Thursday, June 18, 2015

మా మీద మీ జాలి అవసరము లేదు

హైదరాబాదులో నివసించే 40 లక్షల  మా ( ఆంధ్రులు ) గురించి, మొత్తం తెలంగాణలో నివశించే షుమారు ఒక కోటి మంది ఆంధ్రుల గురించి ఎవరు దిగులు పడాల్సిన అవసరము లేదు, మీ నిరర్ధక సూత్రీకరణలు ఇక్కడ పనిచేయవు. మేము హైదరాబాదు నివాసులమే, మేము ఇక్కడే ఉంటాము, మేము ఎటువంటి పరిస్థితినైనా చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎదుర్కొంటాం, మాకు ఆ నమ్మకం ఉంది, కాకపొతే మమ్మల్ని నిలువునా ముంచిన, మా జీవితాల్ని చిన్నాభిన్నం చేసిన ఆంధ్రా బ్రోకర్ నాయకులంటే  ఏమిటో,  దళారీ రాజకీయపార్తీలంటే  ఏమిటో, అవకాశవాద ఆంధ్రా మీడియా అంటే ఏమిటో, వాళ్ళ చరిత్ర ఏమిటో మాకు బాగా తెలుసు. వాళ్ళంటే మాకు అసహ్యం, జుగుప్స.
మా మీద మీ జాలి అవసరము లేదు, మా మీద  దాడులు జరుగుతాయి అని, కాబట్టి చంద్రబాబు  గారు ఆలోచిస్తాన్నారు అనే కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు, మీరు అంతగా దిగులు చెందాల్సిన అవసరము లేదు, మాకు తెలుసు ఎవరిని ఎలా ఎదుర్కోవాలో, మాకు తెలుసు ఎలా మా ఆత్మగౌరవం నిలుపుకోవాలో.
ముందు మీరు ఇప్పుడు జరుగుచున్న యుద్ధంలో  శ్రీ చంద్రబాబు గారు  జారిపోకుండా వెన్నుతిప్పకుండా ఉండే విధంగా  మీ పరువు పోనీ విధంగా చూసుకోండి, మీరు మీకోసం మీ నాయకుని కోసం బాధపదండి, మా కోసం అవసరంలేదు.
ఇప్పుడు జరుగుతోంది నిజమైన ఆత్మగౌరవ పోరాటం, ఇప్పుడు కూడా మీరు మీ నాయకుని స్వార్ధం కోసం  మా భావోద్రేకాలు రెచ్చగొట్టి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తె మీరే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పుడు ఇక్కడ ( హైదరాబాదు ) సెక్షన్ 8 అమరుజరిపే విధంగా నిజాయితీగా పని  చేయండి , మీ నాయకుని  నిజాయితీని నిరూపించుకోండి. మీ నాయకునికి చిత్తశుద్ధి ఉంటె హైదరాబాదు ని కేంద్రపాలితం చేయించండి, అప్పుడు మీరు నిఖార్సు అని నమ్ముతాం, మీ సూత్రీకరణలు నిజమని నమ్ముతాం.

"రైతు"

దేశములో "రైతు" తప్పించి అందరు దేశ ద్రోహులే, అందరు అవినీతిపరులే, అందరు దేహాలతో వ్యాపారము చేసేవాళ్ళే,
ఏ రాజకీయనాయకుడు ఒక న్యాయవాది ఒక చార్టెడ్ అకౌంటెంట్ సలహా సంప్రదింపులు సహకారం లేకుండా అవినీతికి పాల్పడ లేడు.
ఏ అధికారి రాజకీయ నాయకుల సహకారం అనుమతి లేకుండా అవినీతికి పాల్పడ లేడు,
ఏ ఒక్క అసమర్ధ న్యాయవాది / న్యాయమూర్తి రాజకీయ నాయకుల లేదా రాజకీయ పార్టీల ఆశీస్సులు అనుమతి లేకుండా ఉన్నత న్యాయమూర్తిగా పదవి పొందలేడు,
దేశములో అవినీతి విచ్చలవిడిగా పెరగడానికి ప్రధాన కారకులు,
న్యాయవాదులు
చార్టెడ్ అకౌంటెంట్ లు
న్యాయమూర్తులు
డాక్టర్లు
జర్నలిస్టులు
అధికారులు
సినిమా నటులు
నక్సలైట్లు ( మావోయిస్టులు )
మేధావులు
ఆఖరికి ... రాజకీయనాయకులు మాత్రమె.
ఈ అవినీతి వెధవలకు రైతు కన్నీళ్లు కనిపించవు, రైతు అగచాట్లు కనిపించవు, రైతు ఆత్మహత్యలు కనిపించవు.
వీళ్ళ కడుపుకు మాత్రం ముప్పొద్దులా ఆ పేద రైతు పండించిన పంటలు కావాలి, కనీసం అన్నము ముద్ద నోట్లోకి పెట్టేటప్పుడు కూడా కృతజ్ఞతగా ఆ రైతుకి నమస్కారం పెట్టుకోరు, కనీసం రైతుని గుర్తుకు తెచ్చుకోరు. ఆ రైతు వేసే బిచ్చము మెతుకులే ఈ దౌర్భాగ్యులు కుక్కలు తిన్నట్టు తింటారు.
పైవాళ్ళల్లో అందరు అటువంటి వాళ్ళు కాదు, వాళ్ళల్లో అతి కొద్దిమంది మాత్రమె మంచివాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు, డబ్బుకి అమ్ముడుపోనివాళ్ళు ఉన్నారు.



