాలు రెచ్చగొట్టి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తె మీరే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పుడు ఇక్కడ ( హైదరాబాదు ) సెక్షన్ 8 అమరుజరిపే విధంగా నిజాయితీగా పని  చేయండి , మీ నాయకుని  నిజాయితీని నిరూపించుకోండి. మీ నాయకునికి చిత్తశుద్ధి ఉంటె హైదరాబాదు ని కేంద్రపాలితం చేయించండి, అప్పుడు మీరు నిఖార్సు అని నమ్ముతాం, మీ సూత్రీకరణలు నిజమని నమ్ముతాం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.