Thursday, June 18, 2015

"రైతు"

దేశములో "రైతు" తప్పించి అందరు దేశ ద్రోహులే, అందరు అవినీతిపరులే, అందరు దేహాలతో వ్యాపారము చేసేవాళ్ళే,
ఏ రాజకీయనాయకుడు ఒక న్యాయవాది ఒక చార్టెడ్ అకౌంటెంట్ సలహా సంప్రదింపులు సహకారం లేకుండా అవినీతికి పాల్పడ లేడు.
ఏ అధికారి రాజకీయ నాయకుల సహకారం అనుమతి లేకుండా అవినీతికి పాల్పడ లేడు,
ఏ ఒక్క అసమర్ధ న్యాయవాది / న్యాయమూర్తి రాజకీయ నాయకుల లేదా రాజకీయ పార్టీల ఆశీస్సులు అనుమతి లేకుండా ఉన్నత న్యాయమూర్తిగా పదవి పొందలేడు,
దేశములో అవినీతి విచ్చలవిడిగా పెరగడానికి ప్రధాన కారకులు,
న్యాయవాదులు
చార్టెడ్ అకౌంటెంట్ లు
న్యాయమూర్తులు
డాక్టర్లు
జర్నలిస్టులు
అధికారులు
సినిమా నటులు
నక్సలైట్లు ( మావోయిస్టులు )
మేధావులు
ఆఖరికి ... రాజకీయనాయకులు మాత్రమె.
ఈ అవినీతి వెధవలకు రైతు కన్నీళ్లు కనిపించవు, రైతు అగచాట్లు కనిపించవు, రైతు ఆత్మహత్యలు కనిపించవు.
వీళ్ళ కడుపుకు మాత్రం ముప్పొద్దులా ఆ పేద రైతు పండించిన పంటలు కావాలి, కనీసం అన్నము ముద్ద నోట్లోకి పెట్టేటప్పుడు కూడా కృతజ్ఞతగా ఆ రైతుకి నమస్కారం పెట్టుకోరు, కనీసం రైతుని గుర్తుకు తెచ్చుకోరు. ఆ రైతు వేసే బిచ్చము మెతుకులే ఈ దౌర్భాగ్యులు కుక్కలు తిన్నట్టు తింటారు.
పైవాళ్ళల్లో అందరు అటువంటి వాళ్ళు కాదు, వాళ్ళల్లో అతి కొద్దిమంది మాత్రమె మంచివాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు, డబ్బుకి అమ్ముడుపోనివాళ్ళు ఉన్నారు.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.