పడుపు వృత్తిలో ఉండే మహిళ....!

ఒక పేద మధ్యతరగతి  మనిషి  / రైతు అనారోగ్యంతో వస్తే  పనికిరాని పరీక్షలు మందులు చికిత్సలు ఆపరేషన్లు  అంటూ వ్యాపారము చేసుకుంటూ లక్షలు పోగేసుకుంటూ  ఉండే డాక్టర్ల కంటే,
ఒక అమాయకుడు రైతు నిరపరాధి పేదవాడు న్యాయం కోసం ఒక న్యాయవాది దగ్గరకు వస్తే అతనిని మోసముతో పీల్చి పిప్పి చేసే లేదా అవతలి పక్షం వాళ్లకు ఆ కేసుని కాసులకు అమ్ముకునే నేటి న్యావాదుల కంటే,
న్యాయాన్ని కాసుల కోసం లేదా ఇంకా ఉన్నత పదవి కోసం అక్రమ తీర్పులు ఇచ్చే నేటి  న్యాయమూర్తుల కంటే,
సినిమాల ద్వారా  ఆశ్లీలతను హింసను చూపించే నటీనటులు నిర్మాతలు దర్శకులు కంటే.
అసత్యవార్తలతో కిరాయి వార్తలతో కాసుల కోసం కలాన్ని / కెమెరాని అమ్ముకునే నేటి మీడియా కంటే,
తన దేహాన్ని నిఖార్సుగా అమ్ముకుని తన కడుపు తన కుటుంబం కడుపు  నింపుకునే ఒక పడుపు వృత్తిలో ఉండే మహిళ ఏంటో ఉన్నతురాలు, ఆమె మహా మహితాత్మురాలు, ఆమె ఒక నిస్వార్ధ  సంఘసేవకురాలు,  నిజంగా ఆమె కాళ్ళకు పాదపూజ చేస్తే పుణ్యం వస్తుంది.

Wednesday, June 10, 2015

"హైదరాబాద్ కిరాయి మీడియా",




తెలుగుజాతికి పట్టిన చీడా పీడా దరిద్రం "హైదరాబాద్ కిరాయి మీడియా",
సంఘవ్యతిరేకులు మీడియా యజమానులుగా మారి జేబుదొంగలని, గుడుంబా రవాణా చేసేవాళ్ళని, చిల్లరగాళ్ళ ని, సభ్యత సంస్కారం లేనివాళ్ళను వాళ్ళ ప్రతినిధులుగా చేసుకుని కాసుల కోసం అక్షరాన్ని దృశ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
మీరు మా ప్రతినిధులని గుర్తు చేసుకుంటేనే సిగ్గు పడుతున్నాం.. ఎన్ని కేసులన్నా పెట్టుకోండి ఎన్ని రాజకీయాలైనా చేసుకోండి ఎంత టి ఆర్ పి లైనా పెంచుకోండి గాని లేకి వాగుడు వాటికి సకిలించుడు ఆపండిరాబై.. వాగేవాడికీ సిగ్గు లేదు.. మీకంతకన్నా లేదు..

"సత్యం ఒక్కటే" ..... కానీ, భాష్యాలే వేరు,



"సత్యం ఒక్కటే"  ..... కానీ, భాష్యాలే వేరు,
ప్రదేశాన్నిబట్టి, సమయాన్నిబట్టి , అవసరాన్నిబట్టి భాష్యకారు సూత్రీకరిస్తారు.
మన రాజ్యాంగానికి మన చట్టాలకు కూడా  న్యాయకోవిదులు అలాగే సూత్రీకస్తుంటారు. ... సువేరా 

Tuesday, June 9, 2015

స్వాగతం .. సుస్వాగతం.

నేటి నుండి నా భావాలు, నా వ్రాతలు అన్నిటినీ ఒకేచోట చేర్చే ప్రయత్నములో భాగముగా నేను కూడా ఒక బ్లాగ్ లో తెద్దామనే ప్రయత్నమే ఇది.
ఆశీర్వదించండి,
 మీ
సువేరా